జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం ఈ కొత్త ఎస్‌యూవీని జూన్ 27న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త స్కార్పియో-ఎన్ కోసం అధికారికంగా బుకింగ్‌లు ఓపెన్ చేయనప్పటికీ, డీలర్‌షిప్ స్థాయిలో కొంతమంది డీలర్లు ఈ కారు కోసం అనధికారికంగా బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ విడుదలైన రోజు నుండే కొత్త 2022 స్కార్పియో-ఎన్ కోసం టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయంలో చేసినట్లుగా కాకుండా, కంపెనీ తమ కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ విషయంలో లాంచ్ తేది, బుకింగ్ తేదీ, షోరూమ్ డిస్‌ప్లే తేదీ మరియు టెస్ట్ డ్రైవ్ తేదీని ఒకే రోజుగా ఉంచాలని చూస్తున్నట్లు సమాచారం. కొత్త తరం 2022 స్కార్పియో-ఎన్ మార్కెట్లో విడుదల కావడానికి ముందే భారీ హైప్‌ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ కారు గురించిన వివరాలు ఒక్కొక్క టీజర్‌లో వెల్లడి చేస్తూ వస్తోంది. ఇప్పటికే కొత్త తరం స్కార్పియో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడి చేసింది.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ దాని పాత మోడల్ కంటే కాస్తంత పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ డిజైన్ కూడా పాత మోడల్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ఫ్రంట్ లుక్ పూర్తిగా మారిపోయింది. ముందువైపు సన్నటి ఎల్ఈడి ట్విన్-పాడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు కొత్త ఫ్రంట్ బంపర్‌లతో ఇది మునుపటి కన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ స్లాట్లు, సిల్వర్ రూఫ్ రైల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త డిజైన్ తో కూడిన డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త మహీంద్రా బ్రాండ్ లోగోతో ఇది చాలా ప్రీమియంగా ఉంది.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

స్కార్పియో-ఎన్ వెలుపలి భాగంలోనే కాకుండా లోపలి భాగంలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని డిజైన్ ఎలిమెంట్స్ కూడా రీడిజైన్ చేయబడినవే. దీని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ నిజానికి టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి200 మోడల్ ని పోలి ఉన్నట్లు అనిపిస్తుంది. కంపెనీ విడుదల చేసిన అధికారిక చిత్రాల ప్రకారం, దాని ఇంటీరియర్‌ డార్క్ టాన్ షేడ్‌లో ఉన్నట్లు చూపుతున్నాయి. అలాగే, సీట్ల కోసం కాంట్రాస్ట్ బ్లాక్ డ్యూయల్-టోన్ సెటప్ అప్‌హోలెస్ట్రీని కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

ఈ ఎస్‌యూవీని డ్యాష్‌బోర్డ్, ఏసి వెంట్స్, సెంటర్ కన్సోల్ మరియు డోర్ హ్యాండిల్స్‌పై బ్రష్డ్ అల్యూమినియం ట్రిమ్‌లను ఉపయోగించింది. ఇవి ఇంటీరియర్ కు మరింత వన్నె తెచ్చిపెడుతాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లేఅవుట్‌లో రెండు వెర్షన్‌లను అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ మధ్యలో ఓ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అమర్చబడి ఉంది.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కంపెనీ యొక్క ఆర్డినాక్స్ సూట్ అనే లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ ద్వారా అందించబడుతుంది మరియు ఇది కారు ఓనర్ యొక్క స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 మాదిరిగానే ఇందులో కూడా సోనీ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను కంపెనీ దాని టాప్-ఎండే వేరియంట్లోల అందించే అవకాశం ఉంది. అయితే, ఇందులో ఉపయోగించిన స్పీకర్ల సంఖ్య ఎక్స్‌యూవీ700 కన్నా భిన్నంగా ఉండవచ్చు.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

మరికొద్ది రోజుల్లోనే మహీంద్రా స్కార్పియో-ఎన్ అధికారికంగా మార్కెట్లో విడుదల కానున్న నేపథ్యంలో, కంపెనీ దాని పవర్‌ట్రైన్ ఆప్షన్ వివరాలను కూడా సూచనప్రాయంగా వెల్లడి చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ యూజర్ "ఇది (స్కార్పియో-ఎన్) మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 4x4 వస్తుందా" అనే ప్రశ్నను పోస్ట్ చేయగా, కంపెనీ దీనికి సమాధానమిస్తూ.. రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్స్, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ మరియు 2WD (2-వీల్ డ్రైవ్), 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) ఆప్షన్లతో అందించబడుతుంది" అని సమాధానం ఇచ్చింది.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

మరో నివేదిక ప్రకారం, కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ ఆఫ్-రోడ్ మోడ్‌లతో పాటు 4-హై మరియు 4-లో గేర్ నిష్పత్తులను కూడా పొందుతుందని సమాచారం. ఇంతకు ముందు లీక్ అయిన పత్రాల ప్రకారం, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మహీంద్రా యొక్క ట్రేడ్‌మార్క్ చేసిన '4Xplore' ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌లో భాగంగా ఉంటుంది మరియు ఇది నాలుగు ప్రీ-సెట్ మోడ్‌లతో వస్తుంది. వీటిలో రఫ్, స్నో, మడ్ మరియు వాటర్ మోడ్స్ ఉన్నాయి.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

మహీంద్రా స్కార్పియో-ఎన్ 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ రెండు ఇంజన్ల పవర్, టార్క్ గణాంకాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇతర మహీంద్రా ప్రీమియం వాహనాల మాదిరిగానే ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది.

జూన్ 27న మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదల.. అదే రోజున టెస్ట్ డ్రైవ్‌లు కూడా ప్రారంభం!

గతంలో లీకైన ఓనర్ మాన్యువల్ ప్రకారం, కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ 4,662 మిమీ పొడవు, 1,917 మిమీ వెడల్పు, 1,870 మిమీ ఎత్తు మరియు 2,750 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. సీటింగ్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ 2+2+2 (6 సీటర్) లేదా 2+2+3 సీటింగ్ (7 సీటర్) ఆప్షన్లతో అందించబడుతుంది. ఇందులో మొదటిది 50:50 స్ప్లిట్ సీట్లు మరియు రెండోది 60:40 స్ప్లిట్ సీట్లను పొందుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra scorpio n is all set for launch on 27th june 2022 test drives starts after launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X