మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. బుకింగ్స్ మరియు లాంచ్ తేదీ వివరాలు!
దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, తమ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో' (Maruti Suzuki Baleno) లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, కంపెనీ ఇప్పటికే తమ కొత్త 2022 మోడల్ బాలెనో ఉత్పత్తిని కూడా ప్రారంభించింది మరియు కంపెనీ దీనిని ఫిబ్రవరి 10, 2022 న భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనో కోసం ఫిబ్రవరి 1, 2022వ తేదీ నుండి బుకింగ్స్ కూడా ప్రారంభం కావచ్చని సమాచారం. ప్రస్తుత, బాలెనోతో పోల్చుకుంటే, కంపెనీ ఈ కొత్త మోడల్ లో అనేక మార్పులు చేర్పులు చేయనుంది. కంపెనీ మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ తమ డీలర్‌షిప్ లకు పంపిణీ చేయనుంది మరియు ఆ వెంటనే కొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ టెస్ట్ డ్రైవ్ లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

ఏదేమైనప్పటికీ, కంపెనీ ఇంకా ఈ కారు యొక్క అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఇక కొత్త 2022 మోడల్ బాలెనో ఫేస్‌లిఫ్ట్ విషయానికి వస్తే, కంపెనీ దాని ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ చేయనుంది. మెరుగైన నాణ్యత మరియు భద్రత కోసం ఈ కారును మారుతి సుజుకి యొక్క సిగ్నేచర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ యొక్క సవరించిన వెర్షన్‌పై నిర్మించబడనుంది.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో మరింత ధృడమైన మరియు మెరుగైన స్టీల్ తో తయారు చేసిన కొత్త బాడీ ప్యానెల్‌లు అమర్చనున్నారు. ముందు భాగంలో పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు డిజైన్ తో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. మెష్ గ్రిల్, హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లలో కూడా డిజైన్ మార్పులను ఆశించవచ్చు. పెద్ద బంపర్ మరియు అందులో విశాలమైన ఎయిర్ డ్యామ్ మరియు వృత్తాకార ఫాగ్ లైట్లు వండి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉండనున్నాయి.

కారు యొక్క ఫ్రంట్ బానెట్ కూడా రీడిజైన్ చేయబడినట్లు తెలుస్తోంది మరియు ఇది మునుపటితో పోలిస్తే మరింత ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ఇక వెనుక భాగంలో చేసిన డిజైన్ మార్పుల విషయానికి వస్తే, ఇందులో రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, L-ఆకారపు టైల్‌లైట్ క్లస్టర్ మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మొదలైనవి ఉన్నాయి. అలాగే, వెనుక బంపర్ ను కూడా పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. సైడ్ ప్రొఫైల్ లో కొత్త అల్లాయ్ వీల్స్ తప్ప వేరే ఇతర మార్పులేవీ ఉండకపోవచ్చు.

కంపెనీ ఈ కారును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు పలు ఆకర్షణీయమైన ఫీచర్లు, పరికరాలతో అప్‌డేట్ చేయనుంది. ఇందులో క్యాబిన్‌లో కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్ లేఅవుట్ ను ఆశించవ్చచు. దీనితో పాటుగా ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా సుజుకి స్మార్ట్‌ప్లే స్టూడియో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా, ఇందులో హెడ్స్ అప్ డిస్ప్లే, V- ఆకారపు ఎయిర్-కండిషనింగ్ వెంట్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్ల కూడా ఉండనున్నాయి.

మారుతి సుజుకి యువ కస్టమర్లను ఆకర్షించడానికి ఇందులో కొన్ని ఆధునిక ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. అయితే, ఇంజన్ లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రస్తుతం, మారుతి సుజుకి బాలెనో భారతదేశంలో ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.2 లీటర్ ఇంజన్, ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది.

అయితే, మారుతి సుజుకి తమ కార్లలో కొత్తగా ప్లాన్ చేస్తున్న 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ను ఇందులో పరిచయం చేస్తుందో లేదో వేచి చూడాలి. మారుతి సుజుకి తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి బాలెనోను విడుదల చేసినప్పటి నుండి గత డిసెంబర్ 2021వరకూ ఒక మిలియన్ యూనిట్లకు (10 లక్షలకు పైగా) పైగా విక్రయించింది. నెక్సా షోరూమ్ ల ద్వారా విక్రయించబడుతున్న మారుతి సుజుకి బాలెనో అక్టోబర్ 2015 లో భారత మార్కెట్లో ప్రారంభించబడింది.

బాలెనో భారతదేశంలో అత్యంత వేగంగా 1 మిలియన్ విక్రయాల మార్కును దాటిన మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అని మారుతి సుజుకి పేర్కొంది. నెక్సా డీలర్‌షిప్ లలో బాలెనో మారుతి సుజుకి బ్రాండ్ కి చాలా కీలకమైన ఉత్పత్తిగా ఉంది. ఈ మోడల్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఎప్పటికప్పుడు దీనిని అప్‌డేట్ చేస్తూ వస్తోంది. సేఫ్టీ పరంగా చూస్తే, ఈ చిన్న కారులో కంపెనీ 6 ఎయిర్ బ్యాగ్‌లను కూడా అందించవ్చచని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








