సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన Mahindra Scorpio N - అమ్మకాల్లో మరింత అదరగొడుతుందా..!!
క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన వాహనం అత్యంత సురక్షితమైన వాహనంగా పరిగణించబడుతుంది. కావున వాహన కొనుగోలుదారులు కూడా అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ కలిగిన వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇటీవల జరిగిన క్రాష్ టెస్ట్‌లో 'మహీంద్రా స్కార్పియో ఎన్' 5-స్టార్ రేటింగ్ పొందింది.
దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా కంపెనీ యొక్క 'స్కార్పియో ఎన్' (Scorpio N) ఇటీవల నిర్వహించిన గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సేఫ్టీలో సురక్షితమైన వాహనంగా నిలిచింది. స్కార్పియో ఎన్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 34 పాయింట్లకు గాను 29.25 పాయింట్లు సాధించి మొత్తం మీద అడల్ట్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందగలిగింది.

మహీంద్రా స్కార్పియో ఎన్ డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల మరియు మెడ వంటి భాగాలకు మంచి రక్షణ అందిస్తుంది. అయితే డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఛాతి భాగం రక్షణను మాత్రం మార్జినల్‌గా అభివర్ణించింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా స్కార్పియో- ఎన్ మంచి రక్షణను అందిస్తుందని నిర్దారించబడింది. ఇందులో 17-పాయింట్లకు గాను 16-పాయింట్లు స్కోర్ చేసింది. అంతే కాకుండా బాడీ షెల్ మరియు ఫుట్‌వెల్ ప్రాంతం స్థిరంగా ఉన్నాయని రుజువుచేయబడింది.
ఇక చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్ విషయానికి వస్తే, ఇందులో మహీంద్రా స్కార్పియో ఎన్ 49 పాయింట్లకు గానూ 28.93 పాయింట్లు సాధించింది. మొత్తమ్ మీద చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో 18 నెలలు మరియు 3 సంవత్సరాల పిల్లల డమ్మీలను ఉపయోగించారు. ఈ రెండు డమ్మీలు వెనుక కూర్చోబెట్టారు. వాటిని i-సైజ్ ఎంకరేజ్‌లు మరియు సపోర్ట్ లెగ్‌ని ఉపయోగించి కారులో ఉంచారు
కొత్త గ్లోబల్ NCAP ప్రోటోకాల్స్ ప్రకారం.. ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ, పోల్ సైడ్ ఇంపాక్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ అవసరాలకు అనుగుణంగా అవసరమైన స్కోర్‌లను పొందినట్లయితే మాత్రమే ఆ వాహనానికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడుతుంది. పాత ప్రోటోకాల్‌ల ప్రకారం టెస్ట్ చేయబడిన వాహనాలు కొత్త ప్రోటోకాల్ ప్రకారం టెస్ట్ చేసిన వాటితో పోల్చుకుంటే చాలా వరకు భిన్నంగా ఉంటుంది.
ప్రస్తుతం గ్లోబల్ NCAP ప్రోటోకాల్స్ అన్నీ మార్చబడ్డాయి. కావున ఇప్పుడు మరింత కఠినంగా క్రాష్ టెస్ట్స్ నిర్వహిస్తారు. కావున ఖచ్చితమైన భద్రతా రేటింగ్ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. మొత్తమ్ మీద మునుపటి క్రాష్ టెస్ట్‌తో పోల్చుకుంటే, కొత్త క్రాష్ టెస్ట్ మరింత ఆధునికమైనదిగా పరిగణిస్తారు. కావున ఈ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఏ వాహనమైన అది అత్యంత సురక్షితమైన వాహనంగా ద్రువీకరించబడుతుంది.
మహీంద్రా స్కార్పియో ఎన్ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు Z8L వేరియంట్స్. ఈ SUV ధరలు రూ.11.99 లక్షల నుండి రూ.21.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి రెండు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతాయి.
మహీంద్రా స్కార్పియో ఎన్ సేఫ్టీ రేటింగ్‌పై మా అభిప్రాయం:
మహీంద్రా కంపెనీ యొక్క వాహనాలను దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. అయితే ఈ సమయంలో 'మహీంద్రా స్కార్పియో ఎన్' సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందటం వల్ల బ్రాండ్ పై ప్రజలకున్న నమ్మకం మరింత పెరుగుతుంది. కావున ఈ SUV యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








