కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) యొక్క 'ఎక్స్‌యువి700' (XUV700) విడుదలైనప్పటినుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే దేశీయ ఆటో మొబైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సెమీకండక్టర్ చిప్ కొరతల వల్ల ఉత్పత్తి కొంత మందగించింది. కావున డెలివరీలలో కొంత ఆలస్యం ఏర్పడింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ చిప్ కొరతలు వల్ల ఈ లేటెస్ట్ SUV లో కొన్ని ఫీచర్స్ తొలగించినట్లు తెలిపింది.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

నివేదికల ప్రకారం, మహీంద్రా XUV700 యొక్క ఎంపిక చేసిన వేరియంట్‌ల నుండి రెండవ కీ మరియు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ వంటివి తీసివేయబడ్డాయి, ఈ విషయాన్ని కంపెనీ డెలివరీకి ముందే కస్టమర్‌లకు సమాచారం అందించబడుతుంది, కావున కంపెనీ తరువాత ఎటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉండదు.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

మహీంద్రా యొక్క XUV700 అనేది 2021 ఆగష్టు నెలలో ప్రారంభిచబడింది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం మూడు గంటల్లో 75,000 బుకింగ్‌లను అందుకుని గొప్ప రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు కంపెనీ 20,221 యూనిట్లను డెలివరీ చేయగా, ఇప్పుడు దానిని వేగవంతం చేసేందుకు కంపెనీ సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

కంపెనీ యొక్క AX5, AX7 మరియు AX7L మోడల్‌లకు వర్తించే రసీదు ఫారమ్‌పై సంతకం చేయడానికి కంపెనీ కస్టమర్‌లను పొందుతోంది. రెండో కీని కంపెనీ 4 నుంచి 6 నెలల్లో అందజేస్తామని ఫారమ్‌లో పేర్కొన్నప్పటికీ, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయం గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. అయితే డీలర్‌షిప్ వద్ద ఈ భాగం అందుబాటులో ఉన్నప్పుడు ఇది ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

ఇప్పటికే బుక్ చేసుకుఆ కొంతమంది కస్టమర్లు ఈ ఫీచర్లను తగ్గించడం గురించి ఆందోళన చెందుతున్నారు, అయితే అవి లేకుండా వాహనం యొక్క డెలివరీని తీసుకోవలసి ఉంటుంది, ముఖ్యంగా రెండవ కీ లేకుండా డెలివరీ తీసుకుంటే వినియోగదారులు పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

అయితే కంపెనీ ఈ సమాచారం అందించిన తరువాత ఎంతమంది కస్టమర్లు వీటిని పొందటానికి సుముఖతను చూపుతారు అనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వాహనం కోసం 6 నెలలకు పైగా వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. కావున కస్టమర్లు డెలివరీ కోసం ఇంకా కొంత సమయం వేచి ఉండక తప్పదు.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

ఇదిలా ఉండగా మహీంద్రా కంపెనీ XUV700 యొక్క కొత్త వేరియంట్ టెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. కంపెనీ టెస్ట్ చేస్తున్న ఈ SUV 6 సీట్ల వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. XUV700 ని కెప్టెన్ సీటుతో తీసుకురావాలని కస్టమర్లు కంపెనీని డిమాండ్ చేస్తున్నారు, కావున కంపెనీ ఇప్పుడు దీనిపై పనిచేస్తోంది.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

రెండవ వరుసలో రెండు వైపులా హెడ్‌రెస్ట్‌లు ఉండటం మీరు ఈ టెస్టింగ్ XUV700 లో చూడవచ్చు. అయితే కెప్టెన్ సీటులా కనిపిస్తుందని ఈ ఫొటోల్లో చూడవచ్చు. కానీ ఇప్పుడు కూడా కంపెనీ దీని యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ గురించి వెల్లడించలేదు. ఈ కోట్ మోడల్ త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఇందులో సీటింగ్ తప్ప ఇతర మార్పులు ఏమి ఉండే అవకాశం లేదు.

కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. Mahindra XUV700 లో తగ్గిన ఫీచర్స్..

Mahindra XUV700 ఇప్పటివరకు ఏ మోడల్‌లోనూ కనిపించని కెప్టెన్ సీట్ ఆప్షన్‌తో అడెర్నోఎక్స్ యాప్‌లో చూడవచ్చు, కాబట్టి కంపెనీ తన 6 సీట్ల అవతార్‌ను కూడా విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము. ప్రస్తుతం, 5 సీట్లలో బెంచ్ సీటు మరియు 7 సీట్లలో మధ్య వరుసలో కూడా ఇవ్వబడింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఈ 6 సీట్ల కారు గురించి మరింత సమాచారం అందిస్తుంది.అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 10, 2022, 14:20 [IST]
English summary
Mahindra xuv700 features removed due to chip shortage details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+