బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ. ఈ కంపెనీ యొక్క అధిక ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటి 'మహీంద్రా బోలేరో' (Mahindra Bolero). అయితే మహీంద్రా కంపెనీ తన బొలెరోని త్వరలో క్యాంపర్ మోడల్‌గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో విడుదల చేయనున్న బొలెరో యొక్క క్యాంపర్ మోడల్‌ విడుదల కోసం కంపెనీ ఇటీవలే ఐఐటి మద్రాస్-బేస్డ్ కారవాన్ తయారీ సంస్థ అయిన కాంపర్‌వాన్ ఫ్యాక్టరీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కావున ఈ భాగస్వామ్యంతో కంపెనీ 'బొలెరో క్యాంపర్' విడుదల చేస్తుంది.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బొలెరో క్యాంపర్ సరసమైన ధర వద్ద అందుబాటులో ఉంటుంది. దీనికోసం కంపెనీ సన్నద్ధమవుతోంది. ఈ క్యాంపర్ ట్రక్ మహీంద్రా బొలెరో క్యాంపర్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని మహీంద్రా తెలిపింది.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఈ రకమైన వాహనాలకు అధికమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ మహీంద్రా తొలిసారిగా క్యాంపర్ వాహనాలకు భారతీయ మార్కెట్ సిద్ధమవుతోంది. ఇప్పటికి మార్కెట్లో చాలా కంపెనీలు క్యాంపర్ వాహనాలను విక్రయిస్తున్నాయి.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

నివేదికల ప్రకారం బొలెరో గోల్డ్ క్యాంపర్‌లో అనేక లగ్జరీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్యాంపర్ ట్రక్ స్మార్ట్ వాటర్ సొల్యూషన్‌తో అందించబడుతుంది. దీనితో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీటింగ్, రెస్ట్‌రూమ్, డైనింగ్, కిచెన్ మరియు బయో-టాయిలెట్‌లు వంటి అనేక సౌకర్యాలను కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని ఇందులో ఉండటం వల్ల కుంటుంభాలతో కలిసి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

ఒక్క మాటలో చెప్పాలంటే వారాంతంలో కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లేందుకు ఇలాంటి వాహనాలు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి వాహనాలను నడపడానికి డ్రైవర్‌కు ఎలాంటి ప్రత్యేక లైసెన్స్ అవసరం లేదని మహీంద్రా తెలిపింది. టూర్ మరియు ట్రావెల్ కంపెనీలు కూడా అలాంటి వాహనాలను అద్దెకు కొనుగోలు చేయగలవు. ఈ వాహనాలు వ్యక్తిగత అవసరాలను తీర్చడమే కాకుండా పర్యటనకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తాయి.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

మహీంద్రా ప్రకారం, కాంపర్‌వాన్ ఫ్యాక్టరీ భాగస్వామ్యంతో క్యాంపర్ వాహనాల ఉత్పత్తి త్వరలో ప్రారంభించబడుతుంది. ఈ క్యాంపర్ వాహనాలు నాణ్యతలో చాలా బలంగా ఉంటాయని మరియు భారతీయ టూరింగ్ మరియు ట్రావెల్ కంపెనీలకు మంచి ఆదాయ వనరుగా మారుతుందని కంపెనీ హామీ ఇచ్చింది. కావున ఇది త్వరలోనే భారతదేశంలో విడుదలవుతుంది.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

ఇదిలా ఉండగా 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra And Mahindra) మార్కెట్లో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. మహీంద్రా కంపెనీ 'బోర్న్ EV' లైనప్‌లో భాగంగా మూడు కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

మొదటి ప్రొడక్షన్-స్పెక్ బోర్న్ EVని 2025 మరియు 2026 మధ్య కాలంలో పరిచయం చేయవచ్చని మహీంద్రా తెలియజేసింది. బోర్న్ ఈవీ ప్లాట్ ఫామ్ కింద కంపెనీ త్వరలో తీసుకొని రాబోయే ఎలక్ట్రిక్ కార్లను టీజర్ రూపంలో విడుదల చేసింది. ఈ వీడియోలో మూడు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యువీలను చూపించింది.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

ఈ రాబోయే ఈవీలను యుకెలోని గ్లోబల్ డిజైన్ సెంటర్ మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరోప్(మేడ్) రూపొందించినట్లు టీజర్ వెల్లడించింది. గత సంవత్సరం, ఎం అండ్ ఎం తన రాబోయే ప్యాసింజర్ కార్ల కోసం ఒక రోడ్ మ్యాప్ విడుదల చేసింది.

మీరు ప్రతి కాన్సెప్ట్ SUV లో C-ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌లైట్‌లను ఉపయోగించడాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇందులో పెద్దగా వెలుతురు లేనప్పటికి వాటి వాలుగా ఉన్న పైకప్పు మరియు డిజైన్ లాంగ్వేజ్ చూడవచ్చు. బోర్న్ EV కాన్సెప్ట్ వాహనాలు కొత్త, ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

మహీంద్రా ఇవెరిటో మరియు రాబోయే మహీంద్రా eXUV300 ఎలక్ట్రిక్ EV పవర్‌ట్రెయిన్ కోసం సవరించిన ICE వాహన ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మహీంద్రా యొక్క మొదటి గ్రౌండ్-అప్ ప్లాట్‌ఫారమ్. మహీంద్రా యొక్క కొత్త 'హ్యూమన్-మెషిన్ ఇంటర్‌ఫేస్' (HMI) కూడా త్వరలోనే రానుంది. HMI అనేది మహీంద్రా యొక్క భవిష్యత్తు మోడళ్ల కోసం కమ్యూనికేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ.

బొలెరో క్యాంపర్ విడుదలకు సిద్దమవుతున్న Mahindra

ఈ జూలైలో కాన్సెప్ట్ రూపంలో రాబోయే మూడు మహీంద్రా ఎలక్ట్రిక్ SUV లను చూడగలిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో, కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి బోర్న్ EV 2025 సంవత్సరంలో రోడ్లపై కనిపించవచ్చు. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోనే దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 5, 2022, 13:46 [IST]
English summary
Mahindra to launch bolero camper truck with luxury features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+