కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio), భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ మేకర్‌ని కింగ్ మేకర్‌గా మార్చిన మోడల్ ఇది. గడచిన కొన్నేళ్లుగా మహీంద్రా స్కార్పియో ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతూ వచ్చింది. తాజాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ సరికొత్త తరం మోడల్‌ను స్కార్పియో (Mahindra Scorpio-N) పేరుతో విడుదల చేసింది. ఈ కొత్త కారును విడుదల చేసే సమయంలో కంపెనీ తీపికబురు కూడా చెప్పింది. అదేంటంటే, కొత్త తరం స్కార్పియో-ఎన్ తో పాటుగా పాత తరం స్కార్పియోని కూడా విక్రయించడం కొనసాగిస్తామని మహీంద్రా వెల్లడించింది.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

అయితే, మహీంద్రా అనవసరంగా ఈ నిర్ణయం తీసుకుందని, కొత్త స్కార్పియో వచ్చిన తర్వాత కూడా పాత అవుడేటెడ్ మోడల్‌ను ఇంకా విక్రయించడం ఏంటని కొందరు విమర్శించారు. కానీ, వాస్తవం ఏంటంటే, మహీంద్రా స్కార్పియోకి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా బలమైన డిమాండ్ ఉంది. ప్రస్తుత ఎస్‌యూవీ ధరలను పరిగణలోకి తీసుకుంటే, పెద్ద కుటుంబాలు ఉండే వారికి స్కార్పియో ఇప్పటికీ ఓ సరసమైన ఎంపికగా నిలుస్తుంది. కాబట్టి, మహీంద్రా కూడా కొత్త మోడల్‌తో పాటుగా ఈ పాత మోడల్‌ని కూడా విక్రయించాలని చూస్తోంది.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

మహీంద్రా ఈ రెండు రకాల స్కార్పియో మోడళ్లను విక్రయించడం ద్వారా ఈ ఎస్‌యూవీ లైనప్‌లోని ధరల గ్యాప్ కూడా భర్తీ అవుతుంది. సరసమైన స్కార్పియోని కోరుకునే వారికి పాత తరం స్కార్పియో అందుబాటులో ఉండగా, మరింత ప్రీమియం మరియు అప్‌మార్కెట్ ఫీల్ ఉండే మోడల్ కోరుకునే వారికి కొత్త తరం స్కార్పియో-ఎన్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా తమ పాత తరం స్కార్పియో ఎస్‌యూవీని స్కార్పియో క్లాసిక్ పేరుతో రీలాంచ్ చేసే అవకాశం ఉంది.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

అయితే, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ పేరుతో రాబోయే ఈ పాత తరం మోడల్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేర్పులు చేయనుంది. తాజాగా, స్కార్పియో క్లాసిక్ టాప్-ఎండ్ వేరియంట్‌కు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. స్కార్పియో క్లాసిక్ మునుపటి తరం స్కార్పియో ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించబడినందున, రాబోయే మహీంద్రా క్లాసిక్ ఎస్‌యూవీలోని అనేక భాగాలు పాత మోడల్ లోనివే ఉపయోగించే అవకాశం ఉంది. ఈ స్పై చిత్రాలను గమనిస్తే, మునుపటి తరం స్కార్పియో ఎస్‌యూవీతో పోలిస్తే కొత్త స్కార్పియో క్లాసిక్ లో కొన్ని మార్పులు చేయబడ్డాయి.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

ఈ మార్పుల విషయానికి వస్తే, కొత్త స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ మహీంద్రా యొక్క లేటెస్ట్ 'ట్విన్ పీక్' లోగోను కలిగి ఉంది. అలాగే, ఇందులో కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రివైజ్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు కొత్త ఫ్రంట్ గ్రిల్ కూడా కనిపిస్తుంది. మహీంద్రా క్లాసిక్‌లోని ఇతర మార్పులను గమనిస్తే, సైడ్ ఫెండర్‌పై 'mHawk 140' బ్యాడ్జ్‌ని తొలగించారు. అంటే, దీని అర్థం కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీలోని 2.2-లీటర్, టర్బోచార్జ్డ్ 'mHawk' డీజిల్ ఇంజన్‌ను కొంచెం తక్కువ ట్యూన్‌లో ఉపయోగించే అవకాశం ఉంది.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

