Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా XUV700 యొక్క డెలివరీలు 2022 జనవరి 26 నాటికి ఏకంగా 14,000 యూనిట్లను చేరుకున్నట్లు కంపెనీ 73 వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలిపింది. మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యింది. అయితే ఇప్పటికి 14,000 యూనిట్లను డెలివరీ చేయగలిగింది.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

మహీంద్రా XUV700 SUV విడుదలైన అతి తక్కువ కాలంలోనే లెక్కకు మించిన బుకింగ్స్ పొందింది. అయితే ఆటో మొబైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సెమీకండక్టర్ చిప్ కొరతలు కారణంగా ఉత్పత్తి కొంత ఆలస్యం అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సమస్య కొంతవరకు తగ్గింది.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

కొత్త మహీంద్రా XUV700 అనేది మూడు వరుసల సీటర్ (7-సీటర్) SUV. ఇది భారతీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉండటమే కాకుండా మల్టిపుల్ వేరియంట్‌లు మరియు గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇప్పటికే కంపెనీ డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్ల డెలివరీలను ప్రారంభించింది.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని ప్రస్తుతం రూ. 12.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 SUV మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

మొత్తానికి ఇప్పుడు కంపెనీ ఈ ఆధునిక SUV యొక్క డెలివరీలను వేగవంతం చేస్తోంది. కావున బుక్ చేసుకున్న కస్టమర్లు త్వరగానే ఈ కొత్త కారును డెలివరీ చేసుకుంటారు. కావున బుక్ చేసుకున్న కస్టమర్లు దీనిపైన అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు.

Mahindra XUV700 డెలివరీ రిపోర్ట్ విడుదల: వివరాలు

ఇదిలా ఉండగా ఇప్పుడు మహీంద్రా కంపెనీ దాని XUV700 AX7 AWD వేరియంట్ డెలివరీలను కూడా ప్రారంభించింది. మహీంద్రా కంపెనీ గత అక్టోబర్‌ నెలలో XUV700 AX7 ని పరిచయం చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. XUV700 విడుదల సమయంలో కస్టమర్ల డిమాండ్ మేరకు కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ ఇదివరకే తెలిపింది. ఇది కూడా చాలా అద్భుతమైన మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 27, 2022, 12:13 [IST]
English summary
Mahindra xuv700 achieves 14000 units delivery details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+