ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్': వివరాలు

రాజకీయం నాయకుల మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఎక్కువగా ఇష్టపడే 'మహీంద్రా' (Mahindra) వాహనాల్లో 'స్కార్పియో' (Scorpio) ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్కార్పియోలో అప్డేటెడ్ వెర్షన్ తీసుకురాడానికి ఇప్పటికి తగిన సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా సార్లు స్పాట్ టెస్ట్ లో కూడా కనిపించింది. అయితే కంపెనీ ఈ కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ని 2022 ఆగష్టు 12 న ఆవిష్కరించనున్నట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త స్కార్పియో క్లాసిక్‌ ఆగస్టు 12 న ఉదయం 11.30 గంటలకు ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. అయితే ఈ కొత్త అప్డేటెడ్ మోడల్ యొక్క ధరలు వెల్లడైన తరువాత, ఇప్పటికే దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ తో పాటు విక్రయించబడుతుంది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

మహీంద్రా కంపెనీ విడుదల చేయనున్న కొత్త స్కార్పియో క్లాసిక్ మొత్తం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉండనుంది. అవి క్లాసిక్ S మరియు క్లాసిక్ S11 వేరియంట్స్. ఇవి రెండు సీట్ల కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులోకి రానున్నట్లు కూడా సమాచారం. అవి 7-సీట్లు మరియు 9-సీట్లు. కావున వాహన వినియోగదారులు తమకు నచ్చిన వేరియంట్ ఎంచుకునే అవకాశం ఉంది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇది 137 బిహెచ్‌పి పవర్ మరియు 319 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని స్టాండర్డ్‌గా పొందుతుంది, అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు 4x4 సిస్టమ్‌ను తొలగించే అవకాశం ఉంది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఇప్పటికే డీలర్‌షిప్‌లను చేరుకోవడం ప్రారభించింది. అయితే ఈ మోడల్ దాదాపు దాని మునుపటి మోడల్ ని గుర్తు చేసినప్పటికీ.. ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ మరియు డిజైన్ వంటివి లేకపోలేదు. కావున కొత్త క్లాసిక్ యొక్క ముందు భాగంలో కొత్త మహీంద్రా లోగో మరియు 6 క్రోమ్ స్లాట్స్ వంటివి ఉన్నాయి. ఇవి ఈ వెహికల్ కి కొత్త రూపాన్ని అందిస్తాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

ఇది మాత్రమే కాకుండా.. ఫాగ్ లైట్ క్లస్టర్ పైన ఉన్న LED DRL లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు ట్వీక్ చేయబడిన LED టెయిల్ లైట్ సెటప్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం మీద కంపెనీ ఈ కొత్త అప్డేటెడ్ మోడల్ ని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

మహీంద్రా కంపెనీ తన కొత్త స్కార్పియో క్లాసిక్ యొక్క ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర స్కార్పియో-ఎన్ కంటే కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కావున మహీంద్రా స్కార్పియో క్లాసిక్ [ప్రారంభ ధర రూ. 10 లక్షలు ఉంటుంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మహీంద్రా యొక్క స్కార్పియో-ఎన్ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ Z2, Z4, Z6, Z8 మరియు Z8L వంటి 5 వేరియంట్‌లలో విడుదలయ్యింది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి బుకింగ్స్ పొందుతోంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ 1 లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఇది 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లేస్తుంది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

ఇక రెండవ ఇంజిన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంది.

ఆగష్టు 12 న ఆవిష్కరణకు సిద్దమైన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్'.. ఇదే: వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాలామంది వాహన ప్రియుల మనసు దోచిన స్కార్పియో ఇప్పుడు ఆధునిక అప్డేట్స్ తో రావడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ లేటెస్ట్ మోడల్ తప్పకుండా స్కార్పియో ప్రియులు మరింత ఆకట్టుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Mahindra scorpio classic set to be unveiled on 12 august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X