ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన లేటెస్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 (XUV700)లో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఈ మోడల్ లో విక్రయించిన ఆల్ వీల్ డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్ల కోసం కంపెనీ ఇప్పుడు రీకాల్ జారీ చేసింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని రీకాల్ చేయడం ఇదే తొలిసారి. అయితే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క అన్ని వేరియంట్లు ఈ రీకాల్ కు వర్తించవు. కేవలం, ఆల్ వీల్ డ్రైవ్‌ వేరియంట్లు మాత్రమే ఈ రీకాల్ క్రిందకు వస్తాయి.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

ఓ నివేదిక ప్రకారం, ఆల్-వీల్-డ్రైవ్ డ్రైవ్‌ట్రైన్‌తో కూడిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ యొక్క డీజిల్ వేరియంట్ రీకాల్ చేయబడింది. ప్రత్యేకంగా, AX 7 డీజిల్ AT AWD 7-సీటర్ మరియు AX 7 డీజిల్ AT AWD లగ్జరీ ప్యాక్ 7-సీటర్ వేరియంట్లు రీకాల్ చేయబడినట్లు సమాచారం. మహీంద్రా ఈ రీకాల్ గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, కంపెనీ ఈ రీకాల్ క్రిందకు వచ్చే వాహనాలను గుర్తించి, సంబంధిత యజమానులకు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

ప్రముఖ ఆటోమోటివ్ ఆన్‌లైన్ చర్చా వేదికైన టీఎమ్ బిహెచ్‌పిలో ఇప్పటికే ఈ విషయం గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. యూజర్లు ఈ రీకాల్ గురించి మాట్లాడుతూ, ఈ రీకాల్‌ను మహీంద్రా క్లిష్టమైన సేవా చర్యగా వర్గీకరించిందని, అంతేకాకుండా ఇంజన్‌ను వెనుక ఇరుసుకు (రియర్ యాక్సిల్) కు కనెక్ట్ చేసే ప్రొపెల్లర్ షాఫ్ట్‌ కు సంబంధించిన సమస్య ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అయితే, ప్రభావితమైన వాహనాల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

ఈ రీకాల్ కు వర్తించే వాహనాలను మహీంద్రా సర్వీస్ ఇంజనీర్లు తనిఖీ చేసి, అవసరమైన ప్రొపెల్లర్ షాఫ్ట్ బోల్టులను ఉచితంగా రీప్లేస్ చేయనున్నారు. ఈ లోపానికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు నివేదించబడనప్పటికీ, ఏదైనా పెద్ద తప్పు జరగకముందే మహీంద్రా ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇటీవలే గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు' ను దక్కించుకని, భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో ఈ ఎస్‌యూవీ అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లు స్కోర్ చేసి, ఓవరాల్ గా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. ఈ క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించిన ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఎక్స్‌యూవీ700లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటి బ్రేక్ అసిస్ట్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

కాగా, ఈ ఎస్‌యూవీలో సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా జోడించడం ద్వారా మహీంద్రా ఎక్స్‌యూవీ700 తన ప్రయాణీకులకు మరింత భద్రతను కల్పిస్తుందని టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ఎస్‌యూవీ లోని హై-ఎండ్ వేరియంట్లలో కంపెనీ ఏడిఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇవన్నీ కూడా డ్రైవర్ కాన్ఫిడెన్స్‌ని పెంచడంతో పాటుగా రోడ్డుపై సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

భారతదేశంలో మహీంద్రా ఇప్పటి వరకూ సుమారు 30,000 యూనిట్లకు పైగా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను డెలివరీ చేసింది. ప్రస్తుతం, కరోనా మహమ్మారి తెచ్చిన అవాంతరాలు మరియు సెమీకండక్టర్ చిప్ కొరత వంటి అంశాలు ఆటోమొబైల్ కంపెనీలను వేధిస్తున్నప్పటికీ, ఎక్స్‌యూవీ700 వాహనాల డెలివరీ విషయంలో ఇది గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఈ ఎస్‌యూవీని పొందడం కోసం ఇంకా 78,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు వేచి చూస్తున్నారు. ఈ మోడల్ లో కొన్ని వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు 2 సంవత్సరాల వరకు ఉన్నట్లు సమాచారం.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క డీజిల్ వేరియంట్‌లు అధిక వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉంటున్నాయి. అయితే, ఈ ఎస్‌యూవీ యొక్క టాప్-ఎండ్ 'AX' వేరియంట్‌లతో పోలిస్తే బేస్ 'MX' వేరియంట్ చాలా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉంది. ప్రస్తుతం, మహీంద్రా భారతదేశంలో సగటున ప్రతినెలా సుమారు 6,000 యూనిట్ల ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తోంది. ఇది ఈ ఎస్‌యూవీ కోసం ఉన్న సగటు బుకింగ్ కంటే చాలా తక్కువ. మహీంద్రా ఈ మోడల్ ఉత్పత్తిని పెంచకపోతే రాబోయే నెలల్లో XUV700 కోసం వెయిటింగ్ పీరియడ్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఎక్స్‌యూవీ700 ఆల్-వీల్-డ్రైవ్ (XUV700 AWD) వేరియంట్లు రీకాల్.. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197bhp శక్తిని మరియు 380Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, దీని 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. మొదటిది 182bhp గరిష్ట శక్తిని మరియు 450Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 'MX' వేరియంట్‌లో ఉపయోగించిన ఇదే డీజిల్ ఇంజన్ 153bhp గరిష్ట శక్తిని మరియు 360Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మూలం: Team BHP

More from DriveSpark

Article Published On: Monday, July 11, 2022, 17:24 [IST]
English summary
Mahindra xuv700 awd variants recalled due to faulty propeller shaft bolts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+