స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

భారతీయ మార్కెట్లో ఇప్పటికే మహీంద్రా కంపెనీ తన 'స్కార్పియో-ఎన్' ను రూ. 11.99 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. అదే సమయంలో కంపెనీ దీని కోసం కేవలం 1 నిముషంలోనే 25,000 బుకింగ్స్ మరియు 30 నిముషాల్లోనే ఏకంగా 1 లక్ష బుకింగ్స్ స్వీకరించి బుకింగ్స్ లో కొత్త రికార్డ్ బద్దలు కొట్టింది.

Recommended Video

దేశీయ మార్కెట్లో 'Scorpio Classic' ఆవిష్కరించిన Mahindra | వివరాలు

అయితే ఇప్పుడు డెలివరీలకు సంబంధించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 సెప్టెంబర్ 26 నుండి ఈ స్కార్పియో-ఎన్ యొక్క డెలివరీలను ప్రారంభించనుంది. ఈ సంవత్సరం నవంబర్ నాటికి మొత్తమ్ 25,000 యూనిట్ల డెలివరీలను పూర్తి చేయటానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే మొదటి బుక్ చేసుకున్న వారికి ముందుగా డెలివరీలు ప్రారంభమవుతాయి. అంతే కాకుండా కంపెనీ మొదట్లో వెల్లడించిన ధరలు కేవలం ఈ 25,000 యూనిట్లకు మాత్రమే పరిమితం అవుతాయి. తరువాత ధరలు పెరుగుతాయి. ఈ విషయం కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

డెలివరీలు ప్రారంభమైన మొదటి 10 రోజుల్లోనే 7000 యూనిట్ల వాహనాలు డెలివరీ చేయడానికి సిద్దమవుతుంది. ఇందులో ఎక్కువ భాగం టాప్ స్పెక్ వేరియంట్ అయిన Z8 L వేరియంట్స్ ఉన్నట్లు సమాచారం.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

కంపెనీ స్కార్పియో-N కోసం బుకింగ్‌లు 2022 జూలై 30న ప్రారంభించింది. ఈ బుకింగ్స్ లో కూడా ఎక్కువ భాగం టాప్ వేరియంట్ బుక్ చేసుకున్నారు. అయితే ఇప్పటికి కంపెనీ ఎన్ని బుకింగ్స్ స్వీకరించింది అనే అధికారిక సమాచారం అందించలేదు. అయితే ఇప్పటికే మహిందా XUV700 మరియు మహీంద్రా థార్ వంటి వాటిని ఇంకా డెలివరీ చేయాల్సి ఉంది. కావున స్కార్పియో-ఎన్ యొక్క డెలివరీలు ఎలా ఉంటాయో త్వరలో తెలుస్తాయి.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఇది 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

ఇక రెండవ ఇంజిన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా ఉన్నాయి.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

ఇక డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సి-షేప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

మహీంద్రా స్కార్పియో-ఎన్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

స్కార్పియో-ఎన్ డెలివరీల గురించి స్పష్టం చేసిన మహీంద్రా: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా కంపెనీ నుంచి మరో పాపులర్ కారు స్కార్పియో-ఎన్ వివలైంది, బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇక డెలివరీలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఆ డెలివరీలు కూడా ఎప్పుడు జరుగుతాయి అనేది కంపెనీ తెలిపింది. కానీ 25,000 యూనిట్ల తరువాత ఎంత ధరలు పెరుగుతాయి అనేది ప్రశ్నార్థకమ్. దీని గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 31, 2022, 8:00 [IST]
English summary
Mahindra scorpio n delivery to start from 26th september details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+