కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ (2022 Ertiga)కు సంబంధించి లీకైన వివరాలు..
మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఇటీవలి కాలంలో తన ఉత్పత్తులను తరచూ అప్‌డేట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఈ బ్రాండ్ నుండి రాబోయే కొత్త ఉత్పత్తి 2022 ఎర్టిగా (2022 Ertiga) ఎమ్‌పివి. కంపెనీ ఇటీవలే ఇందుకు సంబంధించిన ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. కాగా, ఇప్పుడు కొత్త ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి.

సమాచారం ప్రకారం, అప్‌డేట్ చేయబడిన కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివిలో శక్తివంతమైన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ K15C పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ మునుపటి కన్నా ఎక్కువ శక్తిని జనరేట్ చేయడమే కాకుండా, ఇంధన సామర్థ్యం పరంగా కూడా మెరుగ్గా ఉండనుంది. మునుపటి మోడళ్లలో ఉపయోగించిన ఇదే ఇంజన్ ఉత్పత్తి చేసిన 103.5 బిహెచ్‌పి శక్తితో పోలిస్తే కొత్త ఇంజన్ గరిష్టంగా 113.4 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి తమ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి మార్కెట్లో విడుదల చేసిన తర్వాత, కంపెనీ ఈ మోడల్ ఆధారంగా చేసిన ప్రీమియం ఎమ్‌పివి మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) లో కూడా ఓ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని విక్రయిస్తోంది. కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 లో కూడా ఇదే అప్‌డేటెడ్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు.

ఈ కొత్త ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 మోడళ్లలో అప్‌డేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, ఈ కార్లలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు బదులుగా కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కొత్త 2022 ఎర్టిగా ఎమ్‌పివి గురించి లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ అప్‌డేట్ చేయబడిన వెర్షన్ 11 విభిన్న వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. ఇందులో 4 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు, 3 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు, 2 CNG వేరియంట్‌లు (మ్యాన్యువల్ మాత్రమే) మరియు 1 'టూర్' పెట్రోల్ వేరియంట్ అలాగే 1 'టూర్' సిఎన్‌జి వేరియంట్‌లు ఉండనున్నాయి.

మారుతి సుజుకి నుండి రాబోయే ఈ అప్‌డేటెడ్ 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి కలర్ ఆప్షన్లు కూడా వెల్లడయ్యాయి. ఇది 7 విభిన్న ఎక్స్టీరియర్ కలర్లలో విడుదల కానుంది. వీటిలో పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, పెర్ల్ మెటాలిక్ డిగ్నిటీ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

డిజైన్ అప్‌డేట్స్ విషయానికి వస్తే, ఈ కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో భారీ డిజైన్ మార్పులు అయితే, ఉండబోవు. ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ మోడల్ మాత్రమే కాబట్టి, ఇందులో ముందు, వెనుక మరియు సైడ్స్‌లో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌డేట్‌లు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులు అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను ఈ కొత్త మోడల్ లో ఆశించవచ్చు.

అయితే, మారుతి సుజుకి ఈ కొత్త 2022 ఎర్టిగా ఎమ్‌పివి క్యాబిన్ లోపల రిఫ్రెష్డ్ లుక్‌ని తీసుకురావడం కోసం దాని ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. అలాగే, మరింత ప్రీమియం అప్పీల్ కోసం ఇందులోని అప్‌హోలెస్ట్రీని కూడా అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. మునుపటి మోడల్‌లో అందించిన మూడు వరుసలలో ఏసి వెంట్స్, Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఈ కొత్త మోడల్‌లో కూడా అందించనున్నారు.

అంతేకాకుండా, మారుతి సుజుకి ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త బాలెనో కారులో అందించిన కొన్ని ఫీచర్లను ఈ కొత్త 2022 ఎర్టిగాలో కూడా అందించే అవకాశం ఉంది. వీటిలో పెద్ద 9 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 360 డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, లెదర్‌తో చుట్టబడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో పాటుగా మరికొన్ని అదనపు ఫీచర్లను కంపెనీ ఇందులో ఆఫర్ చేసే అవకాశం ఉంది. మారుతి సుజుకి తమ ఎర్టిగాలో 6-ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేసి, దాని భద్రతా ప్రమాణాలను కూడా పెంచవచ్చని భావిస్తున్నారు.

కాగా, కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా (2022 Maruti Suzuki Ertiga) కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ ఎమ్‌పివిని అందరికన్నా ముందుగా సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ కానీ లేదా అధీకృత డీలర్‌షిప్‌ను కానీ సందర్శించి రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ఏప్రిల్ 15వ తేదీన మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications