మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) కార్గో సెగ్మెంట్‌లో బొలెరో పికప్ యొక్క కొత్త సిటీ వేరియంట్ (Mahindra Bolero City Pickup Truck) ను మార్కెట్లో విడుదల చేసింది. బొలెరో పికప్ సిరీస్ లో కొత్తగా వచ్చిన బొలెరో సిటీ పికప్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ గా ఉంటుంది మరియు ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్‌ట్రా లాంగ్ మరియు ఎక్స్‌ట్రా స్ట్రాంగ్ వేరియంట్‌ లకు దిగువన విక్రయించబడుతుంది. దేశీయ మార్కెట్లో మహీంద్రా బొలెరో సిటీ పికప్ ధర రూ. 7.97 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త పికప్ ట్రక్కు మొత్తం 1,500 కిలోల బరువును మోయగలదు మరియు ఇది బెస్ట్-ఇన్-క్లాస్ మైలేజ్, ఇంజన్ టార్క్ మరియు కార్గో స్పేస్‌ను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త పికప్ యొక్క బానెట్ కొంచెం పొట్టిగా ఉంచబడింది, ఇది రద్దీగా ఉండే రోడ్లు మరియు ఇరుకైన రోడ్లపై నడపడానికి వీలుగా ఈ మార్పు చేశారు. దీని చిన్న బోనెట్ కారణంగా, ఇది తక్కువ టర్నింగ్ రేడియస్ ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి, ఇరుకైన వీధుల్లో కూడా దీనిని సులువుగా టర్న్ చేయవచ్చు.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త బొలెరో పికప్ కేవలం అవుట్‌డోర్ వినియోగానికి మాత్రమే కాకుండా, వేర్‌హౌస్ వంటి ఇండోర్ వినియోగానికి కూడా బెస్ట్ పికప్ ట్రక్కుగా ఉంటుంది. ఇక ఈ పికప్ ట్రక్కులోని ఇంజన్ విషయానికి వస్తే, కొత్త బొలెరో సిటీ పికప్ m2Di 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ ను కలిగి ఉండి, గరిష్టంగా 195 ఎన్ఎమ్ టార్క్‌ ను మరియు 48.5 కిలోవాట్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త అవతార్‌లో వచ్చిన సిటీ పిక్-అప్ ట్రక్కు దృఢమైన సస్పెన్షన్‌ సెటప్ తో లభిస్తుంది.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

సిటీ డ్రైవింగ్ పరిస్థితులలో వివిధ రకాల లోడ్‌ల కోసం వెనుక సస్పెన్షన్ బలోపేతం చేయబడింది. ఇది 2640 మిమీల కార్గో బాక్స్‌ ను కలిగి ఉండి, సుమారు 1500 కిలోల వరకు బరువును ఎత్తగలదు. ఇందులో నాలుగు చక్రాలపై 215/75 R15 (38.1 cm) సెక్షన్ టైర్లు అమర్చబడి ఉంటాయి మరియుఇవి మెరుగైన రోడ్ గ్రిప్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త పికప్ ట్రక్కు క్యాబిన్ ఎర్గోనామిక్స్ మరింత మెరుగుపరచబడింది మరియు ఇందులో పెద్ద కో-డ్రైవర్ సీట్ కూడా ఉంటుంది.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

మహీంద్రా ఈ కొత్త బొలెరో సిటీ పికప్ ట్రక్కుపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారంటీని అందిస్తుంది మరియు ఈ వాహన నిర్వహణ ఖర్చు (మెయింటినెన్స్ కాస్ట్) ను కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ట్రక్కును నిర్వహించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి కస్టమర్‌ లు తమ వ్యాపారంలో గరిష్ట లాభాలను ఆర్జించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కొత్త పికప్ మరిన్ని వ్యాపార అవకాశాలను అందించడానికి విస్తృత శ్రేణి భూభాగాలపై (వివిధ రకాల రోడ్లపై) సులువుగా ప్రయాణించేందుకు వీలుగా ఇది డిజైన్ చేయబడింది.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

అంతేకాకుండా, ఈ కొత్త బొలెరో పికప్‌ ను కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. చిన్న మరియు మధ్యతరహా వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, స్టాండ్ ఆపరేటర్లు, సరుకు రవాణాదారులు మరియు ఇతర వ్యాపారులు దీనిని తమ రోజూవారీ వ్యాపార వినియోగం కోసం ఉపయోగించుకోవచ్చు. మహీంద్రా తమ అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ఈ కొత్త బొలెరో సిటీ పికప్‌ను అందుబాటులో ఉంచింది.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త తరం మహీంద్రా స్కార్పియో (New Gen Mahindra Scorpio) వస్తోంది..

ఇదిలా ఉంటే, మహీంద్రా తమ నెక్స్ట్ జనరేషన్ స్కార్పియోను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 27, 2022వ తేదీన మహీంద్రా తమ కొత్త తరం స్కార్పియోను మార్కెట్లో విడుదల చేయనుంది మరియు ఇది కొత్త పేరుతో మార్కెట్లోకి రానుంది. మహీంద్రా ఈ కొత్త స్కార్పియోకి స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్టాండర్డ్ స్కార్పియోకి ఎగువ ఈ ప్రీమియం స్కార్పియో-ఎన్ ను ప్రవేశపెట్టనున్నారు.

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

మహీంద్రా నుండి రాబోయే ఈ కొత్త తరం స్కార్పియో-ఎన్ లాడెర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటుంది. గతంలో లీకైన స్కార్పియో-ఎన్ చిత్రాలను బట్టి గమనిస్తే, ఇది ప్రస్తుత క్లాసిక్ వెర్షన్ స్కార్పియో కంటే చాలా పెద్దదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ పూర్తిగా సరికొత్త డిజైన్‌లో రాబోతోంది. అంతే కాకుండా, కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క ఫీచర్లు మరియు పరికరాలలో అనేక అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. అలాగే, ఇందులో మరింత మెరుగైన భద్రతా ఫీచర్లను కూడా జోడించినట్లు ఇటీవలి టీజర్లు చూస్తుంటే స్పష్టమవుతోంది..

మహీంద్రా బొలెరో సిటీ పికప్ ట్రక్కు విడుదల: ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

భారతదేశంలో ఎస్‌యూవీ విభాగంలో రాజుగా పిలువబడే మహీంద్రా స్కార్పియో, మార్కెట్లోకి విడుదలైన తర్వాత కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎమ్‌జి హెక్టర్, నిస్సాన్ కిక్స్, టాటా హారియర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారుకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra launches bolero city pickup truck price specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X