మహీంద్రా సంచలన నిర్ణయం.. భారత్‌లో XUV400 ఆవిష్కరణ ఎప్పుడంటే?
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని 'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ కూడా ఎలక్ట్రిక్ విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల భవిష్యత్తులో విడుదల చేయనున్న 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది.
Recommended Video
కాగా మహీంద్రా కంపెనీ ఇప్పుడు ఆ 5 ఎలక్ట్రిక్ కార్లు కాకుండా.. అంతకంటే ముందు మరో ఎలక్ట్రిక్ SUV 'ఎక్స్‌యూవీ400' (XUV400) విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారుని ఎప్పుడు మార్కెట్లో ఆవిష్కరించనుంది అనే సమాచారం వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV ని ఈ నెల (సెప్టెంబర్) 08 న తీసుకురానున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన టీజర్ వీడియో కూడా చూడవచ్చు. మహీంద్రా XUV400 అనేది కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ ఈవి కి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇప్పటికి విడుదలైన టీజర్ వీడియోలో త్వరలో విడుదలకానున్న ఎలక్ట్రిక్ SUV కి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది కంపెనీ యొక్క కొత్త లోగోతో రానున్నట్లు స్పష్టమవుతోంది. నిజానికి ఈ XUV400 అనేది 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది.

మహీంద్రా XUV400 అనేది XUV300 ఆధారంగా రూపొందించబడుతోంది. కావున ఇది ఇది పెట్రోల్ మోడల్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ కానుంది. అయితే రానున్నరోజుల్లో కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడతాయి.

మహీంద్రా XUV400 SUV చాలా వరకు ఆకర్షణీయమైన డిజైన్ మరియు పరికరాలను పొందుతుంది. అదే సమయంలో దీని పొడవు 4.2 మీటర్ల వరకు ఉండనుంది. కావున ఇది విశాలమైన క్యాబిన్ పొందుతుంది. టీజర్ ప్రకారం కొత్త గ్రిల్, హెడ్ లైట్ మరియు ఛార్జింగ్ పాయింట్ వంటివి మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. కావున ఆవిష్కరణ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV 2023 జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే అవకాశం ఉందని, ఆ తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.

మహీంద్రా నుంచి రానున్న XUV400 అనేది కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV కావున, ఇది ఆధునిక ఫీచర్స్ పొందే అవకాశం ఉంటుంది. కావున ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి ఫీచర్స్ అందించే అవకాశం ఉంది. ఎందుకంటే దాని ప్రత్యర్థులు గట్టిగా ఎదుర్కోవాలంటే తప్పకుండా అప్డేటెడ్ ఫీచర్స్ అందివ్వాలి.

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV లో ఎలాటి బ్యాటరీ ఫ్యాక్ వినియోగిస్తుంది అనేది కూడా వెల్లడించలేదు. అయితే ఇది రెండు బ్యాటరీ ఆప్సన్ పొందే అవకాశం ఉంటుంది. కావున ఇందులో 30kWh లేదా 40kWh బ్యాటరీ ఫ్యాక్స్ ఉండే అవకాశం ఉంది. కావున పరిధి 300 కిమీ ఉంచి 400 కిమీ వరకు ఉండవచ్చు.

ఇక ధరల విషయానికి వస్తే, కంపెనీ ధరలు కూడా అధికారికంగా వెల్లడించలేదు. కావున మహీంద్రా XUV400 ధర సుమారు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

ఇదిలా ఉండగా మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో XUV.E8, XUV.E9, BE.05, BE.07 మరియు BE.09 అనే 5 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కార్లు అన్నీ కూడా ఆధునిక ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడతాయి. అదే సమయంలో ఇవి లేటెస్ట్ డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు మంచి భద్రతా సామర్థ్యాన్ని కూడా అందించనుంది. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లు 2024 నుంచి 2026 లోపు అధికారికంగా విడుదలవుతాయని కంపెనీ తెలిపింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ వాహన ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి కంపెనీలు కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఈ సమయంలో మహీంద్రా కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆవిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ XUV400 ఎలక్ట్రిక్ SUV విడుదల చేయనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV కి సంబంధించిన అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








