కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ నుండి భారత మార్కెట్లో విడుదల కానున్న నాల్గవ ఉత్పత్తి కియా కారెన్స్ (Kia Carens). కియా ఇప్పటికే ఈ కారు గురించి అనేక వివరాలను వెల్లడి చేసింది. ప్రస్తుతం, కంపెనీ విక్రయిస్తున్న కార్నివాల్ లగ్జరీ ఎమ్‍పివికి దిగువన, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మరియు టొయోటా ఇన్నోవా వంటి ఎమ్‌పివిలకు పోటీగా కంపెనీ ఈ సరికొత్త కారెన్స్ ఎమ్‌పివిని ప్రవేశపెట్టనుంది. మరికొద్ది రోజుల్లోనే కియా కారెన్స్ ఎమ్‌పివి అధికారికంగా మార్కెట్లో అమ్మకానికి రానుంది.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

కియా కారెన్స్ చూడటానికి బాడీ టైప్ పరంగా ఎమ్‌పివి అయినప్పటికీ, ఇది ఈ విభాగంలో కొన్ని ప్రముఖ 6/7-సీటర్ మోడళ్లతో కూడా పోటీ పడుతుంది. అలాంటి మోడళ్లలో ఒకటి ఇటీవలే మార్కెట్లోకి వచ్చి, బుకింగ్స్ పరంగా సంచలనం సృష్టించిన సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700). కారెన్స్ మరియు మరియు ఎక్స్‌యూవీ700 వాహనాలు రెండూ కూడా వేర్వేరు విభాగాలకు చెందినప్పటికీ, ఈ రెండింటిలో అనేక ఫీచర్లు మరియు లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

ఒకవేళ మీరు మార్కెట్లో మంచి 7-సీటర్ వాహనం కోసం చూస్తుండి, ఈ రెండు మోడళ్లలో ఏది కొనాలా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లయితే, ఈ కథనంలో కారెన్స్ మరియు ఎక్స్‌యూవీ700 వాహనాల మధ్య తేడాలను, పోలికలను ఈ కథనంలో తెలసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

డిజైన్

వాహనం యొక్క డిజైన్ అనేది పూర్తిగా కొనుగోలుదారుల వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఒకరు ఇష్టపడేది వేరొకరికి నచ్చకపోవచ్చు. అయితే, కారెన్స్ మరియు ఎక్స్‌యూవీ700 వాహనాల డిజైన్ విషయానికి వస్తే, కారెన్స్ చూడటానికి చాలా సింపుల్ గా సాంప్రదాయ 7-సీటర్ ఎస్‌యూవీగా కనిపిస్తుంది. అయితే, ఎక్కువ మంది కొనుగోలుదారులు దాని మజిక్యులర్ డిజైన్ సిల్హౌట్ కారణంగా కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీని ఇష్టపడుతున్నారు.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

అంతేకాకుండా, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొంచెం ఆధునికంగా మరియు అధునాతనంగా కనిపిస్తుంది. కంపెనీ ఇందులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను అందించింది, ఇది మనదేశంలోనే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ గా ఉంటుంది. అలాగని, కియా కారెన్స్ డిజైన్ ని తీసివేయాల్సి అవసరం లేదు. ఇందులో స్టైలిష్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు వెనుక పూర్తి-వెడల్పుతో ఉండే టెయిల్‌ల్యాంప్‌లతో ఇది సమకాలీనంగా మరియు అధునాతనంగా కనిపిస్తుంది.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ సైడ్ మిర్రర్స్, పవర్డ్ అండ్ అడ్జస్టబల్ సీట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న అత్యంత ఫీచర్-రిచ్ కార్లలో ఒకటిగా ఉంటుంది.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

కియా కారెన్స్ విషయానికి వస్తే, ఇందులో ఆడియో కంట్రోల్స్, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడి హెడ్‌లైట్లు వంటి మరెన్నో ఫీచర్లతో లభిస్తుంది. కియా బ్రాండ్ కూడా తమ వాహనాలను ఫీచర్లతో లోడ్ చేస్తుంది కాబట్టి, కియా కారెన్స్ కూడా అదే స్థాయిలో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

సేఫ్టీ ఫీచర్లు

ఈ రెండు కూడా 7-సీటర్ వాహనాలు, వీటిలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి, ఈఎస్‌సి, టిసి, ఏబిఎస్ మరియు టిపిఎమ్ఎస్ వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. అయితే, మహీంద్రా XUV700 లో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ (ADAS) వంటి అటానమస్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విషయంలో మాత్రం కియా కారెన్స్ కన్నా మహీంద్రా ఎక్స్‌యూవీ700 ముందంజలో ఉంటుంది.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

కొత్త ఎక్స్‌యూవీ700ని అభివృద్ధి చేయడానికి మహీంద్రా స్పష్టంగా తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది మరియు ఇది అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో ఈ విభాగంలో తన ప్రత్యర్థులందరిపై అగ్రస్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ ADAS ఫీచర్లలో భాగంగా, ఫార్వర్డ్ కొలైజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు స్మార్ట్ పైలట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

పవర్ట్రైన్ (ఇంజన్, గేర్‌బాక్స్)

కియా కారెన్స్ ఎమ్‌పివిని కంపెనీ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేయనుంది. ఇందులో 114 bhp మరియు 250 Nm టార్క్‌ను జనరేట్ చేసే 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. ఇకపోతే, మిగిలిన రెండు ఇంజన్‌లు పెట్రోల్ యూనిట్లు, ఇందులో ఒకటి 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 113 bhp మరియు 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

చివరగా, కియా కారెన్స్ లోని మూడవ ఇంజన్ ఆప్షన్ 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 138 bhp మరియు 242 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో అందిస్తున్నారు.

కియా కారెన్స్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌‌యూవీ700: ఈ రెండింటిలో ఏ 7-సీటర్ ఎస్‌యూవీ బెస్ట్?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, ఇది ఒక పెట్రోల్ ఇంజన్ మరియు రెండు డీజిల్ ఇంజన్‌ల ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అలాగే, గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ రూపంలో లభిస్తాయి. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 197 bhp మరియు 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, డీజిల్ ఇంజన్లు 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ల రూపంలో ఉంటాయి. ఇందులో శక్తివంతమైన వేరియంట్ 182 bhp మరియు 45 0Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, తక్కువ శక్తివంతమైన వెర్షన్ 153 bhp మరియు 360 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఇందులో ఆప్షనల్ ఆల్-వీల్-డ్రైవ్ ను కూడా అందిస్తోంది. ఓవరాల్ గా చూస్తే, ఈ రేసులో కియా కారెన్స్ కన్నా మహీంద్రా ఎక్స్‌యూవీ700 ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, February 11, 2022, 16:06 [IST]
English summary
Mahindra xuv700 suv vs kia carens mpv lets findout which 7 seater is best
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+