ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

ఒకప్పుడు రాయలసీమలో ఎక్కువగా కనిపించే వాహనాలలో 'స్కార్పియో' (Scorpio) ఒకటి. ఎక్కువగా ఈ వాహనాలు రాజకీయ నాయకుల వినియోగంలో ఉండేవి. అంతే కాకుండా ఈ వాహనాలు వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగానే మార్కెట్లో ఒకప్పటి నుంచి తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. అయితే రోజులు మారుతున్న కొద్దీ వాహన వినియోగదారులు కూడా ఇందులో కొంత కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ కారణంగా కంపెనీ ఇటీవల అప్డేటెడ్ వెర్షన్ 'స్కార్పియో క్లాసిక్' (Scorpio Classic) తీసుకురావడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

మహీంద్రా కంపెనీ ఇటీవల తన పాపులర్ కార్ అయిన 'స్కార్పియో'ని 'క్లాసిక్' పేరుతో భారతీయ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ఆవిష్కరణ సమయంలో ఆగష్టు 20 న ఈ SUV విడుదలవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇది మార్కెట్లో ఎస్ మరియు ఎస్11 అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

మహీంద్రా స్కార్పియో యొక్క మునుపటి మోడల్ మొత్తం 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఇప్పుడు 5 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, రెడ్ రేజ్, డి'సాట్ సిల్వర్ మరియు గెలాక్సీ గ్రే కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

స్కార్పియో క్లాసిక్ మునుపటికంటే కూడా ఆధునిక డిజైన్ కలిగి ఉంది. ఈ కొత్త SUV ముందు భాగంలో కొత్త 'లోగో' ఉంది. అదే సమయంలో ఫ్రంట్ డిజైన్ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంది. దీనిని మొదటి సారి చూడగానే దాని మునుపటి మోడల్ ని గుర్తుకు తెస్తుంది. కానీ ఇందులోని రిఫ్రెష్డ్ ఫ్రంట్ గ్రిల్‌ దీనిని స్పష్టంగా కొత్తది అని చూపించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో పాటు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కోసం కొత్త డిజైన్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ కూడా ఇక్కడ చూడవచ్చు.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

సైడ్ ప్రొఫైల్ లో 5 స్పోక్ 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌, డైమండ్-కట్ ఫినిషింగ్ పొందుతాయి. డోర్‌లపైన డ్యూయల్ టోన్ క్లాడింగ్‌ కూడా దీనికి మరింత ఆకర్షణను అందిస్తుంది. రియర్ ప్రొఫైల్ దాదాపు మునుపటి మోడల్ మాదిగానే ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యొక్క కొలతలు విషయానికి వస్తే, దీని పొడవు 4,456 మిమీ, వెడల్పు 1,820 మిమీ, ఎత్తు 1,995 మిమీ మరియు వీల్‌బేస్ 2,680 మిమీ వరకు ఉంటుంది. అయితే ఇందులో వాటర్ వాడింగ్ కెపాసిటీ 500 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది ఆఫ్ రోడింగ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ ఇంటీరియర్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ పొందుతుంది, కావున మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి. ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

ఇందులో రెండవ వరుస ప్యాసింజర్ ల కోసం ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటివి ఉన్నాయి. ఇది 7 సీటర్ మరియు 9 సీటర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ వేరియంట్ లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో ఒక బెంచ్‌ ఉంటుంది. 9 సీటర్ విషయానికి వస్తే, ఇందులో రెండవ వరుసలో ఒక బెంచ్ మరియు వెనుకవైపు నలుగురికి జంప్ సీట్లు లభిస్తాయి.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

ఇందులో 2.2-లీటర్, టర్బో-డీజిల్, mHawk ఇంజిన్‌ ఉంటుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ స్కార్పియో క్లాసిక్‌లో రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే ఇవ్వబడుతుంది మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇవ్వబడదు. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఈ కారణంగా 14 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

2022 మహీంద్రా స్కార్పియో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ప్రస్తుతం రెండు ఎయిర్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. అయితే భవిష్యత్ లో మరిన్ని అందించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మునుపటి మోడల్ లోనే సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

మహీంద్రా తన క్లాసిక్ మోడల్‌ను భారతదేశంలో మాత్రమే కాకుండా భూటాన్, నేపాల్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కంపెనీ ఇప్పుడు తన ప్రయాణాన్ని ఎలక్ట్రిక్ వాహన విభాగంవైపు మరల్చింది. ఇందులో భాగంగానే ఆగష్టు 15 న 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. ఇవి 2024 మరియు 2026 లలో భారతీయ మార్కెట్లో విడులవుతాయని కంపెనీ తెలిపింది.

ఆగష్టు 20 న నేను వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

స్కార్పియో ప్రియులంతా కూడా ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొత్త SUV యొక్క డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ధర మాత్రమే ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ఇది ఆకర్షణీయమైన ధర వద్ద విడుదలవుతుందని ఆశిస్తున్నాము. అదే సమయంలో మునుపటి స్కార్పియో ఎంత ఆదరణ పొందిందో ఇది తప్పకుండా అంత ఆదరణ పొందుతుందని కూడా ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2022, 10:57 [IST]
English summary
Mahindra scorpio classic to be launched on 20th august details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+