2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

భారతీయ మార్కెట్లో త్వరలోనే కొత్త 2022 మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (2022 Maruti Baleno Facelift) విడుదల కానుంది. ఈ కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్ కి సంబంధించిన చాలా విషయాలను కంపెనీ ఇదివరకే చాలా టీజర్ వీడియోల ద్వారా పంచుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా దీని మైలేజ్ కి సంబంధించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, బాలెనో ఫేస్‌లిఫ్ట్ మాన్యువల్‌ వేరియంట్ 22.35 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. అదేవిధంగా దాని ఆటోమాటిక్ వేరియంట్ 22.94 కిమీ/ లీ అందిస్తుందని వెల్లడయ్యింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ నిర్దారించింది. కావున ఆటోమేటిక్ వేరియంట్ వినియోగదారులకు ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

ఇప్పుడు కొత్తగా రానున్న మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ బరువు మునుపటికంటే కూడా దాదాపు 70 కేజీలు ఎక్కువగా ఉంటుంది. కావున దీని బరువు ఇప్పుడు 1410 కేజీలు. ఇది ఇప్పుడు మునుపటికంటే కూడా మెరుగైన నిర్మాణం కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇది మొత్తం సిగ్మా, డెల్టా, జీటా, జీటా (ఓ), ఆల్ఫా, ఆల్ఫా (ఓ) వంటి మొత్తం 11 వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

2022 మారుతి బాలెనో యొక్క బుకింగ్స్ కూడా ప్రారభించబడ్డాయి. కావున కొనుగోలుదారులు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఇది మార్కెట్లో విడుదలైన వెంటనే ప్రారంభమవుతాయి. ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా లేటెస్ట్ గా ఉంటుంది.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

మారుతి బాలెనో భారతదేశంలో ఒకే ఇంజన్ ఆప్సన్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ బాలెనో యొక్క ఇంజిన్‌ను మార్చలేదు. కావున మొదటిది 1.2-లీటర్ ఇంజన్, ఇది 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఆడిస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

మార్కెట్లో ఇప్పటికే ఉన్న బ్రెజ్జా మరియు ఎర్టిగా వంటివి మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. కావున ఈ కొత్త 2022 బాలెనొ కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది బహుశా 4 స్టార్ రేటింగ్ లేదా 5 స్టార్ రేటింగ్ పొందే విధంగా తయారుచేయబడే అవకాశం ఉంటుంది. కొత్త 2022 బాలెనొ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్ మరియు కెమెరా, హై స్పీడ్ వార్నింగ్ వంటి వాటిని పొందుతుంది.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

2022 మారుతి బాలెనోలో మెరుగైన స్టీల్‌తో తయారు చేయబడిన కొత్త బాడీ ప్యానెల్‌లు ఇన్‌స్టాల్ చేయబడింది. ఇప్పుడు ఈ మోడల్ యొక్క ముందు భాగం చాలా వరకు కొత్తగా ఉంటుంది. ఇందులో మెష్ గ్రిల్ తో పాటి హెడ్‌లైట్స్ మరియు వెనుక భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి వాటిని పొందుతుంది. వీటితో పాటు ఇది పెద్ద బంపర్, విశాలమైన ఎయిర్ డ్యామ్ మరియు రౌండ్ ఫాగ్ లైట్లను పొందుతుంది.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

మారుతి బాలెనో యొక్క బానెట్ కూడా రీడిజైన్ చేయబడింది. ఇది మునుపటితో పోలిస్తే చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. వెనుక భాగంలో రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, L-ఆకారపు టైల్‌లైట్ క్లస్టర్ మరియు ఎల్ఈడీ ఇంటర్నల్‌లు మరియు కొత్త బంపర్ ఇవ్వబడ్డాయి. సైడ్ ఫ్రొఫైల్ లో కొత్త అల్లాయ్ వీల్స్ కనిపించినప్పటికీ, డిజైన్ అలాగే ఉంచబడింది. మొత్తం మీద బాలెనొ చాలా వరకు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి, చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

మారుతి సుజుకి విడుదల చేసిన ఒక కొత్త టీజర్ వీడియోలో బాలెనో ఫేస్‌లిఫ్ట్ యొక్క 360-డిగ్రీ కెమెరాను చూపించింది. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. 9-ఇంచెస్ పెద్ద డిస్‌ప్లే మొదటిసారిగా డిసెంబర్ 2021 లో యూరప్‌లోని కొత్త మారుతి S-క్రాస్‌లో కనిపించింది.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

అయితే ఇప్పుడు త్వరలో రానున్న కొత్త ప్రీమియం మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ లోని ప్రస్తుత 7-ఇంచెస్ యూనిట్ స్థానంలో ఇదే విధమైన 9-ఇంచెస్ పెద్ద డిస్‌ప్లే రానుంది. ఈ కొత్త డిస్ప్లే యావరేజ్ స్పీడ్, డ్రైవింగ్ టైమ్ మరియు యావరేజ్ ఫ్యూయెల్ వినియోగం వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా టచ్-ఎనేబుల్ చేయబడిన వాల్యూమ్ అప్/డౌన్, హోమ్, మ్యూజిక్ ప్లే, కాల్ రిసీవ్/ఎండ్ మరియు వాయిస్ కమాండ్ బటన్‌లను చూడవచ్చు.

2022 Baleno Facelift మైలేజ్ వెల్లడించిన Maruti Suzuki

ఇన్ఫోటైన్‌మెంట్ రిమోట్ ఫంక్షన్ మరియు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌కి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. డ్రైవింగ్ సమయంలో వినియోగదారునికి కావాల్సిన సమాచారం అందిస్తుంది. మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ ఐ20 మరియు టాటా ఆల్ట్రోజ్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 16, 2022, 12:32 [IST]
English summary
Maruti baleno facelift mileage revealed details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+