స్కార్పియో-ఎన్ (Scorpio-N) ఆటోమేటిక్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ల ధరలు వెల్లడి చేసిన మహీంద్రా
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ కొత్త తరం స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) ఎస్‌యూవీ యొక్క ఆటోమేటిక్, 4X4 (ఆల్-వీల్ డ్రైవ్) మరియు 6-సీటర్ వేరియంట్‌ల ధరలను కంపెనీ వెల్లడి చేసింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటోమేటిక్ వేరియంట్ ధర (Z4 AT 7S Petrol వేరియంట్) రూ. 15.45 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఇందులో టాప్-ఎండ్ ఆటోమేటిక్ (Z8L 4WD AT 7S Diesel) వేరియంట్ ధర రూ. 23.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ లో కంపెనీ మొత్తం 11 వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందిస్తోంది మరియు 5 వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ (4X4) ను అందిస్తోంది. ఏడు-సీట్ల వేరియంట్లతో పోలిస్తే, ఆరు-సీట్ల వేరియంట్‌లు దాదాపు రూ. 20,000 అధిక ధరను కలిగి ఉంటాయి. అలాగే, ఆటోమేటిక్ వేరియంట్‌లు మరియు 4x4 వేరియంట్‌లు కొంత ఖరీదైనవిగా ఉంటాయి. ఈ వేరియంట్‌లు వరుసగా రూ. 1.96 లక్షలు మరియు రూ. 2.45 లక్షల ప్రీమియం ధరను కలిగి ఉంటాయి.

మహీంద్రా ఇదివరకు వెల్లడించినట్లుగా, స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని ముందుగా బుక్ చేసుకున్న మొదటి 25,000 మంది కస్టమర్ లకు మాత్రమే ఈ ప్రారంభ ధరలు వర్తిస్తాయి. ఆ తర్వాత కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరలు వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే, స్కార్పియో-ఎన్ కారుని బుక్ చేసుకున్న కస్టమర్లు తమ బుకింగ్ ను మోడిఫై చేసుకునేందుకు మరియు తమకు నచ్చిన స్కార్పియో-ఎన్ వేరియంట్‌ను ఎంచుకునేందుకు జూలై 30 నుండి ఆగస్టు 15 వరకు గడువు ఉంటుంది.
| Mahindra Scorpio-N | Price |
| Z4 AT 7S Petrol | ₹15.45 Lakh |
| Z8 AT 7S Petrol | ₹18.95 Lakh |
| Z8L AT 7S Petrol | ₹20.95 Lakh |
| Z8L AT 6S Petrol | ₹21.15 Lakh |
| Z4 AT 7S Diesel | ₹15.95 Lakh |
| Z4 4WD MT 7S Diesel | ₹16.44 Lakh |
| Z6 AT 7S Diesel | ₹16.95 Lakh |
| Z8 4WD MT 7S Diesel | ₹19.94 Lakh |
| Z8 AT 7S Diesel | ₹19.45 Lakh |
| Z8L 4WD MT Diesel | ₹21.94 Lakh |
| Z8L AT 7S Diesel | ₹21.45 Lakh |
| Z8L AT 6S Diesel | ₹21.65 Lakh |
| Z8 4WD AT 7S Diesel | ₹21.90 Lakh |
| Z8L 4WD AT 7S Diesel | ₹23.90 Lakh |

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 ప్రధాన నగరాల్లో టెస్ట్ డ్రైవ్ లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడిన తర్వాత ఈ నెలాఖరు నుండి దేశంలోని ఇతర నగరాల్లో కూడా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్ లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. మహీంద్రా కొత్త వాహనాలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, కంపెనీ వాటిని పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. ఫ్యాక్టరీ సామర్థ్యం, సెమీకండక్టర్ చిప్స్ కొరత, విడిభాగాల లభ్యత వంటి సవాళ్ల కారణంగా మహీంద్రా తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటోంది.

మహీంద్రా ప్రస్తుతం భారతదేశంలో దాదాపు ప్రతినెలా 6,000 యూనిట్ల మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తోంది. అయినప్పటికీ, ఈ మోడల్ యొక్క వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు సంవత్సరం వరకూ ఉంటోంది. అలాగే, మహీంద్రా ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో 20,000 యూనిట్ల స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం, మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్ 7 విభిన్న రంగులో అందుబాటులో ఉంది. వీటిలో డాజ్లింగ్ సిల్వర్, ఎవరెస్ట్ వైట్, నాపోలి బ్లాక్, గ్రాండ్ కెన్యాన్, రాయల్ గోల్డ్, రెడ్ రేజ్ మరియు డీప్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

స్కార్పియో-ఎన్ ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. అయితే, ఇందులోని 2.2-లీటర్ mHark డీజిల్ ఇంజన్ మాత్రం రెండు విభిన్న ట్యూన్‌లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలోని 2.0-లీటర్ mStallion పెట్రోల్ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మొదటితో తక్కువ ట్యూనింగ్‌లో లభించే 2.2-లీటర్ mHawk ఇంజన్. ఇది 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇందులో శక్తివంతమైన డీజిల్ ఇంజన్ 172.4 బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేస్తుంది. అయితే, దీని టార్క్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లలో భిన్నంగా ఉంటుంది.

మహీంద్రా ఈ ఎస్‌యూవీలో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, యాంటీ-పించ్ డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ వన్ టచ్ పవర్ విండోస్, రియర్ ఏసి కంట్రోల్స్, ల్యాంప్ మరియు కూలింగ్ ఫీచర్ తో కూడిన గ్లోవ్ బాక్స్, సన్ గ్లాస్ హోల్డర్, మొబైల్ హోల్డర్‌తో కూడిన సీట్ మ్యాప్ పాకెట్, నావిగేషన్‌తో కూడిన 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సోనీ 3డి ఆడియో సిస్టమ్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది.

సేఫ్టీ పరంగా చూసుకుంటే, కంపెనీ ఈ కారులో క్రాష్ కంప్లైంట్ స్ట్రక్చర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ఫ్రంట్, సైడ్స్ మరియ కర్టెన్), ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), డ్రైవర్ డ్రౌజీనెస్ అలెర్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రిఫిల్, ఇ-కాల్, SOS స్విచ్ ISOFIX మరియు i-SIZE కంపాటబిలిటీ వంటి ఫీచర్లను అందిస్తోంది. దేశీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇది 6-సీటర్ మరియు 7-సీటర్, పెట్రోల్ మరియు డీజిల్, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్, రియర్-వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








