కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) తమ సరికొత్త 2022 మోడల్ ఆల్టో కె10 (Alto K10) కారును మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ పెద్ద ఆల్టో కోసం బుకింగ్‌ లను ప్రారంభించిన మారుతి సుజుకి, తాజాగా ఈ కారుకి సంబంధించిన ఓ కొత్త టీజర్ ను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా, మారుతి సుజుకి తమ కొత్త ఆల్టో కె10 ఇప్పటికే డీలర్ స్టాక్ యార్డులలో స్టాక్ చేయడం కూడా ప్రారంభించింది. ఇలా ఓ డీలర్ స్టాక్ యార్డుకు చేరుకున్న కొత్త 2022 ఆల్టో కె10 విడుదలకు ముందే కెమెరాకు చిక్కింది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌కి సంబంధించిన కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో, ఈ కారులో అందించిన అధునాతన ఫీచర్ల గురించి మారుతి సుజుకి వెల్లడి చేసింది. ఈ వీడియో ప్రకారం, కొత్త ఆల్టో కారులో ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ స్విచ్‌లు మరియు కీలెస్ ఎంట్రీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

ఇదివరకు మారుతి సుజుకి విడుదల చేసిన మరొక 15-సెకన్ల టీజర్ వీడియోలో కంపెనీ కొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ యొక్క బాహ్య రూపాన్ని స్పష్టంగా వెల్లడించింది. ప్రస్తుత ఆల్టో 800 మరియు పాత తరం ఆల్టో కె10 మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 ఆల్టో కె10 పూర్తిగా భిన్నమైన డిజైన్ ను కలిగి ఉంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ ను బట్టి చూస్తే, ఆల్టో కె10 భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్ ఉంది. ఈ గ్రిల్ కి ఎగువన ఇరువైపులా అన్ని లైట్లతో కూడిన పెద్ద హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

ఫ్రంట్ గ్రిల్ కి దిగువ భాగంలో సన్నగా ఉండే ఎయిర్ డ్యామ్ కూడా కనిపిస్తుంది. గ్రిల్ పైన మరియు బానెట్ కి దిగువన మధ్య భాగంలో సుజుకి లోగో ప్రధానంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బానెట్ పై కూడా V-ఆకారంలో ఉండే క్రీజ్ లైన్ ఉంది, ఈ కొత్త లైన్ మరియు క్రీజ్ కారణంగా ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన ఈ ఆల్టో కె10 లో-ఎండ్ వేరియంట్‌గా తెలుస్తోంది. ఇందులో వీల్ క్యాప్స్ లేని స్టీల్ వీల్స్, బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు బ్లాక్ కలర్ మ్యాన్యువల్ సైడ్ మిర్రర్స్ వంటి అంశాలను గమనించవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

మారుతి సుజుకి తమ కొత్త 2022 ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు ఈ కొత్త ఆల్టో కె10 కారును రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత మారుతి సుజుకి అరెనా డీలర్‌షిప్ కేంద్రాలను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. రాబోయే పండుగ సీజన్‌ మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి ఈ కొత్త ఆల్టో కె10 కారును చక్కగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

మారుతి సుజుకి తమ పెద్ద ఆల్టో కె10 కారుని మార్కెట్లో విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతం విక్రయిస్తున్న ఆల్టో 800 అమ్మకాలను అలానే కొనసాగించే అవకాశం ఉంది. ఓ నివేదిక ప్రకారం, మారుతి సుజుకి తమ కొత్త తరం ఆల్టో కె10 కారుని మొత్తం నాలుగు ట్రిమ్ లలో తీసుకురానుంది. ఇది పాత మోడల్ ఆల్టో కె10 కంటే 85 మిమీ ఎక్కువ పొడవును మరియు 20 మిమీ ఎక్కువ వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. పెరిగిన పరిమాణం కారణంగా ఈ కారులో మరింత ఎక్కువ స్పేస్ లభిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 ఆల్టో కె10 ఇప్పుడు మరింత శుద్ధమైన 1.0 లీటర్ కె10సి ఇంజన్‌తో రానుంది. కొత్త సెలెరియో మరియు వ్యాగన్ఆర్ వంటి ఇతర మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌లలో ఉపయోగిస్తున్న అదే 1.0-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఈ కొత్త ఆల్టో కె10లో ఉపయోగించే అవకాశం ఉంది. ఈ కె K10C సిరీస్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

ఇక గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు కొత్త 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. లేటెస్ట్ టీజర్‌లో కంపెనీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే, బేస్ ట్రిమ్ స్థాయిలలో కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభించే అవకాశం ఉంది. మిడ్ వేరియంట్లకు ఎగువన కొత్త ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్ ను అందించే అవకాశం ఉంది.

గతంలో ఆల్టో కె10 విషయంలో లీకైన సమాచారం ప్రకారం, ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 11 వేరియంట్‌లలో విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో 6 వేరియంట్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటాయి మరియు మిగిలిన వేరియంట్‌లు 5-స్పీడ్ AMT యూనిట్ (ఆటో గేర్ షిఫ్ట్ - AGS) ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో రెనో క్విడ్ కి ప్రత్యక్ష పోటీదారుగా నిలుస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

మారుతి సుజుకి తమ కొత్త 2022 ఆల్టో కె10 గురించి మరిన్ని వివరాలను వెల్లడించనప్పటికీ, ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఈ కారుకి సంబంధించిన చాలా వివరాలు వెల్లడయ్యాయి. కొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు మరియు 1,520 మిమీ ఎత్తును కలిగి ఉంటుందని ఈ లీకైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా, రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ యొక్క వీల్‌బేస్ 2,380 మిమీగా ఉంటుందని కూడా వెల్లడైంది. మారుతి సుజుకి యొక్క కొత్త మాడ్యులర్ హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫారమ్ కారణంగా ఈ పెద్ద కొలతలు సాధ్యమయ్యాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఇదిగో పూర్తిగా చూసేయండి..!

ఆల్టో కె10 టాప్-ఎండ్ వేరియంట్లలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లతో పాటుగా ఫ్రంట్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), స్పీడ్-అలర్ట్ బజర్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌లు కూడా ఉండొచ్చని సమాచారం.

చిత్ర మూలం

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2022, 10:33 [IST]
English summary
Maruti suzuki alto k10 arrives at dealrship new details revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+