2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) త్వరలోనే అప్డేటెడ్ 2022 మారుతి బాలెనో (2022 Maruti Baleno) ను విడుదల చేయనుంది. ఇప్పటికే కంపెనీ రెండు టీజర్ వీడియోల ద్వారా కొంత సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో భాగంగా మరి టీజర్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త టీజర్ వీడియోలో బాలెనో ఫేస్‌లిఫ్ట్ యొక్క 360-డిగ్రీ కెమెరా చూడవచ్చు. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. 9-ఇంచెస్ పెద్ద డిస్‌ప్లే మొదటిసారిగా డిసెంబర్ 2021 లో యూరప్‌లోని కొత్త మారుతి S-క్రాస్‌లో కనిపించింది. అయితే ఇప్పుడు త్వరలో రానున్న కొత్త ప్రీమియం మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ లోని ప్రస్తుత 7-ఇంచెస్ యూనిట్ స్థానంలో ఇదే విధమైన 9-ఇంచెస్ పెద్ద డిస్‌ప్లే రానుంది.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

ఈ కొత్త డిస్ప్లే యావరేజ్ స్పీడ్, డ్రైవింగ్ టైమ్ మరియు యావరేజ్ ఫ్యూయెల్ వినియోగం వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా టచ్-ఎనేబుల్ చేయబడిన వాల్యూమ్ అప్/డౌన్, హోమ్, మ్యూజిక్ ప్లే, కాల్ రిసీవ్/ఎండ్ మరియు వాయిస్ కమాండ్ బటన్‌లను చూడవచ్చు.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

ఇన్ఫోటైన్‌మెంట్ రిమోట్ ఫంక్షన్ మరియు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌కి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. డ్రైవింగ్ సమయంలో వినియోగదారునికి కావాల్సిన సమాచారం అందిస్తుంది.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ట్వీక్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి. కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభంమయ్యే అవకాశం ఉంటుంది.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

2022 మారుతి బాలెనోలో మెరుగైన స్టీల్‌తో తయారు చేయబడిన కొత్త బాడీ ప్యానెల్‌లు ఇన్‌స్టాల్ చేయబడింది. ఇప్పుడు ఈ మోడల్ యొక్క ముందు భాగం చాలా వరకు కొత్తగా ఉంటుంది. ఇందులో మెష్ గ్రిల్ తో పాటి హెడ్‌లైట్స్ మరియు వెనుక భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి వాటిని పొందుతుంది. వీటితో పాటు ఇది పెద్ద బంపర్, విశాలమైన ఎయిర్ డ్యామ్ మరియు రౌండ్ ఫాగ్ లైట్లను పొందుతుంది.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

మారుతి బాలెనో యొక్క బానెట్ కూడా రీడిజైన్ చేయబడింది. ఇది మునుపటితో పోలిస్తే చాలా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. వెనుక భాగంలో రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, L-ఆకారపు టైల్‌లైట్ క్లస్టర్ మరియు ఎల్ఈడీ ఇంటర్నల్‌లు మరియు కొత్త బంపర్ ఇవ్వబడ్డాయి. సైడ్ ఫ్రొఫైల్ లో కొత్త అల్లాయ్ వీల్స్ కనిపించినప్పటికీ, డిజైన్ అలాగే ఉంచబడింది. మొత్తం మీద బాలెనొ చాలా వరకు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి, చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

మార్కెట్లో ఇప్పటికే ఉన్న బ్రెజ్జా మరియు ఎర్టిగా వంటివి మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. కావున ఈ కొత్త 2022 బాలెనొ కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది బహుశా 4 స్టార్ రేటింగ్ లేదా 5 స్టార్ రేటింగ్ పొందే విధంగా తయారుచేయబడే అవకాశం ఉంటుంది. కొత్త 2022 బాలెనొ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబిడి, ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్ మరియు కెమెరా, హై స్పీడ్ వార్నింగ్ వంటి వాటిని పొందుతుంది.

మారుతి బాలెనో భారతదేశంలో ఒకే ఇంజన్ ఆప్సన్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ బాలెనో యొక్క ఇంజిన్‌ను మార్చలేదు. కావున మొదటిది 1.2-లీటర్ ఇంజన్, ఇది 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఆడిస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు CVT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో కంపెనీ కొత్త గేర్‌బాక్స్ ఆప్షన్‌ని తీసుకువస్తుందా లేదా అనేది చూడాలి.

2022 Maruti Baleno ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చూపించే కొత్త టీజర్.. చూసారా..!!

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ ఐ20 మరియు టాటా ఆల్ట్రోజ్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి అమ్మకాలను పొందుతుంది మరియు ఎలాంటి ప్రజాదరణ పొందుతుంది అనే విషయం త్వరలోనే వెల్లడవవుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 15, 2022, 19:18 [IST]
English summary
Maruti suzuki baleno facelift to get 360 degree camera details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+