మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం స్కార్పియో మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో, కొత్త 2022 స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీకి సంబంధించి మహీంద్రా ఓ కొత్త టీజర్ వీడియోని విడుదల చేసింది. ఈ కొత్త టీజర్ వీడియో రాబోయే మమహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) ఎస్‌యూవీ యొక్క పొడవైన రైడింగ్ పొజిషన్‌ను చూపుతుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం కంపెనీ విడుదల చేసిన 30-సెకన్ల టీజర్ వీడియోలో ఇది సెగ్మెంట్లో కెల్లా 'ఎత్తైన కమాండ్ సీటింగ్' ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ వీడియోలో ఇది కొంచెం అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఇది రాబోయే SUV యొక్క సీటింగ్ ఎత్తు సూచిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ దేశంలోని D-సెగ్మెంట్ ఎస్‌యూవీలలో కెల్లా అత్యంత ఎత్తైన డ్రైవింగ్ స్థానాన్ని కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

ఈ కొత్త టీజర్ వీడియోకి ముందు, మహీంద్రా తమ కొత్త 2022 స్కార్పియో-ఎన్ కోసం మరొక టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. ఆ టీజర్ లో కొత్త స్కార్పియో-ఎన్ గురించి పెద్దగా వివరాలను వెల్లడించలేదు. అయితే, తాజా టీజర్ వీడియోలో రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క పరిమాణం గురించి కూడా సూచిస్తుంది. దానితో పాటు, ఈ కొత్త టీజర్ వీడియో రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ యొక్క ముందు మరియు సైడ్స్ డిజైన్ కూడా బహిర్గతం చేస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

ఎస్‌యూవీలకే బిగ్ డాడీగా పిలువబడ్ మహీంద్రా స్కార్పియో ని కంపెనీ జూన్ 27, 2022వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనుంది. డిజైన్ పరంగా చూస్తే కొత్తగా రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ ప్రస్తుత స్కార్పియో కన్నా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇందులో ముందు వైపు ట్విన్-పాడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, C- ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు కొత్త మహీంద్రా యొక్క కొత్త బ్రాండ్ లోగోతో ఇది చాలా ప్రీమియం మరియు అధునాతనంగా కనిపిస్తుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

అంతేకాకుండా, ముందు బంపర్ దిగువ భాగంలో అంర్చిన సిల్వర్‌ కలర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ లతో ఇది చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది మరియు మంచి రోడ్ ప్రజెన్స్ ను కూడా కలిగి ఉంటుంది. కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా చాలా క్రోమ్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది మరియు బాడీ చుట్టూ బ్లాక్ క్లాడింగ్ కూడా ఈ ఎస్‌యూవీ అందాన్ని మరింత పెంచుతుంది. దానికి తోడు, కొత్త 2022 మహీంద్రా స్కార్పియో చాలా స్టైలిష్ గా మరియు ప్రీమియం గా కనిపించే డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీతో అనేక విడిభాగాలను పంచుకున్నప్పటికీ, ఇందులో XUV700 ఉపయోగించిన ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ లేవు. ఈ డోర్ హ్యాండిల్స్ పుల్-టైప్ డోర్ హ్యాండిల్స్ మాదిరిగా కనిపిస్తాయి. ఈ కారులో ప్రధానమైన మార్పులన్నీ దాని ఇంటీరియర్ లో కనిపిస్తాయి. కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క ఇంటీరియర్ దాని అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే గణనీయంగా మెరుగైన అధునానత ఇంటీరియర్‌ లను కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరియు కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీల నుండి ప్రేరణ పొంది దీని క్యాబిన్ ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. అలాగే, కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంంక్షన్ తో కూడిన సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 2వ మరియు 3వ వరుస ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్‌లు, హై-బీమ్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

అంతే కాకుండా, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా దాని బిగ్ బ్రదర్ ఎక్స్‌యూవీ700 మాదిరిగానే ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం. అంటే, దీని అర్థం కొత్త స్కార్పియో-ఎన్ కూడా లేన్-కీపింగ్ అసిస్ట్, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, బ్లైండ్-స్పాట్ అసిస్ట్ వంటి మరెన్నో యాక్టివ్ మరియు ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBS, ESP, TPMS వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ను తయారు చేసిన లాడర్ ఛాసిస్స్ పై కాకుండా, కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌పై తయారు చేయవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, ఇందులో మహీంద్రా యొక్క ప్రఖ్యాత 2.2-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్లను కూడా యధావిధిగా ఎక్స్‌యూవీ700 నుండి కొనసాగించవచ్చని సమాచారం. ఈ రెండు పవర్‌ట్రైన్ యూనిట్లు మాన్యువల్‌ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) కొత్త టీజర్ విడుదల.. జూన్ 27న ఆవిష్కరణ..

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీలో అధునాతన షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ టాప్-ఎండ్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మహీంద్రా నుండి రాబోయే కొత్త స్కార్పియో ఎస్‌యూవీని ప్రారంభ ధరను సుమారు రూ. 12 లక్షల మార్కుకు దగ్గర్లో చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ తో విడుదల చేయవచ్చని అంచనా.

Article Published On: Saturday, June 4, 2022, 12:00 [IST]
English summary
Mahindra scorpio n new teaser video released launch scheduled on june 27 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+