ఏకంగా 1 లక్షకు చేరిన Mahindra XUV700 బుకింగ్స్.. ధర పెరిగినా తగ్గని క్రేజ్
2022 లో కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్న SUV మహీంద్రా (Mahindra) యొక్క XUV700. ఈ SUV గత సంవత్సరం భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది, అప్పటి నుంచి కూడా ఇది మంచి బుకింగ్స్ పొందుతోంది, ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఇది ఒక లక్ష బుకింగ్స్ అందుకుంది. దీపావళి సమయంలో కంపెనీ 70,000 బుకింగ్స్ పొందగలిగింది.

మహీంద్రా XUV700 బుకింగ్స్ 2021 అక్టోబర్ 7న ప్రారంభించబడింది. మొదటి రోజు 25,000 బుకింగ్‌లు మరియు మరుసటి రోజు 25,000 బుకింగ్‌లు వచ్చాయి. కేవలం రెండు రోజుల్లోనే 50,000 బుకింగ్స్ వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే నిజంగా ఊహకందని రెస్పాన్స్ ఇది అని చెప్పాలి.

కంపెనీ ముందుగా పెట్రోల్ మోడళ్ల డెలివరీలు ప్రారంభించి, ఆ తర్వాత డీజిల్ వేరియంట్‌ల డెలివరీలను ప్రారంభించారు. కంపెనీ ఇప్పటివరకు కంపెనీ జనవరి నాటికి 14,000 యూనిట్లను డెలివరీ చేసింది. అయితే పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ దిశవైపు అడుగులు వేస్తోంది, ఇందులో భాగంగానే కంపెనీ ఉత్పత్తిని మరింత వేగవంతం చేసింది.

మహీంద్రా కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు. దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 SUV మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

ఇదిలా ఉండగా మహీంద్రా తన XUV700 SUV ధరను ఇప్పుడు రూ. 46,000 నుండి రూ. 81,000 వరకు పెంచింది. ఇందులో XUV700 యొక్క పెట్రోల్ వెర్షన్ మీద కంపెనీ రూ. 75,000 వరకు పెంచింది, అదే సమయంలో XUV700 డీజిల్ ధరను రూ. 81,000 పెంచింది. ధరల పెరుగుదల తరువాత XUV700 యొక్క ప్రారంభ ధర రూ. 12.95 లక్షలు కాగా, XUV700 టాప్ వేరియంట్ ధర రూ. 23.80 లక్షలకు చేరింది.

మహీంద్రా XUV700 కి ఇప్పటికి కూడా మంచి డిమాడ్ ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ అకస్మాత్తుగా ధరలు పెంచడం వల్ల అమ్మకాలపైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనిపిస్తుంది. అయితే ధరల పెరుగుదల అమ్మకాలపైన ఎటువంటి ప్రభావం చూపుతుంది మరియు మంచి అమ్మకాలను పొందగలదా అనే మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








