'మహీంద్రా స్కార్పియో ఎన్' లో మరో 5 వేరియంట్స్ - ధరలు & వివరాలు

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన 'స్కార్పియో ఎన్' (Scorpio N) యొక్క మరో ఐదు వేరియంట్లను పరిచయం చేసింది. కంపెనీ పరిచయం చేసిన ఈ ఐదు వేరియంట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఈ సంవత్సరం (2022) మహీంద్రా (Mahindra) కంపెనీ లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ అతి తక్కువ కాలంలోని అత్యధిక ప్రజాదరణ పొందగలిగింది. ఇప్పటికే ఊహకందని రీతిలో కంపెని ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించింది. కొన్ని వేరియంట్స్ కోసం కస్టమర్లు దాదాపు రెండు సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు మరో ఐదు వేరియంట్స్ పరిచయం చేసింది.

స్కార్పియో ఎన్ లో మరో 5 వేరియంట్స్ పరిచయం చేసిన మహీంద్రా

కంపెనీ ఇప్పుడు పరిచయం చేసిన ఇది వేరియంట్స్ తో కలిపి మహీంద్రా స్కార్పియో ఎన్ మొత్తం 30 వేరియంట్స్ లో లభిస్తుందని తెలుస్తోంది. కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఐదు వేరియంట్స్ లో రెండు పెట్రోల్ వేరియంట్స్ (Z4 పెట్రోల్ (E), Z2 పెట్రోల్ (E)), మిగిలిన మూడు డీజిల్ వేరియంట్స్ (Z2 డీజిల్ (E), Z4 డీజిల్ (E) మరియు Z4 డీజిల్ (E) AWD).

పెట్రోల్ వేరియంట్స్ లో ఇప్పడు చేరిన వేరియంట్స్ ధరలు రూ. 12.49 లక్షలు (Z2 పెట్రోల్ (E)) మరియు రూ. 13.99 లక్షలు (Z4 పెట్రోల్ (E)). ఇక డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 12.99 లక్షలు (Z2 డీజిల్ (E), రూ. 14.99 లక్షలు (Z4 డీజిల్ (E)) మరియు రూ. 16.94 లక్షలు (Z4 డీజిల్ (E) AWD) (ధరలు, ఎక్స్-షోరూమ్). కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త వేరియట్స్ ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు హిల్ హోల్డ్ అసిస్ట్‌ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఇంతకుముందు Z4 ఆటోమేటిక్ ట్రిమ్‌లు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వాటిలో మాత్రమే అందుబాటులో ఉండేవి. కాగా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటాయి. తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటుకి మార్పులు లేదు ఇందులో 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్స్ ఉంటాయి. 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతాయి. స్కార్పియో N రియర్-వీల్ డ్రైవ్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది, అయితే డీజిల్ వేరియంట్‌లు ఫోర్-వీల్ డ్రైవ్‌ను ఆప్సనల్ గా పొందుతాయి. అంతే కాకుండా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక డెలివరీల విషయానికి వస్తే, మహీంద్రా కంపెనీ తన స్కార్పియో ఎన్ డెలివరీలను ప్రారంభించినప్పటి నుంచి హై ఎండ్ వేరియంట్‌లను డెలివరీ చేయడంపై దృష్టి సారించింది. కాగా కంపెనీ ఇటీవల మిడ్-లెవల్ Z4 ట్రిమ్‌ను కూడా డెలివరీ చేయడం ప్రారంభించింది. అంతే కాకుండా కంపెనీ ఈ SUV కి భారీ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది, కావున డెలివెరీ వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి కావాల్సిన ప్రయత్నాలను కూడా చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 28, 2022, 6:30 [IST]
English summary
Mahindra scorpio n new five variants price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+