XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ పండుగ సీజన్లో XUV700 మరియు థార్ కొనుగోలుదారులకు ఒక షాకింగ్ న్యూస్ అందించింది. ఇప్పుడు కంపెనీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరియు థార్ SUV ధరలను అమాంతం పెంచేసింది. ఎక్స్‌యూవీ700 ధరలు ఇప్పుడు రూ. 20,000 నుంచి రూ. 37,000 పెరుగుదలను పొందాయి. అదే సమయంలో థార్ ధరలు రూ. 6,000 నుంచి 28,000 పెరిగాయి.

Recommended Video

మహీంద్రా ఎక్స్‌యూవీ700 రివ్యూ

మహీంద్రా XUV700 మరియు థార్ SUV ధరల పెరుగుదల గురించి మరింత సమాచారం ఈ కథంనంలో తెలుసుకుందాం.. రండి.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

మహీంద్రా కంపెనీ ఇటీవలే తన XUV700 యొక్క ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల ధరలను రూ. 6,000 వరకు తగ్గించింది. అయితే ఈ తగ్గుదలను ప్రకటించిన వారంలోపే భారీగా ధరలను పెంచింది. అయితే ఈ ధరల పెరుగుదలకు కారణం కూడా వెల్లడించకపోవడం గమనార్హం. కంపెనీ ఈ 2022 లో ఈ రెండు మోడల్స్ యొక్క ధరలను పెంచడం ఇదే మొదటిసారి.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

మహీంద్రా XUV700 ధర పెరుగుదల విషయానికి వస్తే, XUV700 పెట్రోల్ వేరియంట్ ధర రూ. 22,000 నుండి రూ. 35,000కి పెరిగింది. కావున వీటి ధరలు ఇప్పుడు రూ. 13.45 లక్షల నుండి రూ. 23.10 లక్షల వరకు ఉన్నాయి.

ఇక XUV700 డీజిల్ వేరియంట్ ధరల విషయానికి వస్తే, ఇవి కూడా రూ. 20,000 నుండి రూ. 37,000 వరకు పెరుగుదలను పొందాయి. కావున XUV700 డీజిల్ ధరలు ఇప్పుడు రూ. 13.96 లక్షల నుండి రూ. 24.95 లక్షల వరకు ఉన్నాయి.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..
Mahindra XUV700 Price
Petrol New Price Old Price Difference
MX MT 5S ₹13.45 Lakh ₹13.18 Lakh ₹27,000
AX3 MT 5S ₹15.50 Lakh ₹15.28 Lakh ₹22,000
AX3 AT 5S ₹17.20 Lakh ₹16.84 Lakh ₹36,000
AX5 MT 5S ₹16.79 Lakh ₹16.55 Lakh ₹24,000
AX5 MT 7S ₹17.44 Lakh ₹17.19 Lakh ₹25,000
AX5 AT 5S ₹18.54 Lakh ₹18.30 Lakh ₹24,000
AX7 MT 7S ₹19.44 Lakh ₹19.21 Lakh ₹23,000
AX7 AT 7S ₹21.19 Lakh ₹20.95 Lakh ₹24,000
AX7 AT 7S L ₹23.10 Lakh ₹22.75 Lakh ₹35,000
Diesel New Price Old Price Difference
MX MT 5S ₹13.96 Lakh ₹13.70 Lakh ₹26,000
AX3 MT 5S ₹16.00 Lakh ₹15.80 Lakh ₹20,000
AX3 MT 7S ₹16.80 Lakh ₹16.53 Lakh ₹27,000
AX3 AT 5S ₹17.91 Lakh ₹17.58 Lakh ₹33,000
AX5 MT 5S ₹17.44 Lakh ₹17.20 Lakh ₹24,000
AX5 MT 7S ₹18.09 Lakh ₹17.84 Lakh ₹25,000
AX5 AT 5S ₹19.24 Lakh ₹18.92 Lakh ₹32,000
AX5 AT 7S ₹19.84 Lakh ₹19.56 Lakh ₹28,000
AX7 MT 7S ₹20.14 Lakh ₹19.86 Lakh ₹28,000
AX7 MT 7S L ₹22.00 Lakh ₹21.66 Lakh ₹34,000
AX7 AT 7S ₹21.84 Lakh ₹21.58 Lakh ₹26,000
AX7 AT 7S AWD ₹23.24 Lakh ₹22.98 Lakh ₹26,000
AX7 AT 7S L ₹23.70 Lakh ₹23.41 Lakh ₹29,000
AX7 AT 7S L AWD ₹24.95 Lakh ₹24.58 Lakh ₹37,000

