మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

'మహీంద్రా థార్' (Mahindra Thar) సాధారణ ప్రజలదగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరిని ఆకర్శించే ఆఫ్ రోడర్, అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీల గ్యారేజిలో స్థానం సంపాదించిన ఈ ఆఫ్ రోడర్ ఇప్పుడు మరో సెలబ్రెటీ కార్ గ్యారేజిలో చేరిపోయింది.

Recommended Video

క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా థార్

ఇంతకీ ఇటీవల మహీంద్రా థార్ కొనుగోలుచేసి ఆ సెలబ్రెటీ ఎవరు, ఆ మహీంద్రా థార్ విశేషాలు ఏమిటి అనే విషయాలు మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

ప్రముఖ మలయాళీ నటుడు 'జయసూర్య' ఇటీవల 2020 మహీంద్రా థార్ కొనుగోలు చేసాడు. ఈ ఆఫ్ రోడర్ డెలివరీ తీసుకునే కొన్ని దృశ్యాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో జయసూర్య తన కుంటుంబంతో కలిసి డెలివరీ తీసుకుంటాడు. ఈ వీడియో లైఫ్ఇన్4×4 యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేయబడింది.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

జయసూర్య కొనుగోలు చేసిన థార్ బ్లాక్ కలర్ లో ఉంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన 4×4 ఎస్‌యువిలలో ఒకటి మహీంద్రా థార్. ఈ కొత్త మహీంద్రా థార్ దాని పాత మోడల్ కంటే కూడా చాలా ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా.. లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

మహీంద్రా థార్ అనేది మొత్తం మూడు రూఫ్ ఆప్సన్స్ పొందుతుంది. అవి సాఫ్ట్ టాప్, సాఫ్ట్ కన్వర్టిబుల్ మరియు హార్డ్ టాప్. అయితే కస్టమర్ ఇందులో ఏ వేరియంట్ అయినా ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతాయి.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

నిజానికి భారతీయ మార్కెట్లో మహీంద్రా థార్ విడుదలైనప్పటినుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కూడా ఈ ఆఫ్ రోడర్ యొక్క డెలివరీలు ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. థార్ SUV ఆధునిక ఫీచర్స్ మాత్రమే కాకూండా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

అవి 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఆప్సన్స్ పొందుతాయి.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

కొత్త మహీంద్రా థార్ దాని పాతదాని కంటే మరింత శక్తివంతమైనది. ఇది గ్లోబల్ NCAP ద్వారా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్‌ వంటివి స్టాండర్డ్ ఫీచర్స్ గా ఉంటాయి. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు భద్రతా ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

కొత్త మహీంద్రా థార్ కొత్త ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీనికి 7 స్లాట్ గ్రిల్స్ లభిస్తాయి. ముందు భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, వెనుక భాగంలో ఎల్‌ఈడీ టైల్లైట్ ఉన్నాయి. ఇది మునుపటి కంటే పెద్దదిగా మరియు ఆకర్షణీయంగా మారింది.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

థార్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్, క్రూయిస్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ వంటి వాటిని పొందుతుంది.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

ఇదిలా ఉండగా మహీంద్రా కంపెనీ థార్ SUV లో డోర్స్ ఎడిషన్ కూడా తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త మహీంద్రా థార్ యొక్క 5-డోర్ల మోడల్ 2023-2026 మధ్య భారతదేశంలో ప్రారంభించబడే అవకాశం ఉంది. అయితే ఇది థార్ యొక్క ప్రస్తుత మోడల్ కంటే పెద్దది మరియు ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో రానుంది.

మొన్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'జయసూర్య' ఈ ఆఫ్ రోడర్ కొనేశారు: వివరాలు

ఇప్పటికే నటుడు జయసూర్య తన గ్యారేజ్ లో మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్, జాగ్వార్ ఎక్స్ఎఫ్, మినీ కూపర్, లెక్సస్ ఈఎస్300హెచ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మహీంద్రా థార్ కూడా చేరింది. మహీంద్రా థార్ ఆఫ్ రోడర్ ని ప్రకాష్ రాజ్, మలయాళ నటి అను సితార మొదలైన వారు కూడా కొనుగోలు చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2022, 15:02 [IST]
English summary
Malayalam actor jayasurya added new mahindra thar suv to his garage details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+