విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీ దేశీయ మార్కెట్లో ఇటీవల తన 'గ్రాండ్ వితారా' (Grand Vitara) ను ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క బుకింగ్స్ అంతకు ముందే జూలై 11 న ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం రెండు వారాల కాలంలోనే మారుతి గ్రాండ్ విటారా 13,000 బుకింగ్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం రండి.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మారుతి గ్రాండ్ విటారా' మైల్డ్ హైబ్రిడ్ మరియు 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ జీటా + మరియు ఆల్ఫా + వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లు ఇప్పటికే దాదాపు 54% కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందాయి. మొత్తం మీద బుకింగ్స్ పరంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ 7,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందినట్లు తెలిసింది.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

మారుతి గ్రాండ్ వితారా యొక్క ధర ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే కంపెనీ ధరలను వచ్చే నెలలో వెల్లడించే అవకాశం ఉంటుంది. డెలివరీలు ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ SUV మరిన్ని ఎక్కువ బుకింగ్స్ పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో చెప్పుకోదగ్గది మైలేజ్. గ్రాండ్ వితారా 1.5-లీటర్ పెట్రోల్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 115.56 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. E-CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజన్ 27.97 కిమీ/లీ మైలేజీని ఇస్తుంది. ఇందులో ఎకో, పవర్ మరియు నార్మల్ వంటి మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

ఇక రెండవ ఇంజన్ 1.5-లీటర్ కె-సిరీస్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే పెట్రోల్ ఇంజన్. ఇది 103.06 హెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ, 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి వాటిని పొందుతుంది. గ్రాండ్ విటారా మాన్యువల్ 21.11 కిమీ/లీ, ఆటోమేటిక్ 20.58 కిమీ/లీ మరియు AllGrip మాన్యువల్ 19.38 కిమీ/లీ మైలేజీ అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

మారుతి సుజుకి గ్రాండ్ వితారా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో ఇప్పుడు కొత్త గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ మధ్య భాగంలో పెద్ద సుజుకి బ్యాడ్జ్‌ ఉంది. ఇందులో 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి, అదే సమయంలో రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ టర్న్ లైట్లు మరియు 3-ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు బ్రాండ్ యొక్క లోగో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త ఎస్‌యూవీ మరింత ఆధునికంగా కనిపించేలా చేస్తాయి.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా కొలతల విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ పొడవు 4,345 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,795 మిమీ మరియు వీల్ బేస్ 2,600 మిమీ వరకు ఉంటుంది.

గ్రాండ్ విటారా యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్, డోర్లు మరియు సీట్లు అన్ని కూడా లెదర్ అపోల్స్ట్రే తో ఉన్నాయి.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

అంతే కాకుండా ఇందులో డ్రైవర్ మరియు కో-డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్లు పొందుతారు. కలర్డ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 40 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ మరియు సుజుకి కనెక్ట్ యాప్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

విడుదలకు ముందే దుమ్మురేపుతున్న 'గ్రాండ్ వితారా' బుకింగ్స్: వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి యొక్క కొత్త గ్రాండ్ వితారా భిన్నమైన మరియు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఫీచర్స్ కూడా అప్డేట్ చేయబడ్డాయి. కంపెనీ ఇప్పటికే మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్‌ని అందిస్తోంది, అయితే ఇప్పుడు మొదటిసారిగా బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో విడుదల చేయనుంది. ఇది తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. గ్రాండ్ వితారా ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 23, 2022, 13:48 [IST]
English summary
Maruti grand vitara gets 13000 bookings details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+