స్వల్పంగా తగ్గిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా భారత మార్కెట్లో విడుదల చేసిన మొట్టమొదటి అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు కలిగిన ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ధరలు స్వల్పంగా తగ్గాయి.
Recommended Video
కొత్త ధరలు ఎలా ఉన్నాయి, వాటి వివరాలేంటి అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

మహీంద్రా గతేడాది చివర్లో తమ సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని విశిష్టమైన డిజైన్ మరియు అడ్వాన్స్డ్ ఫీచర్ల కారణంగా ఇది మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఈ మోడల్‌లో కొన్ని వేరియంట్ల కోసం దాదాపు 8 నుండి 12 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటోందని సమాచారం. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ధరలు తగ్గడం చాలా అరుదు. అయితే, ఇప్పుడు ఇందులో ఎంపిక చేసిన వేరియంట్లపై సుమారు రూ.6,000 వరకూ ధరలు తగ్గాయి.

ధరల సవరణ అనంతరం మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొత్త ధరలు ఇలా ఉన్నాయి:
మహీంద్రా ఎక్స్‌యూవీ700 పెట్రోల్ వేరియంట్ల ధరలు:
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 5-సీటర్ మాన్యువల్: రూ.16.49 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 7-సీటర్ మాన్యువల్: రూ.17.13 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 5-సీటర్ ఆటోమేటిక్: రూ.18.23 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్7 మాన్యువల్: రూ.19.15 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్7 ఆటోమేటిక్ : రూ.20.89 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

మహీంద్రా ఎక్స్‌యూవీ700 డీజిల్ వేరియంట్ల ధరలు:
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 5-సీటర్ మాన్యువల్: రూ.17.14 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 7-సీటర్ మాన్యువల్: రూ.17.78 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 5-సీటర్ ఆటోమేటిక్: రూ.18.86 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 7-సీటర్ ఆటోమేటిక్: రూ.19.49 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్7 7-సీటర్ మాన్యువల్: రూ.19.79 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్7 ఆటోమేటిక్: రూ.21.52 లక్షలు
* ఎక్స్‌యూవీ700 ఏఎక్స్7 ఆటోమేటిక్ ఆల్-వీల్-డ్రైవ్: రూ.22.92 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

మహీంద్రా నుండి ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటిగా ఉన్న ఎక్స్‌యూవీ700 ఇప్పటికే 1.5 లక్షలకు పైగా బుకింగ్‌లను కలిగి ఉంది. పెండింగ్‌లో ఆర్డర్లను వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు మహీంద్రా కూడా గట్టిగానే కృషి చేస్తోంది. అయితే, పెరుగుతున్న డిమాండ్ మరియు సప్లయ్ చైన్‌లోని అంతరాయాల కారణంగా కంపెనీ తగిన స్థాయిలో వాహనాల ఉత్పత్తిని సాధించలేకపోతోంది. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీలోని ఎంపిక చేసిన వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్‌లు 1 సంవత్సరానికి పైగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో ఎక్కువగా డీజిల్ వేరియంట్‌లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, డీజిల్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ చాలా అధికంగా ఉంది. అయితే, పెట్రోల్ వేరియంట్‌ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం కాస్తంత తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ యొక్క టాప్-ఎండ్ 'AX' వేరియంట్‌లతో పోలిస్తే బేస్ 'MX' వేరియంట్ చాలా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉంది. ప్రస్తుతం, మహీంద్రా భారతదేశంలో సగటున ప్రతినెలా సుమారు 6,000 యూనిట్ల ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తోంది. ఇది ఈ ఎస్‌యూవీ కోసం ఉన్న సగటు బుకింగ్ కంటే చాలా తక్కువ.

ఎక్స్‌యూవీ700 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి శక్తిని మరియు 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, దీని 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. మొదటిది 182 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 'MX' వేరియంట్‌లో ఉపయోగించిన ఇదే డీజిల్ ఇంజన్ 153 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 అత్యుత్తమ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది.

ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలోని ఇతర ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్స్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఇందులో డ్యాష్‌బోర్డులో డ్యూయల్-డిస్ప్లే సెటప్ (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ మొదలైనవి చాలానే ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఆధారంగా ఎలక్ట్రిక్ వెర్షన్ ఎస్‌యూవీ వస్తోంది..
ఇదిలా ఉంటే, మహీంద్రా తాజాగా తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ400 ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇది మహీంద్రా యొక్క కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 మోడల్ ఆధారంగా రూపొందించబడింది. అదేవిధంగా, ప్రస్తుత ఎక్స్‌యూవీ700 ఆధారంగా కంపెనీ ఇందులో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం దీనిని XUV.E8 అనే పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు డిసెంబర్ 2024 నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








