ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'స్కార్పియో-ఎన్' (Scorpio-N) ఎంత ప్రజాదరణ పొందుతోంది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే అత్యధిక బుకింగ్స్ పొంది, బుకింగ్స్ లో ఒక కొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా ఇటీవల కంపెనీ ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ SUV లను డెలివరీ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

నివేదికల ప్రకారం, హర్యానాలోని రోహ్‌తక్‌లో ఒక మహీంద్రా డీలర్ ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ వాహనాలను డెలివరీ చేసి ఒక అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ మెగా డెలివరీ ఈవెంట్ లో కస్టమర్లందరికి కూడా వాహనం యొక్క (కీ) తాళాలు అందించారు. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

ఈ మెగా డెలివరీ ఈవెంట్ వీడియోను ఈఆర్. సందీప్ మాలిక్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ఈ మెగా డెలివరీ ఈవెంట్ చూడవచ్చు. ఇందులో ఎక్కువగా స్కార్పియో-ఎన్ యొక్క టాప్ వేరియంట్ ఉండటం గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఎక్కువమంది ఈ వేరియంట్ బుక్ చేసుకున్నారని తెలుస్తుంది.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

కంపెనీ మొదట్లో కూడా టాప్ ఎండ్ వేరియంట్ డెలివరీలు త్వరగా చేయనున్నట్లు తెలిపింది. మహీంద్రా స్కార్పియో-ఎన్‌ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు Z8L వేరియంట్స్. వీటి ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 23.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

కంపెనీ ఇప్పటికే ఒక లక్షకు పైగా బుకింగ్స్ కూడా పొందింది, కావున డెలివరీలు వేగంగా జరపడానికి కంపెనీ తగిన సన్నాహాలు చేస్తుంది. కాగా కంపెనీ వెల్లడించిన ధరలు మొదటి 25,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయాభి ఉన్నాయి. ఆ తరువాత ధరలు పెరుగుతాయి. ఈ విషయం కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, రెండవది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇందులోని మొదటి ఇంజిన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విక్రయించబడుతుంది.

రెండవ ఇంజిన్ అయిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

మహీంద్రా స్కార్పియో-ఎన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. కావున ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా ఉన్నాయి.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి డీప్ ఫారెస్ట్, న్యాపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ మరియు గ్రాండ్ కాన్యన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఒకే రోజు 100 కంటే ఎక్కువ స్కార్పియో-ఎన్ కార్లను డెలివరీ చేసిన మహీంద్రా.. వీడియో

ఇక చివరగా మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra dealer delivers over 100 new scorpio n suvs in a single day details
Story first published: Thursday, October 6, 2022, 15:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X