థార్ అభిమానులకు షాక్.. రూ.51,000 పెరిగిన మహీంద్రా థార్ (Mahindra Thar) ధరలు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ థార్ ధరలను భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మహీంద్రా థార్ (Mahindra Thar) ధరలు రూ.51,000 వరకూ పెరిగాయి. మహీంద్రా ఈ ఏడాదిలో (2022లో) థార్ ధరలను పెంచడం ఇది రెండవసారి. తాజా ధరల పెంపుతో మార్కెట్లో మహీంద్రా థార్ ధరలు రూ. 13.53 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

మహీంద్రా థార్ పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 35,000 నుండి రూ. 44,000 మధ్యలో పెరిగాయి. దీంతో మహీంద్రా థార్ బేస్ AX(O) హార్డ్‌టాప్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 13.53 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. ధరల పెంపుకు ముందు ఈ వేరియంట్ ధర రూ. 13.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. అంటే, ఈ వేరియంట్ ధర రూ. 35,000 పెరిగింది.

కాగా, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కూడిన పెట్రోల్ ఎల్ఎక్స్ (LX) హార్డ్‌టాప్ వేరియంట్‌ల ధరలు రెండూ కూడా రూ. 43,000 మేర పెంచబడ్డాయి. ఎల్‌ఎక్స్ హార్డ్‌టాప్ మాన్యువల్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 14.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఆటోమేటిక్ వెర్షన్ ఇప్పుడు ధర రూ. 15.76 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కాగా కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందించబడుతున్న పెట్రోల్ ఎల్‌ఎక్స్ కన్వర్టిబుల్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 15.67 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. ఇంతకు ముందు ఈ వేరియంట్ ధర రూ. 15.23 లక్షలుగా ఉండేది, అంటే దీని ధర రూ. 44,000 పెరిగింది.

ఇకపోతే, మహీంద్రా థార్ యొక్క డీజిల్ వేరియంట్‌ల ధరలు రూ. 44,000 నుండి రూ. 51,000 మధ్యలో పెరిగాయి. ఇందులో AX(O) హార్డ్‌టాప్ వేరియంట్ ధర రూ.44,000 మేర పెరిగి రూ. 13.93 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన LX హార్డ్‌టాప్ వేరియంట్ ధర రూ. 48,000 పెరిగి ఇప్పుడు రూ. 14.58 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఎల్‌ఎక్స్ కన్వర్టిబుల్ మరియు ఎల్‌ఎక్స్ హార్డ్‌టాప్ ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు రూ. 49,000 పెరిగి వరుసగా రూ. 14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 16.03 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

మహీంద్రా థార్ వేరియంట్లలో అత్యధిక ధరల పెరుగుదల అందుకున్నది AX (O) కన్వర్టిబుల్ వేరియంట్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడిన LX కన్వర్టిబుల్ వేరియంట్. ఈ రెండు వేరియంట్ల ధరలు రూ. 51,000 మేర పెరిగాయి. దీంతో ఇప్పుడు బేస్ డీజిల్ థార్ ధర రూ. 13.89 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన LX కన్వర్టిబుల్ వేరియంట్ ధర రూ. 15.94 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) గా ఉంది. వేరియంట్ల వారీ ధరల వివరాలను ఈ పట్టికలో చూడవచ్చు:
| Mahindra Thar Petrol | |||
| Variant | Old Price | New Price | Difference |
| AX (O) Hard Top | ₹13.18 Lakh | ₹13.53 Lakh | ₹35,000 |
| LX Hard Top | ₹13.79 Lakh | ₹14.22 Lakh | ₹43,000 |
| LX AT Convertible | ₹15.23 Lakh | ₹15.67 Lakh | ₹44,000 |
| LX AT Hard Top | ₹15.33 Lakh | ₹15.76 Lakh | ₹43,000 |
| Mahindra Thar Diesel | |||
| Variant | Old Price | New Price | Difference |
| AX (O) Convertible | ₹13.38 Lakh | ₹13.89 Lakh | ₹51,000 |
| AX (O) Hard Top | ₹13.49 Lakh | ₹13.93 Lakh | ₹44,000 |
| LX MT Convertible | ₹14.00 Lakh | ₹14.49 Lakh | ₹49,000 |
| LX MT Hard Top | ₹14.10 Lakh | ₹14.58 Lakh | ₹48,000 |
| LX AT Convertible | ₹15.43 Lakh | ₹15.94 Lakh | ₹51,000 |
| LX AT Hard Top | ₹15.54 Lakh | ₹16.03 Lakh | ₹49,000 |

మహీంద్రా థార్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ ఈ లైఫ్ స్టైల్ ఎస్‌యూవీని దాదాపు 2010 సంవత్సరం నుండి భారత మార్కెట్లో విక్రయిస్తోంది. మొదట్లో ఇది మంచి ఆఫ్-రోడర్ ఎస్‌యూవీగా దేశవ్యాప్తంగా ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులను ఆకట్టుకుంది. థార్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రారంభించిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత, అక్టోబర్ 2010లో కంపెనీ ఇందులో ఓ రెండవ తరం మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది డిజైన్, టెక్నాలజీ మరియు ఫీచర్ల పరంగా మొదటి తరం థార్ కన్నా ఎంతో అధునాతనంగా ఉంది.

థార్ అంటే కేవలం ఆఫ్-రోడింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, సరదాగా సిటీ రోడ్లపై కూడా నడపడానికి వీలుగా ఉండే ఓ ఫన్ టూ డ్రైవ్ వెహికల్ అని కొత్త తరం (సెకండ్ జనరేషన్) నిరూపించింది. ఈ 3-డోర్, 4-సీటర్ కారుని కేవలం ఆఫ్-రోడ్ ప్రియులు మాత్రమే కాకుండా, సిటీలలో ప్రయాణించే వారు కూడా తమ రోజూవారీ కమ్యూటింగ్ కోసం కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీని దాని పాత తరం మోడళ్ల కంటే అన్ని విధాలుగా పెద్దదిగా ఉంటుంది.

మహీంద్రా తమ కొత్త థార్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తోంది. పెట్రోల్ వెర్షన్‌లో సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ ఇంజన్ ను ఉపయోగించగా, డీజిల్ వెర్షన్ లో 2.2 లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇందులోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా థార్ ఏఎక్స్ ఆప్షనల్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఇందులో ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. వీటిలో కేవలం థార్ ఏఎక్స్ ఆప్షనల్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, థార్ ఎల్ఎక్స్ ట్రిమ్స్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటుగా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటాయి.

కంపెనీ ఈ ఎస్‌యూవీలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఇది అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ మొదలైన ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








