'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ రోజు 'మారుతి సుజుకి బాలెనొ' యొక్క CNG వెర్షన్ విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త బాలెనొ CNG ప్రారంభ ధర రూ. 8.28 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 9.21 లక్షల వరకు ఉన్నాయి. మారుతి బాలెనొ CNG డెల్టా మరియు జీటా అనే రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

మారుతి సుజుకి బాలెనొ CNG పెట్రోల్ వేరియంట్ ధరలు రూ 7.33 లక్షలు (డెల్టా) మరియు రూ. 8.26 లక్షలు (జీటా). దీన్ని బట్టి చూస్తే సుజుకి బాలెనొ CNG పెట్రోల డెల్టా ధర, దాని 'CNG డెల్టా' వేరియంట్ కంటే రూ. 95,000 మరియు 'పెట్రోల్ జీటా' వేరియంట్ దాని 'జీటా CNG' వేరియంట్ కంటే రూ. 95,000 తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. అంటే పెట్రోల్ వేరియంట్ కంటే బాలెనొ CNG ధరలు రూ. 95,000 ఎక్కువ అని తెలుస్తోంది.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

కొత్త బాలెనో CNG అదే 1.2 లీటర్, ఫోర్ సిలిండర్, కె12ఎన్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఇది CNG స్పెక్‌లో 77.5 హెచ్‌పి పవర్ మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా పెట్రోల్ వెర్షన్ 90 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

కొత్త మారుతి సుజుకి బాలెనొ CNG వేరియంట్ యొక్క బూట్ లో 55 లీటర్ల CNG ట్యాంక్‌ ఉంటుంది. కావున దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా తక్కువ బూట్ స్పేస్ పొందుతుంది. కొత్త బాలెనో CNG వేరియంట్ 30.61 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

మారుతి బాలెనోCNG కిట్‌ను మిడ్-స్పెక్ డెల్టా మరియు జీటా ట్రిమ్‌లలో మాత్రమే అందిస్తోంది. అయితే టయోటా టాప్-స్పెక్ V ట్రిమ్‌తో సహా మూడు ట్రిమ్‌లలో గ్లాంజా CNG ని అందించాలని భావిస్తున్నారు. కావున టాప్-ఎండ్ బాలెనో CNG కంటే టొయోట గ్లాంజా CNG లో ఎక్కువ ఫీచర్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో గ్లాంజా CNG కూడా విడుదలవుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

మారుతి బాలెనో CNG డిజైన్ దాదాపు దాని మునుపటి వేరియంట్ ని పోలి ఉంటుంది. బాలెనొ CNG జీటా ట్రిమ్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 ఇంచెస్ అల్లాయ్‌ వీల్స్, స్మార్ట్‌ప్లే ప్రో+ సిస్టమ్‌తో కూడిన 7.0 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్, కనెక్టెడ్ కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, మారుతి బాలెనొ CNG ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రియర్ వ్యూ కెమెరా మొదలైన వాటిని పొందుతుంది, కావున ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను మరింత పరిరక్షిస్తుంది. కాగా ఈ CNG మోడల్ దేశీయ మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

'మారుతి సుజుకి బాలెనొ' కూడా ఇప్పుడు CNG వెర్షన్‌లో.. మెరుగైన మైలేజ్ & ఆకర్షణీయమైన ధర

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి ఇటీవలే తన ఎస్-ప్రెస్సో CNG ని లాంచ్ చేసింది, కాగా ఇప్పుడు మారుతి బాలెనో యొక్క CNG వెర్షన్ ని కూడా లాంచ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ దేశీయ మార్కెట్లో CNG వేరియంట్స్ లాంచ్ చేసి మరింత ప్రజాదరణ పొందటానికి సన్నాహాలు చేస్తోంది. అంతే కాకుండా.. కొనుగోలుదారులు కూడా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా CNG వాహనాలను కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కంపెనీ CNG వేరియంట్స్ విరివిగా లాంచ్ చేస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 1, 2022, 7:00 [IST]
English summary
Maruti suzuki baleno cng launched price design mileage and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+