డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) ఇటీవల భారతీయ మార్కెట్లో 'మహీంద్రా స్కార్పియో-ఎన్‌' (Mahindra Scorpio-N) ను అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

భార‌త్‌లో విడుదలైన TVS Ronin | ధర మరియు వివరాలు

అయితే కంపేనీ ఇప్పటికే టెస్ట్ డ్రైవ్స్ గురించి అధికారిక సమాచారం కూడా అందించింది. ఇప్పుడు కంపెనీ యొక్క ఈ కొత్త స్కార్పియో-ఎన్‌ డీలర్‌షిప్‌లకు చేరుకోవడం కూడా ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

మహీంద్రా యొక్క 'స్కార్పియో-ఎన్‌' యొక్క టెస్ట్ డ్రైవ్స్ జులై 05 నుంచి దేశంలోని 30 ప్రధాన నగరాల్లో ప్రారంభించబడ్డాయి. అయితే 2022 జులై 15 నుంచి మరిన్ని నగరాల్లో ఈ టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ కోసం సమీప డీలర్‌షిప్‌కి గానీ లేదా ఆన్‌లైన్‌లో ముందుగానే నమోదు చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏ వేరియంట్ మరియు ఏ ఇంజిన్ కలిగిన కారుని టెస్ట్ చేయాలనుకునుటున్నారు అనేది కూడా ముందుగానే నమోదులో పేర్కొనవచ్చు.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

కంపెనీ దీనికోసం బుకింగ్స్ ఈ నెల చివరి నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది. కొనుగోలుదారులు బుకింగ్స్ ప్రారంభించిన తరువాత బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కంపెనీ ప్రకటించిన ధరలు కేవలం 25,000 యూనిట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

మహీంద్రా కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త స్కార్పియో-ఎన్‌ ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్). కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధరలు రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం 5 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8 మరియు జెడ్8ఎల్ ట్రిమ్స్.

ప్రస్తుతం కంపెనీ మాన్యువల్ వేరియంట్ ధరలను మాత్రమే వెల్లడించింది. అయితే ఇందులోని ఆటోమేటిక్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ల ధరలను 2022 జూలై 21 న వెల్లడవుతాయి. ఆటోమాటిక్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అప్పుడు వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

మహీంద్రా స్కార్పియో-ఎన్ మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి డీప్ ఫారెస్ట్, నపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ మరియు గ్రాండ్ కెన్యాన్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సి-షేప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త లోగో వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ కెమెరా వంటివి కూడా పొందుతుంది.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఇది 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లేస్తుంది.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

ఇక రెండవ ఇంజిన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

డీలర్‌షిప్‌ చేరుకున్న 'మహీంద్రా స్కార్పియో-ఎన్': బుకింగ్స్ & టెస్ట్ డ్రైవ్స్ వివరాలు

2022 స్కార్పియో-ఎన్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Source: Carwale

More from DriveSpark

Article Published On: Thursday, July 7, 2022, 9:57 [IST]
English summary
Mahindra scorpio n reached dealerships test ride started details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+