2022 Maruti Baleno లో తప్పకుండా తెలుసుకోవలసిన అంశాలు, ఇవే
2022 మారుతి సుజుకి బాలెనొ (2022 Maruti Suzuki Baleno) ఇటీవల రూ. 6.35 లక్షల ప్రారంభ ధర వద్ద భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త కారు దాని పాత కారుకంటే కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కారుని కొనుగోలుదారులు రూ. 13,999 నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ కొత్త బాలెనొ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలను గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

కలర్ హెడ్స్-అప్ డిస్‌ప్లే:
ఇటీవల విడుదలైన కొత్త సుజుకి బాలెనొ దాని సెగ్మెంట్‌లోనే కలర్‌ఫుల్ హెడ్స్-అప్ డిస్‌ప్లేను కలిగి ఉన్న మొదటి కారు. ఇది కారుకి మరింత ఆకర్షణను జోడిస్తుంది. హెడ్‌సప్ డిస్‌ప్లే అనేది ప్రీమియం కార్లలో కనిపించే ఒక ఫీచర్. ఇది కారు విండ్‌స్క్రీన్‌పై నిర్మించిన ప్యానెల్‌పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్, మైలేజ్ వంటి మరింత సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

360-డిగ్రీ కెమెరా:
ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న చాలా ఆధునిక కార్లలో 360 డిగ్రీ కెమెరా అనేది సర్వసాధారణమైన ఫీచర్. అయితే ఈ ఫీచర్ మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ కెమెరా అప్రోచింగ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది. ఇది ఏదైనా కదిలే వస్తువును గుర్తించగలదు మరియు దాని సమాచారాన్ని డిస్ప్లేలో ప్రదర్శించగలదు. అంతే కాకుండా మీరు కారును ఇరుకైన ప్రదేశంలో పార్క్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కావున ఇది కూడా ఈ కారులో అందుబాటులో ఉన్న అద్భుతమైన ఫీచర్.

కొత్త స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్:
2022 మారుతి సుజుకి ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కొత్త స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్‌లతో కూడిన ఫ్రీ స్టాండింగ్ 9-ఇంచెస్ డిస్‌ప్లే స్క్రీన్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. అంతే కాకుండా కంపెనీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆధునిక వాయిస్ అసిస్టెంట్‌ను కూడా అందించింది, ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కొత్త తరం సుజుకి కనెక్ట్:
2022 మారుతి బాలెనొ కొత్త తరం సుజుకి కనెక్ట్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో 40 ఫీచర్లు ఉన్నాయి. ఈ సిస్టమ్ సుజుకి కనెక్ట్ యాప్ ద్వారా వెహికల్ సేఫ్టీ, ట్రిప్, డ్రైవింగ్ ప్యాటర్న్, స్టేటస్ అలర్ట్ మరియు రిమోట్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండే ఫీచర్.
సుజుకి కనెక్ట్ ఫీచర్ సిస్టమ్‌ను స్మార్ట్‌వాచ్‌కి కూడా కనెక్ట్ చేయవచ్చు. కారు యజమానులు కారు నుండి దూరంగా ఉన్నప్పుడు కూడా కారు డోర్స్, హెడ్‌లైట్లు, డేంజర్ లైట్లు మరియు అలారంల లాకింగ్ సిస్టమ్ వంటివాటిని కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుంది.

కొత్త డిజైన్
కొత్త బాలెనొ మంచి డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలో ఫ్రంట్ గ్రిల్ పెద్దదిగా ఉంటుంది, దాని హెడ్‌లైట్లు మునుపటి కంటే పల్చగా ఉంటాయి, కావున ఇది బోల్డ్ లుక్‌ని ఇస్తుంది. దీని బంపర్‌కు కొత్త డిజైన్ కూడా ఇవ్వబడింది. కొత్త స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు వెనుక వైపున ఇవ్వబడతాయి. అయితే ఇందులోని కొత్త అల్లాయ్ వీల్స్ దీని డిజైన్ మరింత మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇవి మాత్రమే కాకుండా కొత్త బాలెనొ హెడ్స్ అప్ డిస్ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆర్క్‌మిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వంటివి కూడా కలిగి ఉంటుంది.

2022 మారుతి బాలెనో సిగ్మా, డెల్టా, డెల్టా (AMT), జీటా, జీటా (AMT), ఆల్ఫా, మరియు ఆల్ఫా (AMT) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 2022 బాలెనొ మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే, లుక్స్ బీజ్ (Luxe Beige), ఓపులంట్ రెడ్ మరియు పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్.


Click it and Unblock the Notifications








