'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

'మహీంద్రా అండ్ మహీంద్రా' గత నెలలో దేశీయ విఫణిలో తన కొత్త 'స్కార్పియో-ఎన్' (Scorpio-N) అధికారికంగా లాంచ్ చేసింది. అయితే లాంచ్ సమయంలో కంపెనీ బుకింగ్స్ మరియు డెలివరీ, టెస్ట్ డ్రైవ్ వంటి వాటిని గురించి అధికారిక సమాచారం అందివ్వలేదు. కావున ఇప్పుడు బుకింగ్స్ మరియు ఇతర వివరాలను అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

మహీంద్రా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, తన 'స్కార్పియో-ఎన్' కోసం బుకింగ్స్ రేపటి (జులై 30) నుంచి అధికారికంగా ప్రారంభమవుతాయి. కావున కస్టమర్లు రేపు 11 గంటలకు కంపెనీ యొక్క డీలర్‌షిప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ముందుగా డెలివరీలు చేయబడతాయి.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

మహీంద్రా స్కార్పియో-ఎన్ కొనుగోలుచేయాలకునే కస్టమర్లకోసం కంపెనీ ఇప్పుడు ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా కల్పించింది. కావున కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ బుకింగ్స్ ప్రారంభమైన తరువాత, కార్ట్‌కు జోడించే సదుపాయం జూలై 5 నుండి అందుబాటులో ఉంటుంది. కావున అప్పుడు కస్టమర్లు మీకు కావాల్సిన కలర్ ఆప్సన్స్, ఇంజిన్ ఆప్సన్, సీట్ కెపాసిటీ మరియు డీలర్‌ వంటి వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

కంపెనీ యొక్క స్కార్పియో-ఎన్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ధరలు కేవలం మొదట బుక్ చేసుకున్న 25,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత కంపెనీ దీని ధరను పెంచే అవకాశం ఉంది. కావున కొనుగోలుదారులు త్వరపడాల్సి ఉంటుంది.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

ఇప్పుడు కొత్త స్కార్పియో-ఎన్ బుక్ చేసుకున్న తరువాత ఏదైనా మార్పులు (కలర్ ఆప్సన్,వేరియంట్) చేయాలనుకుంటే 2022 ఆగష్టు 15 వరకు చేసుకోవచ్చు. ఆ తరువాత ఈ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ బుక్ చేసుకున్న కస్టమర్లలు డెలివరీలు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతాయి. అయితే అంతకంటే ముందు జులై 05 నుంచి టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవుతాయి. జులై 05 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 నగరాల్లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దేశం మొత్తం మీద టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవుతాయి.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే మహీంద్రా స్కార్పియో-ఎన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దీని కింద వినియోగదారులకు 6.99% వడ్డీ రేటు లోన్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ లోన్ వ్యవధి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండే అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సి-షేప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త లోగో వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

స్కార్పియో-ఎన్ లో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా ఉన్నాయి.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఇది 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లేస్తుంది.

ఇక రెండవ ఇంజిన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

2022 స్కార్పియో-ఎన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుకింగ్స్, డెలివరీ మరియు టెస్ట్ డ్రైవ్ వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా తన కొత్త స్కార్పియో-ఎన్ విడుదల చేసినప్పటి నుంచి కూడా చాలామంది కస్టమర్లు ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ప్రారంభిస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. కావున తప్పకుండా ఈ లేటెస్ట్ ఎస్యువి తప్పకుండా మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతుంది అని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Mahindra scorpio n booking start from july 30th details
Story first published: Friday, July 29, 2022, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X