సిఎన్‌జి వెర్షన్‌లో విడుదలైన 'మారుతి ఆల్టో కె10': ఇప్పుడు మరింత ఎక్కువ మైలేజ్ పక్కా..

భారతీయ మార్కెట్లో సిఎన్‌జి వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇప్పుడు తన 'ఆల్టో కె10 సిఎన్‌జి' (Alto K10 CNG) విడుదల చేసింది.

పెట్రోల్ మరియు డీజిల్ వాహన విభాగంలో మాత్రమే కాకుండా సిఎన్‌జి వాహన విభాగంలో తన ఉనికిని మరింత చాటుకోవడానికి కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉత్పత్తులను సిఎన్‌జి విభాగంలో విడుదల చేస్తోంది. ఆల్టో కె10 సిఎన్‌జి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సిఎన్‌జి వెర్షన్‌లో విడుదలైన మారుతి ఆల్టో కె10

దేశీయ మార్కెట్లో ఈ మధ్య కాలంలోనే విడుదలైన కొత్త 'మారుతి ఆల్టో కె10' ఇపుడు సిఎన్‌జి వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. కొత్త మారుతి ఆల్టో కె10 సిఎన్‌జి ధర రూ. 5.95 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ప్రస్తుతం VXi వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అదే సమయంలో ఈ సిఎన్‌జి వెర్షన్ ధర దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి డిజైన్:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి చూడటానికి దాని పెట్రోల్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. అయితే వెనుక భాగంలో S-CNG బ్యాడ్జ్‌ చూడవచ్చు. ఇది కె10 సిఎన్‌జి అని స్పష్టంగా చెబుతుంది. ఇందులో 55 లీటర్ల CNG ట్యాంక్‌ ఉంటుంది. కావున బూట్ స్పేస్ దాని పెట్రోల్ వేరియంట్ కంటే తక్కువగా ఉంటుంది.

సిఎన్‌జి వెర్షన్‌లో విడుదలైన మారుతి ఆల్టో కె10

మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి ఫీచర్స్:

మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి యొక్క ఫీచర్స్ కూడా దాని పెట్రోల్ వేరియంట్ లో మాదిరిగానే ఉంటాయి. కావున ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే టెక్నాలజీ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా పవర్-అడ్జస్టబుల్ ORVMలు, డిజిటల్ స్పీడోమీటర్, రిమోట్ కీలెస్ ఎంట్రీ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి పవర్‌ట్రెయిన్:

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి 1.0-లీటర్ K10C ఇంజన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. పెట్రోల్ మోడ్ లో ఇది 65 హెచ్‌పి మరియు 89 ఎన్ఎమ్ టార్క్‌ విడుదల చేస్తుంది, కాగా ఇది సిఎన్‌జి మోడ్ లో 57 హెచ్‌పి మరియు 82 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది ఒక కేజీ సిఎన్‌జితో గరిష్టంగా 33.85 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

సిఎన్‌జి వెర్షన్‌లో విడుదలైన మారుతి ఆల్టో కె10

మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి అనేది ప్రస్తుతం బ్రాండ్ యొక్క 13వ సిఎన్‌జి మోడల్‌. అంతే కాకూండా కంపెనీ ఇప్పటికే 1 మిలియన్ కంటే ఎక్కువ CNG వాహనాలను మార్కెట్లో విజవంతంగా విక్రయించగలిగింది. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు సిఎన్‌జి వాహనాలను విడుదల చేయడంలో నిబద్ధతను చూపుతోంది. కాగా ఆల్టో కె10 సిఎన్‌జి దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి సిఎన్‌జి వాహన విభాగంలో తిరుగులేని పురోగతిని పొందుతూ.. ఎప్పటికప్పుడు తమ వాహనాలను ఈ విభాగంలో భర్తీ చేస్తూనే ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ ఈ విభాగంలో మరిన్ని కొత్త వాహనాలను చేర్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti suzuki alto k10 cng launched at rs 5 94 features mileage details
Story first published: Saturday, November 19, 2022, 9:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X