అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

ప్రముఖ స్వదేశీ ఆటో మొబైల్ తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra And Mahindra) మార్కెట్లో రానున్న భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. మహీంద్రా కంపెనీ 'బోర్న్ EV' లైనప్‌లో భాగంగా మూడు కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో 'బోర్న్ ఎలక్ట్రిక్ విజన్'ను ఆవిష్కరించనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా ప్రకటించింది.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

మొదటి ప్రొడక్షన్-స్పెక్ బోర్న్ EVని 2025 మరియు 2026 మధ్య కాలంలో పరిచయం చేయవచ్చని మహీంద్రా తెలియజేసింది. బోర్న్ ఈవీ ప్లాట్ ఫామ్ కింద కంపెనీ త్వరలో తీసుకొని రాబోయే ఎలక్ట్రిక్ కార్లను టీజర్ రూపంలో విడుదల చేసింది. ఈ వీడియోలో మూడు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యువీలను చూపించింది.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

ఈ రాబోయే ఈవీలను యుకెలోని గ్లోబల్ డిజైన్ సెంటర్ మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరోప్(మేడ్) రూపొందించినట్లు టీజర్ వెల్లడించింది. గత సంవత్సరం, ఎం అండ్ ఎం తన రాబోయే ప్యాసింజర్ కార్ల కోసం ఒక రోడ్ మ్యాప్ విడుదల చేసింది.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

మీరు ప్రతి కాన్సెప్ట్ SUV లో C-ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌లైట్‌లను ఉపయోగించడాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇందులో పెద్దగా వెలుతురు లేనప్పటికి వాటి వాలుగా ఉన్న పైకప్పు మరియు డిజైన్ లాంగ్వేజ్ చూడవచ్చు. బోర్న్ EV కాన్సెప్ట్ వాహనాలు కొత్త, ఎలక్ట్రిక్ కార్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

మహీంద్రా ఇవెరిటో మరియు రాబోయే మహీంద్రా eXUV300 ఎలక్ట్రిక్ EV పవర్‌ట్రెయిన్ కోసం సవరించిన ICE వాహన ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మహీంద్రా యొక్క మొదటి గ్రౌండ్-అప్ ప్లాట్‌ఫారమ్. మహీంద్రా యొక్క కొత్త 'హ్యూమన్-మెషిన్ ఇంటర్‌ఫేస్' (HMI) కూడా త్వరలోనే రానుంది. HMI అనేది మహీంద్రా యొక్క భవిష్యత్తు మోడళ్ల కోసం కమ్యూనికేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

ఈ జూలైలో కాన్సెప్ట్ రూపంలో రాబోయే మూడు మహీంద్రా ఎలక్ట్రిక్ SUV లను చూడగలిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో, కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి బోర్న్ EV 2025 సంవత్సరంలో రోడ్లపై కనిపించవచ్చు. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోనే దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి.

మహీంద్రా కంపెనీ 2023 ఏప్రిల్ నాటికి భారతదేశంలో విడుదల చేయడానికి మహీంద్రా XUV300 SUV ఆధారంగా ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా సిద్ధం చేస్తోంది. మహీంద్రా eXUV300 లాంచ్ గురించి ఇటీవలే సమాచారం వెల్లడైంది. 2023 మూడో త్రైమాసికంలో లేదా నాల్గవ త్రైమాసికంలో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

మహీంద్రా XUV300 ఎలక్ట్రిక్ SUV దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా యొక్క ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులలో ఒకటి. మహీంద్రా ఎల్లప్పుడూ భారతీయ EV స్పేస్‌లో అద్భుతమైన ఉత్పత్తులను విడుదల చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వీటి ప్రొడక్షన్ లో కొంత ఆలస్యం వల్ల కొన్ని రోజులు ఇంకా వేచి ఉండాల్సి వస్తోంది. మొత్తానికి త్వరలోనే కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనుంది.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

ఇదిలా ఉండగా దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ (Tata Motors), హ్యుందాయ్ (Hyundai) మరియు ఎంజి మోటార్ (MG Motors) వంటి వాహన తయారు సంస్థలు కూడా ఇప్పటికే భారతీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసిన మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి.

ఇందులో భాగంగానే మారుతి సుజుకి కూడా తన వ్యాగన్-ఆర్ ఈవీని త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, కొత్త ఎలక్ట్రిక్ వాహనాల లైనప్‌తో, మహీంద్రా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అదరగొడుతున్న Mahindra బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్స్ టీజర్.. మీరూ చూసెయ్యండి

ఇండియన్ మార్కెట్లో ప్రముఖ SUV పేరు మోసిన బ్రాండ్ అయిన దేశీయ కార్ బ్రాండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఆటో ఎక్స్‌పోలో E-KUV100ని ప్రదర్శించింది. ఈ మైక్రో SUV యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. మహీంద్రా XUV300 EV 2023 లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలిపింది. భారతీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు విడుదలైతే Tata Nexon EV, MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా EV వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.మొత్తానికి కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కార్లు ఎప్పుడెప్పుడు దేశీయ మార్కెట్లో అడుగుపెడతాయా అని వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Sunday, February 13, 2022, 9:00 [IST]
English summary
Mahindra to unveil future electric suv lineup in july 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+