మహీంద్రా తమ పాత స్కార్పియోలో 140bhp mHawk డీజిల్ ఇంజన్‌ని ఉపయోగించకపోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ యొక్క బేస్ 'MX' వేరియంట్‌ను రక్షించడానికి ఇది కంపెనీ తీసుకున్న ఉద్దేశపూర్వక చర్యగా తెలుస్తోంది. ఎందుకంటే, ఈ మోడల్ కేవలం 130bhp గరిష్ట శక్తిని మరియు 300Nm గరిష్ట టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, కస్టమర్లు ఈ తక్కువ పవర్ ఉండే స్కార్పియో-ఎన్‌కి బదులుగా ఎక్కువ పవర్ ఉండే స్కార్పియో క్లాసిక్‌ను ఎంచుకుంటారనే ఉద్దేశ్యంతో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకోవచ్చు.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

ఇటీవల లీక్ అయిన అప్రూవల్ సర్టిఫికేట్ ప్రకారం, రాబోయే మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ వేరియంట్‌లు స్కార్పియో-ఎన్ 'ఎమ్ఎక్స్' వేరియంట్‌కు శక్తినిచ్చే అదే 2.2-లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ యొక్క 130bhp యూనిట్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా, క్లాసిక్ స్కార్పియో మోడల్ S MT 7S, S MT 9S, S11 MT 7S, S11 MT 9S మరియు S11 MT 7S CC అనే ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని లీక్ అయిన సర్టిఫికేట్ వెల్లడించింది.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, తాజాగా లీకైన స్పై చిత్రాలు టాప్-ఎండ్ వేరియంట్ స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీని సూచిస్తున్నాయి. ఇంకా ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ మధ్యలో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు కొత్త 5-స్పోక్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

మహీంద్రా స్కార్పియో చాలా కాలంగా మార్కెట్లో ఉన్నప్పటికీ, ఆ మోడల్ పట్ల కంపెనీ చూపిన నిబద్ధత కారణంగా భారతదేశంలో ఇది చాలా నమ్మకమైన మోడల్‌గా నిలిచి, అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా, మార్కెట్లోకి కొత్త తరం స్కార్పియో-ఎన్ మోడల్ వచ్చినప్పటికీ, ఇతర తయారీదారులు ఉత్పత్తి చేసే ఆధునిక ఎస్‌యూవీల కంటే కూడా మునుపటి తరం స్కార్పియోకి ఇప్పటికీ భారతీయ మార్కెట్లో బలమైన డిమాండ్ ఉంది.

కొత్త స్కార్పియో-ఎన్ వచ్చిందని పాత స్కార్పియోని మర్చిపోకండి.. ఇదిగో ఇది మీకోసమే తిరిగొస్తోంది..!

కొత్త సార్పియో-ఎన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా జూన్ 2022 నెలలో మహీంద్రా మొత్తం 4,131 యూనిట్ల పాత స్కార్పియో ఎస్‌యూవీలను విక్రయించింది. దీన్ని బట్టే అర్థమవుతుంది పాత తరం స్కార్పియో యొక్క డిమాండ్ ఏంటో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహీంద్రా మునుపటి తరం స్కార్పియో ఎస్‌యూవీని డిస్‌కంటిన్యూ చేయడం సమంజసం కాదు. కాబట్టి, స్కార్పియో 'క్లాసిక్' ను విడుదల చేయాలనుకోవడం మహీంద్రా తీసుకునే మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. మీరేమంటారు..?

Source: Rushlane

Most Read Articles

English summary
Mahindra scorpio classic spy pics revealing new updates and alloy wheels
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X