మహీంద్రా XUV700 అనేది మొత్తం నాలుగు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి MX, AX3, AX5 మరియు AX7. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో చాలా ఆధునికంగా ఉన్నాయి. XUV700 రెండు ఇంజిన్ ఆప్సన్స్ కూడా పొందుతుంది. అవి 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లు.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

మహీంద్రా థార్:

ఇక పెరిగిన మహీంద్రా థార్ ధరల విషయానికి వస్తే, థార్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 6,000 నుంచి రూ. 7,000 వరకు పెరిగాయి. కావున ఇప్పుడు మహీంద్రా థార్ పెట్రోల్ ధరలు రూ. 13.59 లక్షల నుంచి రూ. 15.82 లక్షల వరకు ఉన్నాయి.

ఇక థార్ డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, వీటి ధరలు ఏకంగా రూ. 26,000 నుంచు రూ. 28,000 వరకు పెరిగాయి. కావున థార్ డీజిల్ ధరలు రూ. 14.16 లక్షల నుంచి రూ. 16.29 లక్షల వరకు ఉన్నాయి.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..
Mahindra Thar Price
Petrol New Price Old Price Difference
AX (O) CT MT ₹13.59 Lakh ₹13.53 Lakh ₹6,000
LX HT MT ₹14.28 Lakh ₹14.22 Lakh ₹6,000
LX CT AT ₹15.73 Lakh ₹15.67 Lakh ₹6,000
LX HT AT ₹15.82 Lakh ₹15.75 Lakh ₹7,000
Diesel New Price Old Price Difference
AX (O) CT MT ₹14.16 Lakh ₹13.88 Lakh ₹28,000
AX (O) HT MT ₹14.21 Lakh ₹13.93 Lakh ₹28,000
LX CT MT ₹14.77 Lakh ₹14.49 Lakh ₹28,000
LX HT MT ₹14.86 Lakh ₹14.58 Lakh ₹28,000
LX CT AT ₹16.20 Lakh ₹15.94 Lakh ₹26,000
LX HT AT ₹16.29 Lakh ₹16.03 Lakh ₹26,000
XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

మహీంద్రా థార్‌ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్లు వరుసగా 150 బిహెచ్‌పి పవర్ & 320 ఎన్ఎమ్ టార్క్ మరియు 130 బిహెచ్‌పి పవర్ & 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటాయి.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

ఇదిలా ఉండగా ఇటీవల మహీంద్రా థార్ అప్డేటెడ్ లోగోతో కనిపించింది. ఇందులో థార్ ముందు భాగంతో పాటు వీల్ క్యాప్స్ మరియు స్టీరింగ్ వీల్‌పై కొత్త లోగో ఉన్నాయి. ఇందులో కొత్త లోగోలు తప్పా ఎటువంటి మార్పులు జరగలేదు. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మహీంద్రా యొక్క XUV700 మరియు థార్ SUV లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ సమయంలో అందులోనూ పండుగ సీజన్లో కంపెనీ ధరలను పెంచడం అనేది అమ్మకాలపైన ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది తెలియాల్సిన ప్రశ్న. అయితే రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన సమాచారం వెల్లడవవుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Mahindra xuv700 and thar price hike september 2022 details
Story first published: Monday, September 19, 2022, 12:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X