కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇటీవల కొత్తగా విడుదల చేసిన ఎర్టిగాలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్‌లను పరిచయం చేయనుంది. కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా గత నెలలో విడుదలైనప్పుడు కంపెనీ, ఇందులో మూడు సిఎన్‌జి వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. తాజా సమాచారం ప్రకారం, ఇందులో మరో మూడు కొత్త వేరియంట్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

కొత్త 2022 మారుతి ఎర్టిగాను విడుదల చేసినప్పుడు కంపెనీ ఇందులో VXi, ZXi మరియు Tour M అనే మూడు వేరియంట్లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వం యొక్క రవాణా శాఖ జారీ చేసిన ఆమోదం సర్క్యులర్‌లో ఎర్టిగా యొక్క మరో మూడు CNG వెర్షన్‌లు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. వీటిలో VXi (O), ZXi (O) మరియు Tour M (O) అనే వేరియంట్లు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

మారుతి సుజుకి అందించే ఆప్షనల్ (O) వేరియంట్లు ఎల్లప్పుడూ కస్టమర్‌లు తమ కొత్త కార్లకు కావలసిన అదనపు ఫీచర్‌లను జోడించడానికి అనుమతిస్తాయి. ఈ నేపథ్యంలో, ఎర్టిగా సిఎన్‌జి మోడళ్లో రాబోయే కొత్త ట్రిమ్‌లు కూడా అదే పాలసీకి కొనసాగింపుగా ఉండవచ్చని భావిస్తున్నారు. అంటే, దీని అర్థం రాబోయే (O) CNG వెర్షన్ ఎర్టిగా యొక్క యజమానులు లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను ఎంచుకోవచ్చు లేదా ముందు వైపు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి మరిన్ని అదనపు భద్రతా ఫీచర్లను జోడించుకోవచ్చు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

అంతేకాకుండా, 'హే సుజుకి' అనే క్యాచ్‌ఫ్రేజ్‌ని (వాయిస్ కమాండ్) ఉపయోగించి యాక్సెస్ చేయగల 40 కి పైగా లేటెస్ట్ కార్ కెనక్టింగ్ ఫీచర్‌లను అందించే సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆప్షన్లను పొందవచ్చు. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది మరియు ఇది అనుకూలమైన స్మార్ట్‌వాచ్‌లతో కూడా కనెక్ట్ చేయగలదు.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

కొత్త 2022 ఎర్టిగా (2022 Ertiga) ఎమ్‌పివి విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్ ఇప్పుడు రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో పాటుగా కొత్త ఇంజన్ మరియు కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా (2022 Maruti Suzuki Ertiga) ధరలు రూ.8.35 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మరియు డిజైన్లలో మార్పులు చేర్పులు చేసింది. ముందు భాగంలో కొత్త గ్రిల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి. ఇంటీరియర్స్ లో 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క లేటెస్ట్ వెర్షన్, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్‌లో), ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, సీట్ బ్యాక్ రిక్లైనర్ మరియు ఫ్లాట్ ఫోల్డ్ ఆప్షన్‌తో కూడిన 50:50 స్ప్లిట్ థర్డ్ రో సీట్స్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇజి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో గరిష్టంగా 105 పిఎస్ పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, కంపెనీ ఇందులో మునుపటి 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిమీ మైలేజీనిస్తుండగా, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.11 కిమీ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త 2022 ఎర్టిగాలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తోంది. కాగా, హై-ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ మెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో మరిన్ని సిఎన్‌జి వేరియంట్లు..

ఇంకా, ఇందులో యాంటీ-పించ్ ఫీచర్‌తో కూడిన డ్రైవర్ సైడ్ ఆటో-విండో, ఫాలో మీ హోమ్ ఫంక్షనాలిటీతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రిట్రాక్టబుల్ కీ-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్ మరియు S-CNG వేరియంట్‌లలో సిఎన్‌జి నిర్దిష్ట స్పీడోమీటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది 7 విభిన్న ఎక్స్టీరియర్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, డిగ్నిటీ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో డిగ్నిటీ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లు కొత్తగా ప్రవేశపెట్టబడినవి.

Most Read Articles

English summary
Maruti suzuki ertiga to get three more cng variants details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X