'గ్రాండ్ వితారా' టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణపొందిన మరియు అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో ఒక కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎస్‌యూవీ 'మారుతి గ్రాండ్ విటారా' (Maruti Grand Vitara). ఈ ఎస్‌యూవీ యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు కంపెనీ తాజాగా దీనికి సంబంధించిన ఒక టీజర్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టీజర్ లో దాని పరిమాణం స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకూండా ఈ టీజర్ లో కనిపించే బానెట్ దాని మునుపటి మోడల్ కంటే కొంత పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఓఆర్విఎమ్ మరియు టర్న్ ఇండికేటర్స్ వంటివి కూడా ఇందులో గమనించవచ్చు.

రెండు డోర్ హ్యాండిల్స్ మరియు రియర్ ప్రొఫైల్ లో టెయిల్‌లైట్ వంటివి కూడా ఈ టీజర్ లో గమనించవచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఇందులో దాదాపు అన్నీ కూడా ఎల్‌ఈడీ లైట్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందు వైపు నుండి కొంత వాలుగా ఉండే డిజైన్‌ కలిగి వెనుక భాగం ఫ్లాట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రూఫ్‌ రైల్‌ ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు, అంతే కాకుండా ఈ టీజర్ లో కూడా ఇది స్పష్టంగా కనిపించలేదు.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ గురించి ఎక్కువ సమాచారం అందించలేదు. కానీ ఇది ఈ నెల 20 న భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడుతుంది. ఆ సమయంలో డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు అన్నీ కూడా అధికారికంగా వెల్లడవుతాయి.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

నివేదికల ప్రకారం మారుతి గ్రాండ్ విటారా అనేది రెండు ట్రిమ్‌లలో అందుబాటులో రానున్నట్లు సమాచారం. ఇది టయోటా సహకారంతో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇది టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇందులో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొత్తం మీద మారుతి సుజుకి తన కొత్త గ్రాండ్ వితారా ను ఆధునిక ప్రపంచంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉండేలా తయారుచేయనుంది.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా కంపెనీ యొక్క ఎస్-క్రాస్ స్థానంలో రానుంది. కంపెనీ తన ఎస్-క్రాస్ ను త్వరలోనే నిలిపివేసే అవకాశం ఉంది. కొత్త గ్రాండ్ వితారా కంపెనీ యొక్క నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతుంది. కావున ఈ ఎస్‌యూవీ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ విటారా బిదరిలోని టయోటా ప్లాంట్‌లో తయారు చేయబడిన తరువాత డీలర్‌లకు రవాణా చేయబడుతుంది. టయోటా హైరైడర్ కూడా ఇదే ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడుతుంది. ఇది రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది, పండుగ సీజన్ లో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

మారుతి సుజుకి ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. దీనికి తోడు ఇటీవల కంపెనీ 2022 మారుతి బ్రెజ్జా విడుదల చేసింది. కావున రానునన్ రోజుల్లో మరింత మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కంపెనీ యొక్క ఎస్-క్రాస్ యొక్క వార్షిక అమ్మకాలు మొత్తం 20,000 యూనిట్లుగా ఉన్నాయి. అయితే దీని స్థానంలో కంపెనీ ఇప్పుడు గ్రాండ్ వితారా తీసుకురానున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసింది.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

2022 మారుతి బ్రెజ్జా:

ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త '2022 బ్రెజ్జా' ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 13.96 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. ఇది ఆధునిక డిజైన్ కలిగి అధునాతన పరికరాలను పొందుతుంది.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

2022 మారుతి బ్రెజ్జా 1.5-లీటర్, కె15సి ఇంజిన్‌ పొందుతుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, బ్రెజ్జా మ్యాన్యువల్ వెర్షన్స్ ఒక లీటరుకు గరిష్టంగా 20.15 కిలోమీటర్ల మైలేజ్ మరియు ఆటోమేటిక్ వెర్షన్స్ లీటరుకు 19.80 కిమీ మైలేజ్ అందిస్తుందని క్లెయిమ్ చేయబడింది.

గ్రాండ్ వితారా టీజర్ విడుదల చేసిన మారుతి సుజుకి: ఇందులో ఏముందంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి త్వరలో ఆవిష్కరించనున్న కొత్త మారుతి గ్రాండ్ వితారా గురించి ఎక్కువ సమాచారం అందించలేదు. కంపెనీ ఎప్పటికప్పుడు ఈ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం అప్డేట్ చేస్తూ ఉంటుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎస్‌యూవీ తప్పకుండా భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుంది అని ఆశిస్తున్నాము. ఈ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2022, 8:00 [IST]
English summary
Maruti grand vitara new teaser dimension details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+