XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందగలిగింది. ఇప్పటికే ఈ SUV యొక్క డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు కంపెనీ దాని XUV700 AX7 AWD వేరియంట్ డెలివరీలను ప్రారంభించింది.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

మహీంద్రా కంపెనీ గత అక్టోబర్‌ నెలలో XUV700 AX7 ని పరిచయం చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. XUV700 విడుదల సమయంలో కస్టమర్ల డిమాండ్ మేరకు కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ ఇదివరకే తెలిపింది. ఇది చాలా అద్భుతమైన మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

కొత్త మహీంద్రా XUV700 లగ్జరీ ఫీచర్లలో సోనీ 3డి సౌండ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, డ్రైవర్ క్నీ ఎయిర్‌బ్యాగ్, ఎలక్ట్రికల్ స్మార్ట్ డోర్ హ్యాండిల్, డిజిటల్ రీడింగ్, కీలెస్ ఎంట్రీ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

Mahindra కంపెనీ ఈ SUVని మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విడుదల చేసింది. అవి MX, AX3, AX5 మరియు AX7. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కంపెనీ సగటున 3,500 యూనిట్లను డెలివరీ చేయనున్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ఇటీవల బుక్ చేసుకున్న వినియోగదారులు ఈ SUV పొందాలంటే కనీసం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

ఇదిలా ఉండగా రానున్న మహీంద్రా XUV700 లో కొన్ని ఫీచర్లు ఉండే అవకాశం లేదని కంపెనీ తెలిపింది. అయితే ఇది పూర్తిగా తీసివేసే అవకాశం లేదు. ఇతర వాహన తయారీదారుల మాదిరిగానే, మహీంద్రా కంపెనీ కూడా చిప్ కొరతతో పోరాడుతోంది మరియు అటువంటి పరిస్థితిలో, మహీంద్రా XUV700 తక్కువ ఫీచర్లతో మరియు తక్కువ ధరతో వినియోగదారులకు అందుబాటులో ఉంచబడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబటులో ఉన్న దాదాపు అన్ని ఆధునిక కార్లలో ఎక్కువ సంఖ్యలో చిప్‌లు ఉపయోగించబడుతున్నాయి.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

దీని గురించి మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటోమోటివ్ మరియు ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్ మొత్తం లేటెస్ట్ ఉత్పత్తులలో ఉపయోగించే సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటోంది. కావున కొత్త XUV700 యొక్క కొన్ని వేరియంట్‌లను కొంత తక్కువ ధరకు మా కస్టమర్‌లకు అందించడానికి ప్రయత్నిస్తున్నాము, అన్నారు. అయితే వీటి కొనుగోలు అనేది కస్టమర్ల ఆసక్తిని బట్టి ఉంటుంది.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

ఇటీవల మహీంద్రా తన XUV700 లో వైర్‌లెస్ ఛార్జర్ ను తీసివేసింది. ఇందులో హై వేరియంట్‌లో ఎక్కువ ఫీచర్లు మరియు పరికరాలను అందించడానికి ఎక్కువ సెమీకండక్టర్స్ ఉపయోగించాల్సి ఉంది. అయితే లో వేరియంట్ లో మాత్రం కొన్ని తక్కువ ఫీచర్స్ ఉన్న కారణంగా ఇందులో తక్కువ సంఖ్యలో సెమికండక్టర్స్ ఉపయోగిస్తారు. మొత్తానికి ఈ SUV యొక్క టాప్ ఎండ్ వేరియంట్‌లో 170 చిప్స్ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

XUV700 AX7 డెలివరీలు ప్రారంభించిన Mahindra: వివరాలు

మహీంద్రా కంపెనీ ప్రస్తుతం మొత్తం 1.60 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్‌లను కలిగి ఉంది, చిప్ కొరత కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 32,000 యూనిట్లు తక్కువ వాహనాలను ఉత్పత్తి చేసింది. కొన్ని నెలల క్రితం, కంపెనీ తన థార్ SUV ని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్‌షిప్‌లకు పంపింది. ఈ కారణంగా చాలా డెలివరీలు ఆలస్యమయ్యాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 25, 2022, 10:10 [IST]
English summary
Mahindra xuv700 ax7 awd luxury delivery start details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+