India
YouTube

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

మీకు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) గుర్తుందా..? కొత్త తరం ఆల్టో కారు రాక మునుపు ఈ ఆల్టో కె10 కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉండేది. నిజానికి, ఇది ప్రస్తుత ఆల్టో కన్నా పెద్దది. అయితే, కొత్త తరం ఆల్టో వచ్చిన తర్వాత ఆల్టో కె10 మోడల్ కేవలం సెకండ్ హ్యాండ్ మార్కెట్ కు మాత్రమే పరిమితమైంది. కాగా, మారుతి సుజుకి ఇప్పుడు కొత్త తరం ఆల్టో కె10 కారుని భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త ఆల్టో కె10 ప్రస్తుత ఆల్టో 800తో పాటు విక్రయించబడుతుంది.

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీ విడుదల తర్వాత మారుతి సుజుకి నుండి రాబోయే అతిపెద్ద లాంచ్ కూడా ఇదే కావచ్చని భావిస్తున్నారు. తాజాగా, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కారుకి సంబంధించిన కొన్ని చిత్రాలు మరియు స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ హ్యాచ్‌బ్యాక్ తుది ఉత్పత్తి రూపానికి చేరుకుందని తెలుస్తుంది. దానికి తోడు, రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ యొక్క TVC (టెలివిజన్ కమర్షియల్) షూట్‌గా కనిపించే ఫొటోలు కూడా లీక్ అయ్యాయి.

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 యొక్క ఈ చిత్రాలను చూస్తుంటే, హ్యాచ్‌బ్యాక్ ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి సెలెరియోను తలపించే డిజైన్ థీమ్‌ను కలిగి ఉందని స్పష్టమవుతోంది. కొత్త ఎక్స్టీరియర్ డిజైన్‌తో పాటు, రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 యొక్క ఫీచర్లను కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడే అవకాశం ఉంది. అంటే రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

మారుతి సుజుకి తమ కార్లలో భద్రతా ప్రమాణాలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో, కొత్తగా రాబోయే ఆల్టో కె10 కారులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కోసం), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), స్పీడ్-అలర్ట్ బజర్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్‌లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా, మారుతి సుజుకి ఆల్టో కె10లోని భద్రతా లక్షణాలు నేటి ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచబడతాయని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ చిన్న కారులోని ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్య అక్టోబర్ 1, 2022 నుండి ఆరుకి పెంచుతారా లేదా అనేది చూడాలి.

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

ఇక పవర్‌ట్రైన్ (ఇంజన్) విషయానికి వస్తే, రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ లో గతేడాది మార్కెట్లో విడుదలైన కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో మరియు ప్రస్తుత వ్యాగన్ఆర్ మోడళ్లలో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ డ్యూయల్ జెట్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ కె K10C సిరీస్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

కొత్త ఆల్టో కె10 కారును కంపెనీ రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందించే అవకాశం ఉంది. ఇందులో మొదటిది రెగ్యులర్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు రెండవది AGS (ఆటో గేర్ షిఫ్ట్) గా పిలువబడే మారుతి సుజుకి యొక్క 5-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) యూనిట్. తాజాగా, లీక్ అయిన NCT రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు కూడా రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌లో పైన పేర్కొన్న ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికకు అనుగుణంగా ఉంటాయని తెలియజేస్తోంది.

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

ఈ లీకైన పత్రాలు రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 11 వేరియంట్‌ లలో లభ్యమవుతాయని కూడా వెల్లడిస్తున్నాయి. ఈ 11 వేరియంట్‌లలో, ఈ వేరియంట్‌లలో 6 వేరియంట్‌ లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ తో అమర్చబడి ఉంటాయి మరియు మిగిలిన 4 వేరియంట్‌ లు AMT యూనిట్‌ తో అమర్చబడి ఉంటాయి. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 సిఎన్‌జి వేరియంట్ల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, ప్రస్తుతం భారత మార్కెట్లో సిఎన్‌జి కార్లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో కొన్ని సిఎన్‌జి వేరియంట్లను కూడా తదుపరి దశలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

పెద్ద మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Alto K10) తిరిగొస్తోంది.. ఆన్‌లైన్‌లో స్పెసిఫికేషన్లు లీక్..!

ఈ సమాచారంతో పాటుగా లీకైన NCT రిజిస్ట్రేషన్ పత్రాలు రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ యొక్క కొలతలు కూడా వెల్లడించాయి. ఈ రిపోర్ట్ ప్రకారం, రాబోయే మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు మరియు 1,520 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. అలాగే, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 యొక్క వీల్‌బేస్ 2,380 మిమీగా ఉంటుంది. ఈ కొలతలను బట్టి చూస్తుంటే, కొత్త తరం ఆల్టో కె10 ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న ఆల్టో 800 కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

ఫొటో మూలం

Most Read Articles

English summary
Maruti suzuki alto k10 to be re launched in india soon specs leaked online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X