మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లతో గట్టి పోటీతో నిండిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో తన సత్తా ఏంటో చూపేందుకు మారుతి సుజుకి కూడా తమ సరికొత్త "గ్రాండ్ విటారా" (Grand Vitara) ఎస్‌యూవీ ఈ విభాగంలో విడుదల చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పటికే మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది మరియు ఆగస్ట్ నెలలో ఈ కారు ధరలను ప్రకటించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) యొక్క వేరియంట్లు మరియు వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలను కూడా కంపెనీ వెల్లడి చేసింది. మారుతి సుజుకి మరియు టొయోటా కంపెనీలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఎస్‌యూవీని టొయోటా కూడా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) అనే పేరుతో రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. కాబట్టి, ఈ రెండు మోడళ్లు డిజైన్ పరంగా బయటకు వేరేలా కనిపించినప్పటికీ, అంతర్గతంగా ఇవి రెండూ కూడా ఒకే రకమైన ఇంజన్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

మారుతి సుజుకి తమ గ్రాండ్ విటారా మిడ్-సైజ్ ఎస్‌యూవీని తమ ప్రీమియం డీలర్‌షిప్ అయిన (Nexa) ద్వారా మాత్రమే విక్రయిస్తుంది, ఇది అరెనా షోరూమ్ లలో అందుబాటులో ఉండదు. కొత్త గ్రాండ్ విటారా ను కంపెనీ మొత్తం ఆరు వేరియంట్లలో విక్రయించనుంది. వీటిలో సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, జెటా ప్లస్, ఆల్ఫా ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో బేస్ వేరియంట్ అయిన గ్రాండ్ విటారా సిగ్మా లో లభించే ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

గ్రాండ్ విటారా యొక్క బేస్ 'సిగ్మా' వేరియంట్ మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా, ఇది ప్రత్యేకంగా ఫ్రంట్-వీల్ డ్రైవ్‌ వేరియంట్ గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ వంటి ఫీచర్లు లభ్యం కావు. ఈ బేస్ వేరియంట్ ఎక్స్టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు సైడ్ మిర్రర్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్‌లు మొదలైనవి ఉన్నాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

సిగ్మా బేస్ వేరియంట్ కావడంతో, ఇందులో అల్లాయ్ వీల్స్‌ లభించవు, దానికి బదులుగా వీల్ కవర్‌లతో కూడిన 17 ఇంచ్ స్టీల్ వీల్స్ లభిస్తాయి. కారు లోపలి భాగంలో ఫీచర్లను గమనిస్తే, బేస్ 'సిగ్మా' వేరియంట్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, 4.2 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, మ్యూజిక్ సిస్టమ్, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్లు వంటి మరెన్నో ఇతర ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

సేఫ్టీ విషయయానికి వస్తే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా బేస్ సిగ్మా వేరియంట్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

ఓసారి మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క బేస్ 'సిగ్మా' వేరియంట్‌లోని ఫీచర్లను విశ్లేషిస్తే, ఇది ఓ సాధారణ కారులో కావల్సిన అన్ని ఫీచర్లను కలిగి ఉంది. కాకపోతే, ఇది ప్రీమియం కారు కాబట్టి కస్టమర్లు ఇందులో మంచి నాణ్యమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ మరియు ప్రీమియం లుకింగ్ అల్లాయ్ వీల్స్ ను కోరుకుంటారు. కావాలనుకుంటే, కస్టమర్లు ఈ రెండింటినీ ఆఫ్టర్ మార్కెట్లో తక్కువ ధరకే కొనుగోలు చేసి, ఈ ఎంట్రీ లెవల్ వేరియంట్ ను టాప్-ఎండ్ వేరియంట్ గా కనిపించేలా మార్చుకోవచ్చు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, ఈ బేస్ వేరియంట్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో 1.5-లీటర్ కె-సిరీస్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103.06 బిహెచ్‌పి పవర్ ను మరియు 136.8 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఇంజన్ నుంచి వచ్చే శక్తి ముందు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. గ్రాండ్ విటారా మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా సిగ్మా బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు చూడండి..

గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క ధరలను మారుతి సుజుకి ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, మార్కెట్లో ఈ బేస్ 'సిగ్మా' వేరియంట్ ధర సుమారు రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్‌) ఉంటుందని అంచనా వేయబడింది. ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు అగ్రెసివ్ ధర కారణంగా ఈ బేస్ వేరియంట్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్మడయ్యే ఛాన్స్ ఉంది. ఫలితంగా, ఈ బేస్ సిగ్మా వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Wednesday, July 27, 2022, 8:00 [IST]
English summary
Maruti suzuki grand vitara base sigma variant features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+