మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

మారుతి సుజుకి నుండి రాబోయే కొత్త తరం ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్ లను ప్రారంభించింది. కస్టమర్లు మారుతి సుజుకి యొక్క అరెనా (Arena) డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లో రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కొత్త ఆల్టో కారును బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ లను ప్రారంభించడంతో దీనితో పాటు, మారుతి సుజుకి ఆల్టో కె10 యొక్క కొత్త టీజర్ కూడా విడుదల చేయబడింది. ఈ టీజర్ లో కంపెనీ ఆల్టో కె10 ముందు భాగాన్ని పూర్తిగా వెల్లడించింది.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో, మారుతి సుజుకి తన అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఇప్పటికే అనేక రిఫ్రెష్డ్ మోడళ్లను విడుదల చేయగా, ఇటీవలే పూర్తిగా కొత్త మోడల్ అయిన గ్రాండ్ విటారా హైబ్రిడ్ కారును విడుదల చేసింది. ఇప్పుడు కొత్తగా ఆల్టో కె10 మోడల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ఆల్టో 800 మరియు పాత తరం ఆల్టో కె10 మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 ఆల్టో కె10 పూర్తిగా భిన్నమైన డిజైన్ ను కలిగి ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

కంపెనీ విడుదల చేసిన టీజర్ ను బట్టి చూస్తే, ఆల్టో కె10 భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్ ఉంది. ఈ గ్రిల్ కి ఎగువన ఇరువైపులా అన్ని లైట్లతో కూడిన పెద్ద హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంటుంది. అలాగే, ఈ గ్రిల్ కి దిగువ భాగంలో సన్నగా ఉండే ఎయిర్ డ్యామ్ కూడా కనిపిస్తుంది. గ్రిల్ పైన మరియు బానెట్ కి దిగువన మధ్య భాగంలో సుజుకి లోగో ప్రధానంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బానెట్ పై కూడా V-ఆకారంలో ఉండే క్రీజ్ లైన్ ఉంది, ఈ కొత్త లైన్ మరియు క్రీజ్ కారణంగా ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

ఈ టీజర్ లో వీల్స్ కూడా చూపించబడ్డాయి, ఇవి స్టాండర్డ్ స్టీల్ వీల్స్ మాదిరిగా ఉన్నాయి మరియు వాటిపై సుజుకి వీల్ క్యాప్స్ అమర్చబడి ఉన్నాయి. మారుతి సుజుకి విడుదల చేసిన బుకింగ్స్ టీజర్ లో కొత్త ఆల్టో కె10 కారుని కంపెనీ రెడ్ కలర్ లో పరిచయం చేసింది. మరిన్ని వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

మారుతి సుజుకి ఆల్టో విషయానికి వస్తే, ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఆల్టో కూడా ఒకటి. కంపెనీ ఈ కారును 22 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 43 లక్షలకు పైగా ఆల్టో కార్లు విక్రయించబడ్డాయి. కంపెనీ ఇప్పటి వరకూ ఇందులో రెండు తరాలను మాత్రమే ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇందులో కొత్తగా రాబోతోంది మూడవ తరం మోడల్. ఈ సరికొత్త మూడవ తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 కారును కంపెనీ ఆగస్టు 18న భారత మార్కెట్‌లో విడుదల చేయవచ్చని సమాచారం.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

ఈ కొత్త తరం ఆల్టో కె10 కారు ఎక్స్టీరియర్‌ లోనే కాకుండా ఇంటీరియర్ లో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. కంపెనీ ఇందులో అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను కూడా జోడించనుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త తరం ఆల్టో కె10 మెరుగైన స్టీరింగ్ వీల్, కొత్త డ్యాష్‌బోర్డ్ మరియు చిన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

ఓ నివేదిక ప్రకారం, మారుతి సుజుకి తమ కొత్త తరం ఆల్టో కె10 కారుని మొత్తం నాలుగు ట్రిమ్ లలో తీసుకురానుంది. ఇది పాత మోడల్ ఆల్టో కె10 కంటే 85 మిమీ ఎక్కువ పొడవును మరియు 20 మిమీ ఎక్కువ వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. పెరిగిన పరిమాణం కారణంగా ఈ కారులో మరింత ఎక్కువ స్పేస్ లభిస్తుంది. అంతేకాకుండా, కొత్త 2022 ఆల్టో కె10 ఇప్పుడు మరింత శుద్ధమైన 1.0 లీటర్ కె10సి ఇంజన్‌తో రానుంది. ఈ కొత్త ఇంజన్ ప్రస్తుత ఆల్టోలో ఉపయోగిస్తున్న 0.8 లీటర్ F8D ఇంజన్‌ను భర్తీ చేస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

గతంలో లీకైన సమాచారం ప్రకారం, కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ లో గతేడాది మార్కెట్లో విడుదలైన కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో మరియు ప్రస్తుత వ్యాగన్ఆర్ మోడళ్లలో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ డ్యూయల్ జెట్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించవచ్చు. ఈ కె K10C సిరీస్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 (Alto K10) బుకింగ్స్ ప్రారంభం.. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి..!

ఈ కారులోని ఇతర ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లతో పాటుగా ఫ్రంట్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), స్పీడ్-అలర్ట్ బజర్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌లు కూడా ఉండనున్నాయి.

Most Read Articles

English summary
Maruti suzuki alto k10 bookings open front design revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X