ఈ ఏడాది మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ డ్రైవ్స్ చేయడానికి సిద్దమైపోండి.. ఎందుకంటే

ముందుగా పాఠకులకు తెలుగు డ్రైవ్‌స్పార్క్ తరపున "నూతన సంవత్సర శుభాకాంక్షలు". దేశీయ మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క థార్ 5-డోర్స్ వెర్సన్ లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో మహీంద్రా కంపెనీ తన థార్ SUV ని విడుదల చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న థార్ కేవలం 3 డోర్స్ కలిగిన SUV. కావున ఇందులో నలుగురు పెద్దలు కూర్చోవడానికి వీలుంటుంది. అయితే చాలా మంది ఇందులో 5 డోర్స్ వెర్సన్ ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 5 డోర్స్ వెర్సన్ మీద పనిచేస్తోంది. ఇది 2023 లో దేశీయ మార్కెట్లో విడుదలకానుంది.

ఈ ఏడాది విడుదలకానున్న మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్

మహీంద్రా కంపెనీ ఇప్పటికే తన థార్ 5 డోర్స్ వెర్షన్ ను చాలా సార్లు టెస్ట్ చేసింది. ఈ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. అయితే ఈ SUV ఇక త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ SUV దాని మునుపటి 3 డోర్స్ వెర్షన్ మీద ఆధారపడి ఉండదు, అయితే ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన స్కార్పియో-N ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని సమాచారం.

మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ కొత్త ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది, కావున ఇది దాని మునుపటి మోడల్ కంటే చాలా విషయాలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో కంపెనీ సీనియర్ VP & ఆటోమోటివ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ ఆర్ వేలుసామి ధృవీకరించారు. కావున ఈ 5 డోర్స్ వెర్షన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశించవచ్చు.

మహీంద్రా యొక్క 5 డోర్స్ వెర్షన్ దాని మునుపటి 3 డోర్స్ వెర్షన్ మాదిరిగా అదే 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ mStallion పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త థార్ మునుపటి మోడల్ కంటే ఎక్కువ పవర్ అవుట్ ఫుట్ అందించేలా రూపొందించబడే అవకాశం ఉంది. 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, 4-సిలిండర్ యూనిట్ 200 bhp పవర్ మరియు 370 Nm టార్క్ అందిస్తుంది.

ఇక 2.2-లీటర్ టర్బోఛార్డ్ డీజిల్ ఇంజన్ 172.5 bhp పవర్ మరియు 400 Nm టార్క్‌ అందిస్తుంది. మహీంద్రా యొక్క రాబోయే థార్ 5-డోర్‌ను మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందిచబడే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ SUV ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 13.59 లక్షల నుండి రూ. 16.29 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ ధరలు దాని 3 డోర్స్ థార్ కంటే ఎక్కువ.

మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కావున ఇందులో LED టెయిల్ ల్యాంప్‌లు, టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌ వంటివి ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ కంటే రాబోయే 5 డోర్స్ వెర్షన్ 15 శాతం పెద్దదిగా ఉండటమే కాకుండా 22 శాతం ఎక్కువ వీల్‌బేస్ పొందుతుంది. కావున ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా 3 డోర్ థార్ మాదిరిగానే రాబోయే 5 డోర్స్ వెర్షన్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో రానుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, టైర్ డైరెక్షన్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ఫీచర్స్ కూడా ఉండనున్నాయి. అంతే కాకుండా మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Article Published On: Sunday, January 1, 2023, 6:30 [IST]
English summary
Mahindra thar 5 door suv launch in 2023 telugu details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+