Mahindra XUV700 కి కొత్త పేరు.. 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' విజేత
భారతీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) యొక్క కొత్త SUV 'మహీంద్రా ఎక్స్‌యువి700' (Mahindra XUV700) దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు ఈ కొత్త SUV 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను సొంతం చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు' ప్రకటించడం అందరికి తెలిసిందే, ఈ సంవత్సరం అనేక కార్లు ఇందులో కనిపించించాయి. ఇందులోని ఎంజి మోటార్ కంపెనీ యొక్క ఎంజి ఆస్టర్, స్కోడా ఆక్టావియా, ఫోర్స్ గూర్ఖా, మారుతి సుజుకి సెలెరియో, సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్, స్కోడా కుషాక్, రెనాల్ట్ కిగర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు టాటా పంచ్ వంటి పోటీదారులపైన నెగ్గి మహీంద్రా యొక్క ఎక్స్‌యువి700 ఇప్పుడు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

ఈ అవార్డు రేసులో మహీంద్రా ఎక్స్‌యువి700 SUV 101 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 89 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో నిలిచిన టాటా పంచ్ మైక్రో SUV 71 పాయింట్లు సాధిచింది.

మహీంద్రా ఎక్స్‌యువి700 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' గెలుచుకున్న సందర్భంగా మహీంద్రా కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'వీజయ్ నక్రా' మాట్లాడుతూ.. ఇది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. ఈ గౌరవం ప్రధానం చేసిన ICOTY 2022 కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కంపెనీ యొక్క ఈ లేటెస్ట్ SUV యొక్క అద్భుతమైన డైజిన్ మరియు నిర్మాణ నాణ్యత వల్ల ఈ గౌరవం దక్కింది అన్నారు. ఇది కంపెనీ యొక్క కస్టమర్ల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో XUV500 గొప్ప విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ XUV700 విడుదల చేసింది. XUV700 భారతీయ మార్కెట్లో విడుదలకాక ముందు నుంచే ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్. విడుదలైన తరువాత అంతకు మించిన ఆదరణ పొందింది. ఈ కారణంగానే విపరీతమైన బుకింగ్స్ కూడా పొందగలిగింది.

మహీంద్రా XUV700 ధర ప్రస్తుతం భారతీయ మార్కెట్లో (ధరల పెరుగుదల తరువాత) రూ. 12.95 లక్షలు నుంచి రూ. 23.79 లక్షల వరకు ఉంది. ఇది ఆకర్షణీమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది. అంతే కాకూండా సేఫ్టీ విషయంలో కూడా మంచి రేటింగ్ పొందింది.

భారతీయ మార్కెట్లో మహీంద్రా XUV700 రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎమ్ఎక్స్ మరియు ఏఎక్స్ వేరియంట్స్. ఇందులోని ఎమ్ఎక్స్ వేరియంట్ 5-సీటర్ SUV కాగా, ఏఎక్స్ వేరియంట్స్ 5-సీటర్ లేదా 7-సీటర్ వెర్షన్‌గా అందుబాటులో ఉంది. అదేవిధంగా ఏఎక్స్ ట్రిమ్ లో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 మరియు ఏఎక్స్7ఎల్ వేరియంట్లు. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందుభాగంలో కొత్త డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు క్రోమ్ ఫినిష్ కలిగిన వర్టికల్ స్లాట్‌లతో సరికొత్త గ్రిల్ కలిగి ఉంది. ఈ బ్రాండ్ ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన కొత్త లోగోను కూడా ఈ గ్రిల్ లో చూడవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఎనేబుల్, 60 కి పైగా కనెక్ట్ ఫీచర్లు, ఇ-సిమ్ బేస్డ్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 2 వ మరియు 3 వ వరుస ఎసి వెంట్‌లు, మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమవుతుంది.

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.
దేశీయ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 హ్యుందాయ్ అల్కాజార్, ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారీ మరియు జీప్ మెరిడియన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








