మళ్ళీ విడుదలకు సిద్దమవుతున్న గ్రాండ్ విటారా.. అయితే ఇప్పుడు CNG వెర్షన్‌లో

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే బాలెనొ CNG, ఎక్స్ఎల్6 CNG వంటివి విడుదల చేసింది. ఇక త్వరలో గ్రాండ్ విటారా CNG లాంచ్ చేయనుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త గ్రాండ్ విటారా CNG కోసం మారుతి సుజుకి బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే ఈ వెర్షన్ లాంచ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

CNG వెర్షన్‌లో విడుదలకానున్న గ్రాండ్ విటారా

CNG వాహన విభాగంలో వేగాన్ని పెంచిన మారుతి సుజుకి ఈ సంవత్సరం చివరి నాటికల్లా తన కొత్త గ్రాండ్ విటారా CNG ని విడుదల చేయనుంది. మారుతి సుజుకి రాబోయే తన గ్రాండ్ విటారా CNG యొక్క ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, అయితే ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

మారుతి గ్రాండ్ విటారా CNG వెర్షన్ అదే 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో అందించబడుతుంది. ఈ ఇంజిన్ మారుతి సుజుకి ఎర్టిగా S-CNG మరియు మారుతి సుజుకి XL6 CNG వంటి వాటిలో కూడా ఉంది. CNG వెర్షన్ 87 బిహెచ్‌పి పవర్ మరియు 121.5 ఎన్ఎమ్ తారక్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమమైన మైలేజ్ అందిస్తుందని భావించవచ్చు.

నిజానికి కొత్త గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది.

రాబోయే కొత్త మారుతి గ్రాండ్ విటారా CNG దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ ని పోలి ఉంటుంది. కావున అదే డిజైన్ మరియు ఫీచర్స్ పొందనుంది. కావున ఇందులో అదే క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉంటాయి.

ఇక ఫీచర్స్ విషయంలో కూడా అదే 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. అంతే కాకుండా.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఈ గ్రాండ్ విటారా CNG గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Most Read Articles

English summary
Maruti grand vitara cng coming soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X