కొత్త కారు డెలివెరీ తీసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మహీంద్రా స్కార్పియో-ఎన్' (Mahindra Scorpio-N) సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరిని ఆకర్షిస్తూనే ఉంది. ఈ కారంగానే ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందగలిగింది. బుకింగ్స్ ఈ SUV మరో కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ SUV ని కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఇటీవల డెలివరీ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివెరీ తీసుకున్న ఆనంద్ మహీంద్రా దానికి ఒక మంచి పేరు పెట్టాలని కూడా ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. కావున ఈ కారుకి ఒక మంచి పేరు పెట్టడంలో మీరు కూడా సహరించవచ్చు.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

ఆనంద్ మహీంద్రా కొనుగోలు చేసిన ఈ కొత్త స్కార్పియో-ఎన్ రెడ్ కలర్ లో చూడ చక్కగా ఉంది. అయితే ఇది ఏ వేరియంట్ అనేది ఖచ్చితంగా 2తెలియదు. బహుశా ఇది కంపెనీ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ అయి ఉంటుందని భావిస్తున్నాము. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

మహీంద్రా స్కార్పియో-ఎన్ దేశీయ మార్కెట్లో మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు టాప్-స్పెక్ Z8L వేరియంట్స్. వీటి ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 23.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ SUV మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి డీప్ ఫారెస్ట్, న్యాపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ మరియు గ్రాండ్ కాన్యన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

మహీంద్రా స్కార్పియో-ఎన్ అనేది కంపెనీ యొక్క లేటెస్ట్ SUV కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

అంతే కాకుండా క్రోమ్ విండో లైన్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ కొత్త SUV ని మరింత అద్భుతంగా చూపించడంలో సహాయపడతాయి.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

ఫీచర్స్ కూడా ఇందులో అద్భుతంగా ఉన్నాయి, 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.అదే సమయంలో ఇందులో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా కూడా ఉన్నాయి.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

మహీంద్రా స్కార్పియో-ఎన్ 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. ఇవి వరుసగా 175 పిఎస్ పవర్ & 400 ఎన్ఎమ్ టార్క్ మరియు 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి రెండూ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

కంపెనీ యొక్క ఇతర వాహనాల మాదిరిగానే మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా వాహన వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. కావున ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

కొత్త కారు డెలివెరీ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. దానికి మంచి పేరు మీరే పెట్టండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా స్కార్పియో-ఎన్ అనేది అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన SUV. ఈ SUV ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీ తీసుకోవడానికి గరిష్టంగా 2 సంవత్సరాల కాలం వేచి చూడాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కి ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఈ SUV మరిన్ని బుకింగ్స్ పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Saturday, October 8, 2022, 9:29 [IST]
English summary
Mahindra group chairman anand mahindras takes delivery of new scorpio n details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+