Bolero ఎస్‌యూవీలో సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్ చేసిన Mahindra; ఇందులో ఆ కొత్త ఫీచర్లు ఏంటంటే..
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) నుండి అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలలో ఒకటైన బొలెరో (Bolero) ఎస్‌యూవీలో కంపెనీ కొన్ని సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్ చేసింది. కొత్త మహీంద్రా బొలెరో ఇప్పుడు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఇతర ఫీచర్లను ప్రామాణికంగా పొందుతుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త బొలెరోలో ఇప్పుడు తప్పనిసరిగా ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (ఒకటి డ్రైవర్ కోసం, మరొకటి ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) మరియు రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటుగా సెన్సార్లను కూడా కంపెనీ అందిస్తోంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త బొలెరోలో ఇప్పుడు తప్పనిసరిగా ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (ఒకటి డ్రైవర్ కోసం, మరొకటి ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) మరియు రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటుగా సెన్సార్లను కూడా కంపెనీ అందిస్తోంది. భద్రతా నియమం ప్రకారం, జనవరి 1, 2022 నుండి భారతదేశంలో రిజిస్టర్ చేయబడిన అన్ని కార్లు తప్పనిసరిగా డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ని తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఈ సైలెంట్ అప్‌డేట్ తర్వాత, కంపెనీ ఇప్పుడు క్యాబిన్ లోని ప్యాసింజర్లకు మరింత సురక్షితమైన అనుభూతిని మరియు ఇరుకైన ప్రదేశాలలో పార్క్ చేయడానికి లేదా నావిగేట్ చేయడానికి సులభం చేస్తుంది. మహీంద్రా బొలెరో భద్రతా పరికరాల జాబితాలో ఉన్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
- డ్రైవర్ మరియు కో-డ్రైవర్/ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్
- రివర్స్ పార్కింగ్ సెన్సార్లు
- సీట్ బెల్ట్ రిమైండర్
- కో-డ్రైవర్ ఆక్యుపెంట్ డిటెక్షన్ సిస్టమ్

ఈ భద్రతా ఫీచర్లన్నీ ఇప్పుడు మహీంద్రా బొలెరో యొక్క అన్ని వేరియంట్లలో జోడించబడ్డాయి మరియు ప్రతి వేరియంట్ లో కూడా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా లభిస్తాయి. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీ మార్కెట్లో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటిలో బొలెరో బి4, బి6 మరియు బి6 (ఆప్షనల్) మరియు వీటి ధరలు రూ. 8.99 లక్షల ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) నుండి ప్రారంభం అవుతాయి.

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, కొత్తగా చేసిన అప్‌డేట్‌లు అన్ని కూడా జనవరి 1, 2022 నుండి అమలులోకి వచ్చిన తప్పనిసరి భద్రతా నియమాలలో భాగంగా ఉంటాయి. కంపెనీ ఇకపై విక్రయించబోయే అన్ని బొలెరో వేరియంట్లు ఈ ఫీచర్లను తప్పనిసరిగా కలిగి ఉంటాయి. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అకస్మాత్ ప్రమాదాల సమయంలో ప్రయాణీకుల వాహనాలలో గాయాలను తగ్గించడానికి భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), కార్లలో తప్పనిసరిగా పైన పేర్కొన్న భద్రతా ఫీచర్లను అందించాలని కార్ల తయారీదారులను నిర్దేశించింది.

కొత్త మహీంద్రా బొలెరో ఈ రెండు సేఫ్టీ ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. బొలెరో ప్రస్తుత డిజైన్, ఇంటీరియర్స్ మరియు మెకానికల్స్ పరంగా అలాగే ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలో మహీంద్రా యొక్క mHawk75 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 3600 ఆర్‌పిఎమ్ వద్ద 74.96 బిహెచ్‌పి పవర్ ను మరియు 1600-2200 ఆర్‌పిఎమ్ మధ్యలో 210 ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ డీజిల్ ఇంజిన్ మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన ఇంజన్ నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ సమయం ఆన్‌లో ఉన్నప్పుడు ఇంజన్ ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది. తిరిగి క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. ఈ ఆటో-స్టార్ట్-స్టాప్ ఫీచర్ సాయంతో మైలేజ్ పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. మహీంద్రా బొలెరోలో లో లభించే కీలక ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఏడు సీట్లు, ఎయిర్ కండిషనింగ్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, బేసిక్ ఆడియో సిస్టమ్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

ఇంకా ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ఉన్న ఎమ్ఐడి డిస్‌ప్లేలో మిగిలిన ఇంధనంతో ఎంత దూరం ప్రయాణించవచ్చు, సగటు ఇంధన సామర్థ్యం (మైలేజ్), గేర్ పొజిషన్ ను సూచించే ఇండికేటర్ వంటివి మరెన్నో ఉన్నాయి. మహీంద్రా బొలెరో చాలా సంవత్సరాలుగా బ్రాండ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది. అయితే, ఈ బ్రాండ్ తాజాగా పరియచం చేసిన కొత్త తం మహీంద్రా థార్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడళ్లతో గత కొన్ని నెలలుగా మహీంద్రా బొలెరో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 2022 నెలలో మొత్తం 3,506 యూనిట్లకు పైగా ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది జనవరి 2021 నెలలో కంపెనీ విక్రయించిన 7,567 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ అమ్మకాలు దాదాపు 50 శాతం క్షీణించాయి. ఇదిలా ఉంటే, కంపెనీ తమ బొలెరో ఎస్‌యూవీలో ఓ కొత్త ఫేస్‍లిఫ్ట్ మోడల్ ని కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








