రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎర్టిగా (Ertiga) ఎమ్‌పివిలో ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ను రేపు (ఏప్రిల్ 15, 2022)వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. కియా కారెన్స్ ఎమ్‌పివి రాకతో పెరిగిన పోటీని గట్టిగా ఎదుర్కునేందుకు మారుతి సుజుకి కూడా తమ ఎర్టిగా ఎమ్‌పివిని అప్‌డేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ అప్‌డేటెడ్ 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ (2022 Maruti Suzuki Ertiga Facelift) రిఫ్రెష్ట్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

2022 ఎర్టిగా - బుకింగ్స్, అంచనా ధర

మారుతి సుజుకి తమ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి కోసం బుకింగ్ లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి అధీకృత మారుతి సుజుకి డీలర్‌షిప్ నుండి కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు మార్కెట్లో విక్రయించబడిన ఎర్టిగా ఎమ్‌పివి ధరలు రూ. 8.11 లక్షల నుండి రూ. 10.84 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో అందుబాటులో ఉంది. కాగా, కొత్త ఎర్టిగాలో చేసిన అప్‌గ్రేడ్స్ కారణంగా దాని ధర సుమారు రూ. 8.30 లక్షల నుండి రూ. 11.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉండొచ్చని అంచనా.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

2022 ఎర్టిగా - మార్పులు, ఫీచర్లు

కొత్త ఎర్టిగాలో కొన్ని బాహ్య మార్పులు, ఇంటీరియర్ అప్‌డేట్‌లు మరియు కొత్త ట్రాన్స్‌మిషన్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎక్ట్సీరియర్ విషయానికొస్తే, కొత్త ఎర్టిగాలో రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, అప్‌డేట్ చేయబడిన లైటింగ్ మరియు రివైజ్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు కొత్త అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉండనున్నాయి. ఇంటీరియర్ ఫీచ్రల విషయానికి వస్తే, ఎర్టిగాలో కొత్తగా 7 ఇంచ్ సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే యూనిట్, సుజుకి కనెక్ట్ టెక్నాలజీ మరియు కొత్త అప్‌హోలెస్ట్రీతో పాటుగా మరికొన్ని మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

క్యాబిన్ లోపల రిఫ్రెష్డ్ లుక్‌ని తీసుకురావడం కోసం కంపెనీ దాని ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఉండొచ్చని సమాచారం. మునుపటి మోడల్‌లో అందించిన అనేక ఫీచర్లను ఈ కొత్త మోడల్‌లో కూడా ఆశించవచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే, ఎర్టిగా ఎమ్‌పివి టాప్-ఎండ్ వేరియంట్లలో 360 డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి స్టాండర్డ్‌ ఫీచర్లతో పాటుగా మరికొన్ని ఇతర ఫీచర్లను కూడా ఆఫర్ చేయవచ్చని తెలిస్తోంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

2022 ఎర్టిగా - శక్తివంతమైన ఇంజన్

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పివిలో మునుపటి కన్నా మరింత శక్తివంతమైన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ కె15సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ మునుపటి కన్నా ఎక్కువ శక్తిని జనరేట్ చేయడమే కాకుండా, ఇంధన సామర్థ్యం (మైలేజ్) పరంగా కూడా మెరుగ్గా ఉండనుంది. మునుపటి మోడళ్లలో ఉపయోగించిన ఇదే ఇంజన్ ఉత్పత్తి చేసిన 103.5 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తే, ఈ కొత్త ఇంజన్ గరిష్టంగా 113.4 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

2022 ఎర్టిగా - సరికొత్త గేర్‌బాక్స్

ఈ కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో కంపెనీ అప్‌డేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, ఓ కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను కూడా పరిచయం చేయనుంది. ఇదివరకు ఈ కార్లలో అందించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ స్థానంలో కంపెనీ కొత్తగా ఓ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను అందించనుంది. ఈ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మునుపటి కన్నా మరింత సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని మరియు ఇది మైలేజ్ పరంగా కూడా మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉండొచ్చని సమాచారం, ఇదే గనుక నిజమైతే కొత్త ఎర్టిగా డ్రైవింగ్ మరింత సరదాగా ఉంటుంది.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

2022 ఎర్టిగా - వేరియంట్లు

ఇటీవల ఆన్‌లైన్ లో లీకైన వివరాల ప్కరాకం, కొత్త 2022 ఎర్టిగా ఎమ్‌పివి యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ మొత్తం 11 విభిన్న వేరియంట్‌లలో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. ఇందులో 4 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు, 3 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు, 2 సిఎన్‌జి వేరియంట్‌లు (మ్యాన్యువల్ మాత్రమే) మరియు 1 'టూర్' పెట్రోల్ వేరియంట్ అలాగే 1 'టూర్' సిఎన్‌జి వేరియంట్‌లు ఉండనున్నాయని సమాచారం.

రేపే కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా విడుదల: అంచనా ధర, ఫీచర్లు మరియు అప్‌డేట్స్

2022 ఎర్టిగా - కలర్ ఆప్షన్లు

మారుతి సుజుకి నుండి వస్తున్న ఈ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి కలర్ ఆప్షన్లు కూడా వెల్లడయ్యాయి. ఇది 7 విభిన్న ఎక్స్టీరియర్ కలర్లలో విడుదల కానుంది. వీటిలో పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, పెర్ల్ మెటాలిక్ డిగ్నిటీ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2022, 17:23 [IST]
English summary
Maruti suzuki ertiga facelift launch on 15th april 2022 all we know so far
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+