విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

భారతీయ మార్కెట్లో 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీ యొక్క వాహనాలకు ఉన్న ఆదరణ మరియు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పటినుంచి దేశీయ మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో ఇప్పటికి కూడా అదే ఊపుతో ముందుకెళుతున్న మారుతి సుజుకి ఇటీవల మారుతి ఆల్టో కె10 లాంచ్ చేసింది, కాగా 2022 సెప్టెంబర్ చివరి నాటికి తన 'గ్రాండ్ వితారా' (Grand Vitara) ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Recommended Video

Maruti Grand Vitara బుకింగ్స్ | వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త SUV దేశీయ మార్కెట్లో ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, అయినప్పటికి బుకింగ్స్ పరంగా మాత్రం దూసుకుని వెళ్ళిపోతోంది. అయితే కంపెనీ ఇప్పటికి ఈ SUV కోసం ఎన్ని బుకింగ్స్ పొందింది, అందులో ఎక్కువ ఏ వేరియంట్ బుక్ చేసుకున్నారు, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

మారుతి సుజుకి తన గ్రాండ్ వితారా SUV ని దేశీయ మార్కెట్లో జులై 20 న అధికారికంగా ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ SUV కోసం ఆవిష్కరణకు ముందే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. కాగా ఇప్పటికే గ్రాండ్ వితారా బుకింగ్స్ లో ఏకంగా 53,000 యూనిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇది నిజంగానే గొప్ప విషయం.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

కొత్త గ్రాండ్ వితారా పొందిన 53,000 బుకింగ్స్ లో దాదాపు 23,000 యూనిట్లు అందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ పొందాయని తెలుస్తోంది. అంతే కంపెనీ యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ మంచి బుకింగ్ పొందుతోంది అని స్పష్టమవుతోంది. మారుతి గ్రాండ్ వితారా బుక్ చేసుకునే ప్రతి 5 మంది కస్టమర్లతో కనీసం ఇద్దరు ఈ హైబ్రిడ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా దాని S-క్రాస్ స్థానంలో వస్తోంది. ఇది బెంగుళూరు సమీపంలోని బిడాడి ఫ్యాక్టరీలో నిర్మించబడి మారుతి సుజుకి డీలర్‌లకు పంపుతుంది. ఈ కొత్త మారుతి సుజుకి SUV ఆధునిక డిజైన్ మరియు అధునాతన పరికరాలను పొందుతుంది. ఇందులో ఇప్పుడు కొత్త గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ మధ్య భాగంలో పెద్ద సుజుకి బ్యాడ్జ్‌ ఉంది. దీనికి సమీపంలోనే 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి, అదే సమయంలో రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ టర్న్ లైట్లు మరియు 3-ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

గ్రాండ్ వితారా సైడ్ ప్రొఫైల్ లో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు బ్రాండ్ యొక్క లోగో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త ఎస్‌యూవీ మరింత ఆధునికంగా కనిపించేలా చేస్తాయి. మొత్తం మీద గ్రాండ్ వితారా డిజైన్ చాలా గ్రాండ్ గానే ఉందని తెలుస్తోంది.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్, డోర్లు మరియు సీట్లు అన్ని కూడా లెదర్ అపోల్స్ట్రే తో ఉన్నాయి. అంతే కాకుండా కలర్డ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 40 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ మరియు సుజుకి కనెక్ట్ యాప్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లు. ఇందులోని మైల్డ్ హైబ్రిడ్ 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 100 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడుతుంది.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

ఇక స్ట్రాంగ్ హైబ్రిడ్ విషయానికి వస్తే, ఇది 1.5 లీటర్-4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 91 బిహెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 78 బిహెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. గ్రాండ్ విటారా యొక్క అన్ని స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లు స్టాండర్డ్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ఐ జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి గ్రాండ్ వితారా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌తో కూడిన రియర్ డిస్క్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి.

విడుదలకు ముందే గ్రాండ్ బుకింగ్స్ పొందిన 'మారుతి గ్రాండ్ వితారా'.. వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా ఇంకా విడుదల కాలేదు, కావున ధర కూడా ఇంకా విడుదల చేయలేదు. అయినప్పటికీ బుకింగ్స్ మాత్రం భారీగా వచ్చేస్తున్నాయి. ఇది నిజంగానే కస్టమర్లకు బ్రాండ్ పైన ఉన్న నమ్మకమే అని చెప్పాలి. రానున్న రోజుల్లో కంపెనీ ఈ SUV యొక్క ధరలను అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడిస్తుంది. మారుతి గ్రాండ్ వితారా గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 14, 2022, 14:02 [IST]
English summary
Maruti grand vitara received 53000 bookings before its launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+