మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) అందిస్తున్న పాపులర్ 7-సీటర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 (XUV500) లో కంపెనీ ఓ కొత్త కస్టమైజ్డ్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేకర్ (Mahindra XUV500 Moonracker) పేరుతో కంపెనీ స్పెషల్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. స్టాండర్డ్ ఎక్స్‌యూవీ500తో పోల్చుకుంటే, ఈ మూన్‌రేకర్ ఎడిషన్ చాలా స్పోర్టీగా మరియు ఆఫ్-రోడ్ ఫోకస్డ్ మోడల్ గా కనిపిస్తుంది.

మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

సాధారణంగా, మహీంద్రా వాహనాలను ఆఫ్టర్ మార్కెట్ కార్ మోడిఫైయర్లు కస్టమైజ్ చేయడాన్ని మనం చాలా సందర్భాల్లో చూశాం. కానీ, మహీంద్రానే స్వతహాగా తమ ఎక్స్‌యూవీ500 వాహనాన్ని కస్టమైజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌యూవీ500లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. ఇది కొత్త ఆర్మీ గ్రీన్ కలర్ పెయింట్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కలర్ ఎక్కువగా ఇండియన్ ఆర్మీ వాహనాల్లో కనిపిస్తుంది.

మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేకర్ ఎడిషన్ ను గమనిస్తే, కంపెనీ దీని ఎక్స్టీరియర్ ను పూర్తిగా కొత్త భాగాలతో కస్టమైజ్ చేసింది. ఇందులో సరికొత్త ఫ్రంట్ బంపర్, కొత్త గ్రిల్, ఐస్ క్యూబ్ స్టైల్ ఫాగ్ ల్యాంప్స్, బాడీ చుట్టూ మందపాటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, వీల్ ఆర్చెస్ చుట్టూ క్లాడింగ్ మరియు దాని మధ్యలో చిన్నపాటి ఇండియన్ ఫ్లాగ్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ మరియు వాటిపై పెద్ద ఆఫ్-రోడ్ టైర్లు, విండ్ షీల్డ్ పై భాగంలో ఆరెంజ్ ఇండికేటర్లతో కూడిన లైట్ హౌసింగ్ మరియు రూఫ్ ర్యాక్స్ పై లగేజ్ క్యారియర్ వంటి మార్పులు ఉన్నాయి.

మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

ఇందులో కేవలం ఎక్స్టీరియర్ మార్పులు మాత్రమే కాకుండా, ఇంటీరియర్ మార్పులు కూడా ఉన్నాయి. ఈ కారు లోపలి భాగాన్ని కూడా కంపెనీ పూర్తిగా కొత్తగా డిజైన్ చేసింది మరియు ఇది మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. కారు క్యాబిన్‌లో స్టాండర్డ్ 7-సీటర్ లేవుట్ ని మార్చేసి, కేవలం నాలుగు ఫుల్ సైజ్ సీట్లు మాత్రమే ఇవ్వబడ్డాయి మరియు ఈ సీట్లపై ఇప్పుడు డైమండ్ ప్యాటర్న్ తో కూడిన స్టిచింగ్ చేయబడి ఉంటుంది. రెండవ వరుస సీట్లలో ఆర్మ్‌రెస్ట్‌లు ఇవ్వబడ్డాయి, దానిపై కొన్ని కంట్రోల్స్ కూడా కనిపిస్తున్నాయి.

మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

ఇంటీరియర్ లో చేసిన ఈ మార్పుల కారణంగా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఇప్పుడు లోపల నుండి పూర్తిగా లగ్జరీ రూపాన్ని కలిగి ఉంటుంది. కారులోని సీట్లను లెదర్ కవర్‌లతో వ్రాప్ చేశారు మరియు ఇవి సౌకర్యవంతమైన హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంటాయి. కారు వెనుక భాగంలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్-ప్రేరేపిత ఎగ్జాస్ట్ టిప్ (సైలెన్సర్) ఇప్పుడు మరింత విలాసవంతమైనదిగా కనిపిస్తుంది.

మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ను కంపెనీ పరిమిత కాలపు ఆఫర్ గా విక్రయించే అవకాశం ఉంది. ఇందులో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవని తెలుస్తోంది. స్టాక్ మోడళ్లలో ఉపయోగించే అవే ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను ఈ కొత్త మూన్‌రేక్ లోనూ ఉపయోగించనున్నారు. దీని ధర, అధికారిక విడుదల తేదీ, బుకింగ్స్ తదితర వివరాలను కంపెనీ వెల్లడి చేయలేదు.

మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

మహీంద్రా ఇటీవల తమ సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన తర్వాత తమ పాత ఎక్స్‌యూవీ500 మోడళ్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. సమాచారం ప్రకారం, కంపెనీ ఇందులో ఓ కొత్త మోడల్ ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 భారతదేశంలో కంపెనీ యొక్క పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ఉంది. మార్కెట్లో ఈ మోడల్ ధరలు రూ.13.13 లక్షల నుండి రూ.17.64 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండేవి.

మతిపోగట్టే మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూన్‌రేక్ ఎడిషన్ ఆవిష్కరణ.. ఇది అందరికీ దొరుకుతుందా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 బిఎస్6 కంప్లైంట్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 155 బిహెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి ఉంటుంది. కొత్తగా రాబోయే ఎక్స్‌యూవీ500 ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని XUV300 మరియు XUV700 మధ్య తేడాను భర్తీ చేయనుంది.

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, XUV700 లాంచ్ తర్వాత, కంపెనీ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది. కాగా, మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది. కొత్త తరం మహీంద్రా థార్ (New Gen Mahindra Thar) మాదిరిగానే ఇది కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ లో 2.0 లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉపయోగించగా, డీజిల్ వెర్షన్ లో 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఇవి రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

Article Published On: Monday, March 21, 2022, 10:24 [IST]
English summary
Mahindra s own customised xuv500 moonraker edition revealed features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+