2022 Maruti Baleno మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం.. కొత్త యాక్ససరీస్
భారతీయ మార్కెట్లో ఇటీవల మారుతి సుజుకి (Maruti Suzuki) తన 2022 మారుతి బాలెనో (2022 Maruti Baleno) ను రూ. 6.35 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధర వద్ద విడుదల్ చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త కారు యొక్క డిజైన్ పెంచడానికి యాక్ససరీస్ కూడా విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కానీ ప్రస్తుతం విడుదలైన ఈ యాక్ససరీస్ ప్యాక్ అనేది కేవలం జీటా మరియు డెల్టా వేరియంట్‌ల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. కంపెనీ విడుదల చేసిన ఈ యాక్ససరీస్ ప్యాక్ లో ఉన్న యాక్ససరీస్ గురించి తెలుసుకుందాం.

ఎక్స్టీరియర్ యాక్ససరీస్:
కొత్త మారుతి సుజుకి బాలెనొ చూడటానికి చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే దీనిని మరింత రెట్టింపు చేయడానికి కంపెనీ ఇప్పుడు ఎక్స్టీరియర్ యాక్ససరీస్ కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానమైనవి క్రోమ్ గార్నిష్‌లు. ఇది ఫ్రంట్ బంపర్ మరియు గ్రిల్ ఎగువ అంచులో జోడించబడుతుంది.

బాలెనో రెండు బాడీ సైడ్ మౌల్డింగ్‌ల ఎంపికను పొందుతుంది, ఇందులో క్రోమ్ బ్లాక్ ఇన్‌సర్ట్‌లు మరియు బ్లాక్ విత్ క్రోమ్ ఇన్‌సర్ట్‌లు ఉన్నాయి. డోర్ విజర్‌లను కూడా క్రోమ్‌తో అలంకరించవచ్చు. కారు వెనుక భాగానికి మెరుగైన రూపాన్ని అందించడానికి కూడా యాక్ససరీస్ ఉన్నాయి. ఇందులో రియర్ బంపర్‌తో పాటు క్రోమ్ గార్నిష్, రియర్ స్కిడ్‌ప్లేట్‌కు సిల్వర్ గార్నిష్ మరియు బూట్ లిడ్ దిగువ అంచున క్రోమ్ స్ట్రిప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కారుని మరింత అద్భుతంగా చూపిస్తాయి.

ఇంటీరియర్ యాక్ససరీస్:
మారుతి బాలెనొ కోసం కంపెనీ ఎక్స్టీరియర్ యాక్ససరీస్ మాత్రమే కాకుండా.. ఇంటీరియర్ యాక్ససరీస్ కూడా అందిస్తుంది. ఇందులో డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌తో పాటు, వివిధ రకాల సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్‌లు, అల్యూమినైజ్డ్ సిల్ గార్డ్ డిజైన్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్ కిట్‌ల కోసం ప్రత్యేక ఆప్సన్స్ కూడా అందించింది.

బాలెనో సిల్ గార్డ్‌లపై అల్యూమినైజ్డ్ 'నెక్సా' బ్రాండింగ్‌తో పాటు ఆల్-వెదర్ గ్రూవ్స్ మ్యాట్‌ను పొందుతుంది. సెంటర్ కన్సోల్ కోసం స్టైలింగ్ కిట్‌లు ఇవ్వబడ్డాయి, లోపలి భాగాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి వెంట్స్, డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ఆర్మ్‌రెస్ట్‌లు ఉన్నాయి. వీటితో పాటు స్పెషల్ బాడీ కవర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, ఆల్-వెదర్ 3డి మ్యాట్ వంటి వాటిని అందిస్తుంది. ఇవన్నీ కూడా కారు యొక్క రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఇవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేయవచ్చు.

కొత్త మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అధునాతన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉన్నాయి. 2022 మారుతి బాలెనో సిగ్మా, డెల్టా, డెల్టా (AMT), జీటా, జీటా (AMT), ఆల్ఫా, మరియు ఆల్ఫా (AMT) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కొత్త మారుతి సుజుకి బాలెనో సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన కూడా అందుబాటులో ఉంది, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు కేవలం నెలకు రూ. 13,999 నుండి ప్రారంభమవుతాయి. కావున కొనుగోలుదారులు దీనిని సులభంగా కొనుగోలుచేయవచ్చు.

2022 బాలెనొ నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే, లుక్స్ బీజ్ (Luxe Beige), ఓపులంట్ రెడ్ మరియు పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

మారుతి బాలెనో ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మరో వైపు ఇందులో 90 బిహెచ్‌పి పవర్ అందించే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మాన్యువల్‌తో 22.35 కిమీ మరియు ఆటోమాటిక్ తో 22.94 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ బరువు ఇప్పుడు 70 కిలోలు పెరిగింది, కావున బాలెనొ బరువు ఇప్పుడు 1,410 కేజీల వరకు ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








