అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' గ్రూప్‌లో భాగమైన 'మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్' భారతీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలట్రిక్ త్రీ-వీలర్ పేరు 'జోర్ గ్రాండ్‌' (Zor Grand). మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ధర రూ. 3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు).

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

ఈ మహీంద్రా జోర్ గ్రాండ్‌ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

మహీంద్రా జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ లాంచ్‌తో, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే 12,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

మహీంద్రా జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ ఆధునిక డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, జిపిఎస్, ఆఫ్‌బోర్డ్ ఛార్జర్, క్యాబిన్ లైట్, మొబైల్ హోల్డర్, చేయడానికి అనుకూలంగా ఉండే గ్లోవ్ బాక్స్, రివర్స్ బజర్, స్పేర్ వీల్ ప్రొవిజన్ మరియు హజార్డ్ ఇండికేటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

మహీంద్రా యొక్క జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ మొత్తం 3 వేరియంట్‌లలో లభిస్తుంది. అవి డెలివరీ వాన్ బాడీ 140 Cu.feet బాక్స్, 170 Cu.feet బాక్స్ మరియు పికప్-స్టైల్ బాడీ వేరియంట్స్. ఇవన్నీ వాహన వినియోగదారుల అవసరాలకు అనుకూలంగా తయారుచేయబడ్డాయి.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మహీంద్రా జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ 10.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. అదే సమయంలో ఇందులో 50 ఎన్ఎమ్ టార్క్‌తో 'బెస్ట్-ఇన్-ఇండస్ట్రీ' 12 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు కూడా అందుబాటులో ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

మహీంద్రా జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ ఒక ఫుల్ ఛార్జ్ తో 153 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే అవకాశం ఉంటుందని ధృవీకరించబడింది. అయితే వాస్తవ ప్రపంచంలో ఈ పరిధి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఒక ఫుల్ ఛార్జ్ తో ఖచ్చితంగా 100 కిమీ పరిధిని అందించగలదు. కావున వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

ఇక మనం చెప్పుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే, ఛార్జింగ్. మహీంద్రా జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 4 గంటల సమయం పడుతుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క గరిష్ట వేగం 50 కిమీ వరకు ఉంటుంది. ఇందులో సాధారణ 3-వీలర్లలో ఉండే గేర్‌బాక్స్ ఆప్సన్ కాకుండా.. ఫార్వర్డ్, న్యూట్రల్ మరియు రివర్స్ అనే మూడు మోడ్‌లు ఉంటాయి.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ 3-వీలర్ లాంచ్‌ సందర్భంగా మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) సీఈవో 'సుమన్ మిశ్రా' మాట్లాడుతూ.. లాస్ట్ మైల్ డెలివరీ మరియు లాజిస్టిక్స్ విభాగంలో విశ్వసనీయమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన కార్గో రవాణాను ప్రారంభించడానికి ప్రీమియం మరియు అధిక-నాణ్యత గల ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు చాలా అవసరం. ఈ డిమాండ్‌లను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కంపెనీ సరికొత్త జోర్ గ్రాండ్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకూండా ప్రస్తుతం ఇలాంటి వాహనాల అవసరం మరియు ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా అన్నారు.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

ఇక వారంటీ విషయానికి వస్తే, మహీంద్రా జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ పైన 3 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీ అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కి 5 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా మెరుగైన అమ్మకాల తర్వాత సర్వీస్ కోసం 800 కంటే ఎక్కువ టచ్‌పాయింట్లను కలిగి ఉంది. కావున కొనుగోలుదారులు సులభంగా సర్వీస్ కూడా పొందవచ్చు.

అత్యుత్తమ పర్ఫామెన్స్ అందించే 'జోర్ గ్రాండ్‌' ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులకు మరియు కార్లకు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు అని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మహీంద్రా ఈ కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ లాంచ్ చేయడం వాహన వినియోగదారులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి.

More from DriveSpark

Article Published On: Monday, August 29, 2022, 18:04 [IST]
English summary
Mahindra zor grand electric cargo launched price range features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+